విశాఖలో గత వైసీపీ ప్రభుత్వం నిర్మించిన రుషికొండ ప్యాలెస్ ఎట్టకేలకు వినియోగంలోకి రానుంది. జగన్ నిర్మించిన ఈ ప్యాలెస్ ను ఏం చేయాలో అర్ధంకాక కూటమి ప్రభుత్వం తలలు పట్టుకుంది. వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేసి నిర్మించిన ఈ ప్యాలెస్ ను ఏదో ఒక విధంగా వినియోగంలోకి తీసుకొని రావాలని చంద్రబాబు ప్రభుత్వం చేయని ప్రయత్నం లేదు. ప్రజల సందర్శన కోసం పర్యాటక రంగానికి అప్పగించాలని తాజాగా కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
ఇప్పటికే రుషికొండ ప్యాలెస్ వినియోగం గురించి నిర్ణయం తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సబ్ కమిటీ వేసివుంది. ఈ భవనాల వినియోగంపై సబ్ కమిటీ పలు సిఫారసులు చేసింది. ఆ సిఫార్సుల మేరకు ఆతిథ్య రంగానికి చెందిన నిపుణులతోనూ చర్చించారు. ఈ నేపథ్యంలో నాలుగు నెలల పాటు ప్రజల సందర్శన కోసం రుషికొండ ప్యాలెస్‌ను తెరవాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం రుసుము వసూలు చేయనున్నారు.
అలాగే పీపీపీ పద్దతిలో ఆతిథ్య రంగానికి అప్పగించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రాజెక్టును నిర్వహించడానికి టాటా గ్రూప్, లీలా ప్యాలెస్ వంటి దిగ్గజ సంస్థలతో సహా మొత్తం 9 కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్నాయి. వచ్చే 120 రోజుల్లో ప్రైవేటు భాగస్వామిని ఎంపిక చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. నిబంధనల సడలింపులతో మరో 4 ఎకరాల్లో గరిష్ఠంగా 150 గదుల వరకు నిర్మించుకునే వెసులుబాటు కల్పించనున్నారు.
గత వైసీపీ ప్రభుత్వం ఈ ప్యాలెస్ ను 452 కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్మించింది. తొలుత పర్యాటక ప్రాజెక్టుగా దీనికి 240 కోట్ల రూపాయలు అంచనా వేయగా, తుది నిర్మాణం పూర్తయ్యేసరికి వ్యయం 450 కోట్ల రూపాయలు దాటింది. పర్యాటక శాఖ అనుమతులతో విజయనగర, కళింగ, చోళ, పల్లవ, గజపతి, వేంగి, తూర్పు గంగ పేర్లతో ఏడు బ్లాకులతో కూడిన కూడిన సముదాయాన్నినిర్మించారు.
ఒకవైపు ఆర్ధిక సంక్షోభం ఉన్నప్పటికీ సుమారు 500 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం విమర్శలకు తావిచ్చింది. దీని నిర్వాహణకు ప్రస్తుతం నెలకు సుమారు 25 లక్షల రూపాయలు అంటే ఏడాదికి 3 కోట్ల రూపాయలకు పైగా ఖర్చవుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్నారు. ఎట్టాగో ఇప్పుడు రుషికొండకు ఒక పరిష్కారం వచ్చింది.
This post was last modified on November 27, 2026 7:31 pm
రెండు కంటెంట్ ఉన్న సినిమాలు ఒకేరోజు రిలీజవుతున్నప్పుడు ఆయా హీరోల అభిమానుల మధ్య మాది గొప్పంటే మాది గొప్పంటూ ఆన్…
2027 సంక్రాంతి బాక్సాఫీస్ పోటీకి సంబంధించి మెల్లగా మబ్బులు వీడుతున్నాయి. ప్రమోషన్ల పరంగా ఒకరు ముందు, ఒకరు వెనుకా ఉన్నప్పటికీ…
రామ్ చరణ్ 17 కోసం అడుగులు మొదలయ్యాయి. పూజా కార్యక్రమాలు ఆల్రెడీ చేసినప్పటికీ ఇంకా రెగ్యులర్ షూటింగ్ మొదలవ్వలేదు. డిసెంబర్…
రెబెల్ స్టార్ ప్రభాస్ రెండు సినిమాలు వచ్చే ఏడాది విడుదలకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఫౌజీ ఏప్రిల్, స్పిరిట్…
దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకున్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అర్జున్ రెడ్డితో మొదలుపెట్టి యానిమల్ దాకా తీసింది అతి…
టాలీవుడ్ లో ఇప్పుడో కొత్త పేరు బాగా హల్చల్ చేస్తోంది. ఆకాశంలో ఒక తార అంత పోటీలో విజయం సాధించడం…