Political News

పోల‌వ‌రంలో సేన మారాల్సిందే.. !

పోల‌వ‌రం జిల్లాలో తాజాగా జ‌రిగిన పరిషత్ ఎన్నికలలో జ‌న‌సేన పూర్తిగా ఇరుకున ప‌డింది. రాష్ట్ర వ్యాప్తంగా జ‌న‌సేన‌కు ప్ర‌జ‌లు జేజేలు కొట్టినా.. ఇక్క‌డ మాత్రం వైసీపీ పుంజుకుని.. సేన‌కు షాకిచ్చింద‌నే చెప్పాలి. పోలవరం జిల్లాలోని మొత్తం 12 జడ్పీటీసీ స్థానాలలో వైసీపీ ఏకంగా 5 స్థానాల‌ను కైవ‌సం చేసుకుంది. టీడీపీ 4, జ‌న‌సేన 2, బీజేపీ 1 స్థానానికి ప‌రిమితం అయ్యాయి. ఇక‌, ఇదే జిల్లాలోని చింతూరు డివిజన్ పరిధిలోని మొత్తం 39 ఎంపీటీసీ స్థానాలలో వైసీపీ బ‌ల‌మైన స్థానాల్లో 17 సొంతం చేసుకుంది.

ఇక‌, టీడీపీ 10 స్థానాలు. సీపీఎం 5 స్థానాలు, జ‌నసేన 4 చోట్ల విజ‌యం ద‌క్కించుకున్నాయి. మొత్తంగా ఈ ఫ‌లితాలకు జ‌న‌సేన‌కు మ‌ధ్య లింకు ఉంది. ఇక్క‌డ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే జ‌న‌సేన పార్టీనాయ‌కుడే కావ‌డం గ‌మ‌నార్హం. అయితే.. అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల్లో దాదాపు ఆయా పార్టీలే ప్ర‌భావం చూపించాయి. కాని.. పోల‌వ‌రం విష‌యానికి వ‌స్తే మాత్రం ఈ సీన్ తిర‌గ‌బ‌డింద‌ని అంటున్నారు. ఇక్క‌డ ప్ర‌జ‌లు ఎమ్మెల్యేకు వ్య‌తిరేకంగా ఇచ్చిన తీర్పుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

గ‌త రెండున్న‌రేళ్ల‌లో తొలి ఏడాదిఫ‌ర్వాలేద‌ని అనుకున్నా.. ఆ త‌ర్వాత‌.. ఎమ్మెల్యే చిర్రి బాల‌రాజు వివాదానికి కేంద్రంగా మారారు. ఆయ‌న‌పై అనేక ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. కుటుంబ వివాదాల‌తోపాటు.. ప‌లు వీడియోలు కూడా సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం అయ్యాయి. వీటి విష‌యంలో పార్టీ కూడా ప‌లు మార్లు ఆయ‌న‌ను హెచ్చ‌రించింది. మార్పు దిశ‌గా అడుగులు వేయాల‌ని సూచించింది. నిజానికి స్థానిక ఎన్నిక‌ల‌కు ముందు కూడా.. ఎమ్మెల్యేను పిలిచి పార్టీ నేత‌లు చ‌ర్చించారు.

అయినా బాల‌రాజు వ్య‌వ‌హారంలో స్థానిక ప్ర‌జ‌ల‌పై ప‌డిన‌ ముద్ర పోలేదు. ఆయ‌న మారాన‌ని అంటున్నా.. ప్ర‌జ‌లు ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్న‌ట్టు క‌నిపించ‌లేదు. మ‌రీ ముఖ్యంగా గిరిజ‌న ప్రాంతాల్లో వైసీపీకి ప‌ట్టున్న నేప‌థ్యంలో  ఆపార్టీపుంజుకునే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం ఉన్నా.. దీనికి త‌గిన విధంగా బాల‌రాజు త‌న వ్యూహాల‌ను అమ‌లు చేయ‌లేక పోయారు. మ‌రోవైపు త‌న‌పై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌తోనే ఆయ‌న స‌మ‌యం స‌రిపోయింది. మొత్తంగా వ‌చ్చే ఎన్నిక‌ల నాటికిఎమ్మెల్యే తీరు అయినా.. మారాలి. లేక‌పోతే పార్టీ అయినా.. ఇక్క‌డ మార్పు దిశ‌గా అడుగులు వేయాలి. లేక‌పోతే.. జ‌న‌సేన‌కు క‌ష్ట‌మ‌నే సంకేతాలు ప్ర‌జ‌లు ఇచ్చేశారు.

This post was last modified on November 8, 2026 5:15 pm

Share

Recent Posts

సౌండ్ లేని టపాసులిచ్చిన తెలుగు స్టార్లు

తెలుగునాట అతి పెద్ద పండగల్లో దీపావళి ఒకటి. సెలవులు ఎక్కువ ఉండకపోయినా సెలబ్రేషన్స్ పీక్స్ లో ఉంటాయి. ముఖ్యంగా టపాసుల…

36 minutes ago

ఇప్ప‌టికైనా మార్పు వ‌స్తుందా జ‌గ‌న్‌ గారూ!

ఒక మార్పు మ‌నిషినే కాదు.. రాజ‌కీయాల‌ను కూడా మార్చేస్తుంది. అమ‌రావ‌తికి క‌ట్టుబ‌డి ఉంటామ‌ని.. అమ‌రావ‌తి రాజ‌ధానిని మార్చ‌బోమ‌ని.. అస‌లు అమ‌రావ‌తి…

46 minutes ago

రాజమౌళి రాముడి మీద డౌట్ అక్కర్లేదు

ఇప్పుడు ఎక్కడ చూసినా రామాయణ పార్ట్ 1 కు వచ్చిన స్పందన, రికార్డు కలెక్షన్ల గురించిన చర్చే జరుగుతోంది. హిందీలోనే…

2 hours ago

ఫొటోస్: మాళవిక దీపావళి బ్లాస్ట్

ప్రభాస్ ది రాజా‌ సాబ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన హీరోయిన్ మళవిక మోహనన్.‌ తాజాగా ఈ ముద్దుగుమ్మ.. తన…

2 hours ago

వంశీ గెలిచారు.. కొడాలి ఓడారు.. !

తాజాగా జ‌రిగిన ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ ఎన్నిక‌ల్లో అనేక ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ఉమ్మ‌డి కృష్ణా జిల్లాలోని గ‌న్న‌వ‌రం, గుడివాడ…

3 hours ago

మార్కెటింగ్ రూటు మార్చాల్సిందే దాదా

డిసెంబర్ 24 విడుదల కాబోతున్న దాదా మీద బాలకృష్ణ అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. గత ఏడాది అఖండ 2…

3 hours ago