Political News

ఇప్ప‌టికైనా మార్పు వ‌స్తుందా జ‌గ‌న్‌ గారూ!

ఒక మార్పు మ‌నిషినే కాదు.. రాజ‌కీయాల‌ను కూడా మార్చేస్తుంది. అమ‌రావ‌తికి క‌ట్టుబ‌డి ఉంటామ‌ని.. అమ‌రావ‌తి రాజ‌ధానిని మార్చ‌బోమ‌ని.. అస‌లు అమ‌రావ‌తి కోస‌మే.. త‌మ నాయ‌కుడు తాడేప‌ల్లిలో ప్యాలెస్ కూడా క‌ట్టుకున్నార‌ని వైసీపీ నాయ‌కులు 2019 ఎన్నిక‌ల‌కు ముందు ప్ర‌క‌టించారు. కానీ, అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. మారిపోయారు. మూడు రాజ‌ధానుల పేరుతో చెల‌గాటం ఆడారు. అమ‌రావ‌తి రైతుల‌పై కేసులు పెట్టారు. అటు అమ‌రావ‌తి డెవ‌ల‌ప్ కాలేదు. ఇటు.. మూడు రాజ‌ధానుల ముచ్చ‌టా తీర‌లేదు.

ఫ‌లితంగా ప్ర‌జ‌లు వైసీపీని నిర్దాక్షిణ్యంగా ప‌క్క‌న పెట్టారు. 2019-24 వ‌ర‌కు రాష్ట్రంలో సంక్షేమ ప్ర‌భుత్వాన్ని.. పాల‌నను అందించామ‌ని ఊరూ వాడా చెప్పినా.. ప్ర‌జ‌లు ప‌ట్టించుకోలేదు. 2 ల‌క్ష‌ల 70 వేల కోట్ల రూపాయ‌ల‌ను అప్పు చేసి మ‌రీ పేద‌ల‌కు పంచామ‌ని.. బ‌ట‌న్లు నొక్కామ‌ని చెప్పినా.. ప్ర‌జ‌లు వినిపించుకోలేదు. చూసింది.. ఓటు వేసింది కూడా.. అభివృద్ధికి, అరాచ‌కాల‌కు వ్య‌తిరేకంగానే!. ఆ త‌ర‌హా మార్పు ప్ర‌జ‌ల్లో క‌నిపించింది. ఎంతో ఇష్ట‌ప‌డి ఒక్క ఛాన్స్ ఇచ్చిన‌.. జ‌గ‌న్ లో వ‌చ్చిన మార్పును ప్ర‌జ‌లు జీర్ణించుకోలేక వారే మారిపోయారు.

క‌ట్ చేస్తే.. 2024లో భారీ ఓట‌మి. వైసీపీ అధినేత జ‌గ‌న్ స‌హ‌జంగానే పెద్ద‌గా స్పందించే గుణం లేద‌ని నాయ‌కుడు. అంటే.. ఆయ‌న‌కు ఎదురు దెబ్బ‌లు కామ‌నేనని అంటారు. 16 నెల‌లు జైల్లో ఉన్న అనుభ‌వమో లేక ఏమో తెలియ‌దు కానీ.. ఆయ‌న ఎలాంటి వాటికీ పెద్ద‌గా స్పందించ‌రు. కానీ, 2024లో ప్ర‌జ‌లు ఇచ్చిన తీర్పుతో ఆయ‌న ఉలిక్కి ప‌డ్డారు. హుటాహుటిన మీడియా ముందుకు వ‌చ్చి త‌ల‌ప‌ట్టుకున్నారు. ఊహించ‌లేద‌న్నారు. అస‌లు ఏం జ‌రిగిందో కూడా త‌మ‌కు అర్థంకావ‌డం లేద‌ని వ‌గ‌చారు. 11 స్థానాల‌కు ప‌రిమితం అయ్యారు.

మ‌రి ఈ  రెండున్న‌రేళ్ల‌లో ఏమైనా మార్పు వ‌చ్చిందా?  అంటే.. లేదు. ఇది నిష్టుర స‌త్యం. పైగా గంజాయి బ్యాచ్ ను ప‌ల‌క‌రించ‌డం.. వారి కుటుంబాల‌ను ప‌రామ‌ర్శించ‌డం..ర‌ప్పా ర‌ప్పా బ్యాచ్‌ను ప్రోత్స‌హించ‌డం.. చంపుతాం.. న‌రుకుతాం.. గంగ‌మ్మ జాత‌ర‌లో పొట్టేళ్ల‌ను న‌రికిన‌ట్టున‌రుకుతాం.. అన్న‌వారిని వెనుకేసుకు రావ‌డం వంటివి ప్ర‌జ‌ల్లో వైసీపీపై ఇంకా మ‌ర‌క‌ల‌ను కొన‌సాగిస్తూనే ఉన్నాయి.

ఈ ఫలితమే.. స్థానిక‌, మండ‌ల‌, జిల్లా ప‌రిష‌త్ ఎన్నికల్లోవైసీపీకి చావు దెబ్బ త‌గిలేలా చేసింది. మ‌రి ఇప్ప‌టికైనా వాస్తవాలు తెలుసుకుని.. ప్ర‌జ‌ల నాడిని ప‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తారా? లేదా? అనేది వైసీపీ కుటుంబ పెద్ద‌గా జ‌గ‌న్‌పైనే ఉంటుంద‌న్న‌ది ప‌రిశీల‌కులు చెబుతున్న మాట‌.

This post was last modified on November 8, 2026 4:19 pm

Share

Recent Posts

రాజమౌళి రాముడి మీద డౌట్ అక్కర్లేదు

ఇప్పుడు ఎక్కడ చూసినా రామాయణ పార్ట్ 1 కు వచ్చిన స్పందన, రికార్డు కలెక్షన్ల గురించిన చర్చే జరుగుతోంది. హిందీలోనే…

1 hour ago

ఫొటోస్: మాళవిక దీపావళి బ్లాస్ట్

ప్రభాస్ ది రాజా‌ సాబ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన హీరోయిన్ మళవిక మోహనన్.‌ తాజాగా ఈ ముద్దుగుమ్మ.. తన…

2 hours ago

వంశీ గెలిచారు.. కొడాలి ఓడారు.. !

తాజాగా జ‌రిగిన ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ ఎన్నిక‌ల్లో అనేక ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ఉమ్మ‌డి కృష్ణా జిల్లాలోని గ‌న్న‌వ‌రం, గుడివాడ…

2 hours ago

మార్కెటింగ్ రూటు మార్చాల్సిందే దాదా

డిసెంబర్ 24 విడుదల కాబోతున్న దాదా మీద బాలకృష్ణ అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. గత ఏడాది అఖండ 2…

2 hours ago

ఆ కూటమి నేత‌ల‌కు క్లాసిస్తారా.. ప‌క్క‌న పెడ‌తారా?!

ప్ర‌స్తుతం ఏపీలో జ‌రిగిన స్థానిక ఎన్నిక‌ల్లో కూట‌మి త‌ర‌ఫున అభ్య‌ర్థులు విజ‌యం ద‌క్కించుకున్నా.. ఎక్క‌డో ఒక త‌ర‌హా అసంతృప్తి అయితే..…

2 hours ago

జైల్లో ఉన్నా గెలిపించారు… మాజీ ఎంపీని ఓడించారు!

జైలుకు వెళ్లిన నాయ‌కులు రాజ‌కీయాల్లో స‌క్సెస్ అవుతున్నార‌నే మాట మ‌రోసారి నిజ‌మైంది. తాజాగా జ‌రిగిన జ‌డ్‌పీటీసీ ఎన్నిక‌ల్లో ఓ నాయ‌కుడు…

3 hours ago