Movie News

చైతు నితిన్ మధ్య పోటీ ప్రసక్తి ఎందుకు

రెండు కంటెంట్ ఉన్న సినిమాలు ఒకేరోజు రిలీజవుతున్నప్పుడు ఆయా హీరోల అభిమానుల మధ్య మాది గొప్పంటే మాది గొప్పంటూ ఆన్ లైన్ వేదికగా ఫ్యాన్ వార్ జరగడం సహజం. డిసెంబర్ 4 రిలీజవుతున్న వృషకర్మ, అలియాస్ రుక్మిణి కోసం నాగచైతన్య, నాని ఫ్యాన్స్ ఇలాంటిదే మొదలుపెట్టారు. పోలికలు తీసుకొచ్చి ఎక్స్ వేదికగా ట్రైలర్లు, పోస్టర్లను కంపేర్ చేస్తూ డిబేట్లు పెడుతున్నారు. నిజం చెప్పాలంటే చైతు నితిన్ మధ్య పోటీ ప్రసక్తే తేకూడదు. ఎందుకో చిన్న విశ్లేషణ చేద్దాం.

నాగచైతన్య కంటే నితిన్ సీనియర్. ఏడేళ్ల ముందు ఇండస్ట్రీకి వచ్చాడు. జయం రూపంలో డెబ్యూతోనే సూపర్ డూపర్ హిట్ సాధించాడు. తర్వాత కెరీర్ బాగానే నెట్టుకొచ్చినప్పటికీ గత కొన్నేళ్లుగా వరస డిజాస్టర్లతో తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. ఇలాంటి టైంలో రీజనబుల్ బడ్జెట్ తో ఇప్పటిదాకా టచ్ చేయని పాయింట్ తో నిర్మాతగా నాని ఒక స్టోరీ పంపిస్తే దానికి ఓకే చెప్పాడు. అంతా ప్లానింగ్ ప్రకారమే జరిగిపోయింది. బిజినెస్ పరంగా రిస్క్ లేకుండా ఉంది. డీసెంట్ టాక్ వచ్చినా చాలు మంచి లాభాలు వస్తాయి.

ఇక చైతు విషయానికి వస్తే తండేల్ ముందు తను కూడా స్ట్రగుల్ లో ఉన్నాడు. కస్టడీ లాంటివి దారుణంగా దెబ్బేయగా హిందీలో ట్రై చేసిన లాల్ సింగ్ చద్దా పైసా ప్రయోజనం కలిగించలేదు. ఇప్పుడు ట్రాక్ లో ఉన్నాడు. వృషకర్మ కోసం ఏడాదిన్నర కష్టపడ్డాడు. ఫాంటసీ జానర్ కావడం వల్ల నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ భారీగా ఖర్చు పెట్టారు. ట్రైలర్ విజువల్స్ చాలా షాకింగ్ గా ఉన్నాయి. కనెక్ట్ అయితే మటుకు వృషకర్మ వసూళ్లకు ఆకాశమే హద్దవుతుంది. ఫ్యాన్స్ ఆ నమ్మకంతోనే ఉన్నారు.

మార్కెట్ పరంగా చైతు కొంచెం ఎక్కువ ఎడ్జ్ లో ఉన్న మాట వాస్తవం. నితిన్ కంబ్యాక్ అలియాస్ రుక్మిణితో జరుగుతుందనే పాజిటివ్ వైబ్ అన్ని వర్గాల్లో ఉంది. జానర్లు వేరు. సబ్జెక్టులు వేరు, బడ్జెట్లు వేరు. సో అసలు పోలిక పెట్టడమే సమంజసం కాదు. బాగున్నాయని అనిపించుకుంటే రెండూ ఆడతాయి. ఎందుకంటే డిసెంబర్ మొదటి వారంకి బ్లాక్ బస్టర్ ట్రాక్ రికార్డు ఉంది. పుష్ప 2, అఖండ, యానిమల్ లాంటివి ఈ టైంలోనే వచ్చి చరిత్ర సృష్టించాయి. మరి వృషకర్మ, అలియాస్ రుక్మిణి ఏం చేస్తాయో చూడాలి.  

This post was last modified on November 27, 2026 9:21 pm

Share

Recent Posts

ఎన్విడియా సీఈఓను కాపాడింది నేనే: కేఏ పాల్

ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ మరోసారి తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ సంస్థ ఎన్విడియా…

6 minutes ago

సంక్రాంతి 2027… క్లారిటీ వచ్చేసినట్టే

2027 సంక్రాంతి బాక్సాఫీస్ పోటీకి సంబంధించి మెల్లగా మబ్బులు వీడుతున్నాయి. ప్రమోషన్ల పరంగా ఒకరు ముందు, ఒకరు వెనుకా ఉన్నప్పటికీ…

2 hours ago

సుకుమార్ ఇలా చేయడం మొదటిసారేమో

రామ్ చరణ్ 17 కోసం అడుగులు మొదలయ్యాయి. పూజా కార్యక్రమాలు ఆల్రెడీ చేసినప్పటికీ ఇంకా రెగ్యులర్ షూటింగ్ మొదలవ్వలేదు. డిసెంబర్…

2 hours ago

ఎట్టకేలకు రుషికొండ ప్యాలెస్ చిక్కుముడి తొలగింది

విశాఖలో గత వైసీపీ ప్రభుత్వం నిర్మించిన రుషికొండ ప్యాలెస్ ఎట్టకేలకు వినియోగంలోకి రానుంది. జగన్ నిర్మించిన ఈ ప్యాలెస్ ను…

2 hours ago

ప్రభాస్ ఇలా ఆలోచించడమే కావాలి

రెబెల్ స్టార్ ప్రభాస్ రెండు సినిమాలు వచ్చే ఏడాది విడుదలకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఫౌజీ ఏప్రిల్, స్పిరిట్…

4 hours ago

సందీప్ వంగా ఫ్యానిజం మళ్ళీ బయటపడింది

దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకున్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అర్జున్ రెడ్డితో మొదలుపెట్టి యానిమల్ దాకా తీసింది అతి…

4 hours ago