2027 సంక్రాంతి బాక్సాఫీస్ పోటీకి సంబంధించి మెల్లగా మబ్బులు వీడుతున్నాయి. ప్రమోషన్ల పరంగా ఒకరు ముందు, ఒకరు వెనుకా ఉన్నప్పటికీ పండగ టైం లోపల అందరూ పబ్లిసిటీ స్పీడ్ పెంచేసి జనాలను ఆకట్టుకునే ప్రయత్నాలు పెంచబోతున్నారు. జనవరి 8 ‘మహాకాళి’ రెడీ అవుతోంది. నిర్మాత ప్రశాంత్ వర్మ కాంపిటీషన్ గురించి ఆలోచించడం లేదట. హనుమాన్ లాగే ఇది కూడా పోటీలో గెలిచే తీరుతుందని, ఆ కాన్ఫిడెన్స్ తోనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగవంతం చేశారని యూనిట్ టాక్.
ఎలాంటి సౌండ్ ప్రస్తుతం చేయకపోయినా సాయిదుర్గ తేజ్ ‘సంబరాల ఏటిగట్టు’ కూడా జనవరి 12 రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇది సోలోగా వస్తే బాగుంటుందనే అభిప్రాయం అభిమానుల్లో ఉన్నప్పటికీ ఓటిటి డీల్ తో సహా ఇతరత్రా కారణాల వల్ల వెనక్కు తగ్గే అవకాశాలు తక్కువగా ఉన్నాయని అంటున్నారు. అదే నిజమైన పక్షంలో డిసెంబర్ రెండో వారం నుంచి ప్రచారం ఊపందుకోవచ్చు. ఇక వెంకటేష్ అనిల్ రావిపూడి ‘జనవరి 12 విడుదల’ ఆల్రెడీ ఫస్ట్ హాఫ్ రీ రికార్డింగ్ అయిపోయింది. ఇంకొంత షూట్ పెండింగ్ ఉంది.
పది రోజుల్లో క్లైమాక్స్ తో పాటు మిగిలిన భాగాన్ని పూర్తి చేస్తామని ఇటీవలే ఈఫీ ఫిలిం ఫెస్టివల్ లో సాహూ గారపాటి వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇక మెగా కన్ఫ్యూజన్ కూడా ఒక కొలిక్కి వస్తోంది. జనవరి 13 కాకా స్థానంలో ‘విశ్వంభర’ దిగడం దాదాపు ఖాయమైనట్టే. చర్చలు ఒక కొలిక్కి వచ్చాయట. కాకాని ఏప్రిల్ కు పంపించే విధంగా ఒక నిర్ణయం తీసుకున్నారని వినికిడి. ఇంకో అయిదారు రోజుల్లో అధికారిక ప్రకటన రావొచ్చు. ఇక ఫెస్టివల్ చివర్లో జనవరి 14 పెద్ద ఎంటర్ టైన్మెంట్ క్లాష్ జరగనుంది.
శర్వానంద్, శ్రీను వైట్ల కాంబోలో తెరకెక్కించిన ‘జార్జ్ క్రిష్’ మీద టీమ్ చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. శ్రీవిష్ణు హీరోగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రూపొందిన ‘ఫ్యామిలీ ప్యాక్’ కూడా అదే రోజు దించుతున్నారు. రెండూ వినోదాత్మక చిత్రాలే కావడం గమనించాల్సిన విషయం. తమిళ డబ్బింగుల సంగతి చూస్తే పా రంజిత్ ‘వెట్టువమ్’ ఒకటే లాకయ్యింది. దీంతో మనకొచ్చిన ఇబ్బందేం లేదు. పైన చెప్పిన లైనప్ లో దాదాపు ఎలాంటి మార్పు లేదు. చాలా రసవత్తరమైన పోటీ అయితే చూడబోతున్నాం.
This post was last modified on November 27, 2026 7:56 pm
రామ్ చరణ్ 17 కోసం అడుగులు మొదలయ్యాయి. పూజా కార్యక్రమాలు ఆల్రెడీ చేసినప్పటికీ ఇంకా రెగ్యులర్ షూటింగ్ మొదలవ్వలేదు. డిసెంబర్…
విశాఖలో గత వైసీపీ ప్రభుత్వం నిర్మించిన రుషికొండ ప్యాలెస్ ఎట్టకేలకు వినియోగంలోకి రానుంది. జగన్ నిర్మించిన ఈ ప్యాలెస్ ను…
రెబెల్ స్టార్ ప్రభాస్ రెండు సినిమాలు వచ్చే ఏడాది విడుదలకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఫౌజీ ఏప్రిల్, స్పిరిట్…
దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకున్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అర్జున్ రెడ్డితో మొదలుపెట్టి యానిమల్ దాకా తీసింది అతి…
టాలీవుడ్ లో ఇప్పుడో కొత్త పేరు బాగా హల్చల్ చేస్తోంది. ఆకాశంలో ఒక తార అంత పోటీలో విజయం సాధించడం…
మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ మధ్య అనుబంధం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇద్దరూ సోదరులే కానీ.. పవన్…