Trends

గూగుల్‌ ట్రెండ్‌: బ్లూ డ్ర‌మ్ మ‌ర్డ‌ర్‌పై తెగ వెతికేశారు!

ఏదైనా కొత్త విష‌యం తెర‌మీద‌కు రాగానే గూగుల్‌లో వెతికేయ‌డం .. దాని గురించి తెలుసుకునే ప్ర‌య‌త్నం చేయ‌డం స‌ర్వ‌సాధార‌ణంగా మారిపోయింది. ఇలానే.. తాజాగా బ్లూ డ్ర‌మ్ మ‌ర్డ‌ర్‌పైనా నెటిజ‌న్లు జోరుగా వెతికేశారు. దీంతో గూగుల్ సెర్చ్ ఇంజ‌న్‌లో ఈ టాపిక్ హైలెట్ గా నిలిచింది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని మీర‌ట్‌లో గ‌త ఏడాది మార్చిలో జ‌రిగిన ఈ దారుణ ఉదంతం.. దేశంలోనే భారీ సంచ‌ల‌నం సృష్టించింది. అప్ప‌టి వ‌ర‌కు హ‌త్య‌లు చేయ‌డం.. అనంత‌రం శ‌వాల‌ను మాయం చేయ‌డం వంటి ఘ‌ట‌న‌లు అంద‌రికీ తెలిసిందే. కానీ, బ్లూడ్ర‌మ్ ఉదంతం మాత్రం వీట‌న్నింటికీ మించిన రీతిలో ఉండ‌డం మ‌రింత విశేషం.

ఏంటీ కేసు..?

సౌర‌భ్ రాజ్‌పుత్‌, ముస్కాన్ ర‌స్తోగీ దంప‌తులు మీర‌ట్‌లో నివ‌సిస్తున్నారు. సౌర‌భ్ నేవీ ఉద్యోగి. వీరికి పెళ్ల‌యిన నాలుగు సంవ‌త్స‌రాల‌కే భార్య ర‌స్తోగీ ప‌క్క చూపులు చూసింది. రాజ్‌పుత్ స్నేహితుడుగా ప‌రిచ‌యం అయిన సాహిల్‌ శుక్లాతో ఆమె వివాహేత‌ర సంబంధం పెట్టుకుంది. అనంత‌రం.. వీరి మ‌ధ్య సుమారు రెండేళ్ల‌పాటు ఈ సంబంధం కొన‌సాగింది. అయితే.. విష‌యం కాస్తా.. రాజ్‌పుత్‌కు తెలిసిపోయింది. దీంతో భార్య‌ను ఆయ‌న హెచ్చ‌రించారు. కానీ, నేవీ ఉద్యోగం కావ‌డంతో నిరంత‌రం ఆయ‌న కాప‌లా కాయ‌లేక పోయారు. ఉద్యోగానికి వెళ్తే.. 15 రోజుల వ‌ర‌కు ఇంటి ముఖం చూసే ప‌రిస్థితి ఉండేది కాదు. ఇదే ర‌స్తోగికి క‌లిసి వ‌చ్చింది.

ఇలా కొన‌సాగుతున్న వీరి ప్రేమాయణం, వివాహేత‌ర సంబంధం.. మ‌రింత బ‌ల‌ప‌డి.. ఏకంగా భ‌ర్త‌ను అడ్డు త‌ప్పించాలని నిర్ణ‌యించారు. ఈ క్ర‌మంలో ఓ రోజు భ‌ర్త రాజ్‌పుత్‌కు ఇష్ట‌మైన కూర వండి .. దానిలో మ‌త్తు ప‌దార్థాలు క‌లిపి.. ప్రేమ‌తో వ‌డ్డించింది. అనంత‌రం.. అత‌ను స్పృహ కోల్పోయిన త‌ర్వాత‌.. ప్రియుడు శుక్లాను ఇంటికి పిలిచి.. ప‌క్కా ప్ర‌ణాళిక ప్ర‌కారం.. అత‌నిని హ‌త్య చేశారు. అనంత‌రం.. ఎవ‌రికీ అనుమానం రాకుండా.. ఆశ‌వాన్ని ముక్క‌లు ముక్క‌లు చేసి.. ఇంట్లోని మంచి నీరు నిల్వ చేసుకునే బ్లూ డ్ర‌మ్‌లోనే దాచి పెట్టారు. ఒక రోజు త‌ర్వాత‌.. ఆ డ్ర‌మ్ముల్లో ఇసుక‌, సిమెంటు వేసి పూడ్చేశారు. చిత్రం ఏంటంటే.. ఆ డ్ర‌మ్మును చ‌క్క‌గా ఇంట్లో పెట్టి.. దానిపై గులాబీ పువ్వుల మొక్క‌లు పెట్టి ర‌స్తోగీ పెంచుకుంది.

విష‌యం ఇలా బ‌య‌ట‌కు..

కొన్ని రోజుల‌కు రాజ్‌పుత్ త‌ల్లీ తండ్రికి అనుమానం వ‌చ్చింది. త‌మ కుమారుడు రోజూ ఫోన్ చేసేవాడ‌ని.. కానీ, ఇప్పుడుకేవ‌లం మెసేజ్‌ల‌కే ప‌రిమితం అవుతున్నాడ‌ని గ్ర‌హించి.. పోలీసుల‌ను ఆశ్ర‌యించారు. అప్ప‌టికే ర‌స్తోగీ, శుక్లాలు.. మీర‌ట్ నుంచి ఉడాయించారు. దీనిని స‌వాల్‌గా తీసుకున్న పోలీసులు.. భారీ విచార‌ణ‌కు రెడీ అయినా.. ఇంట్లోని డ్ర‌మ్ వ‌ద్ద జాగిలాలు ఆగిపోవ‌డంతో కేసును చాలా సునాయాసంగా ప‌రిష్క‌రించారు. కేవలం ఏడాది వ్య‌వ‌ధిలోనే నిందితుల‌ను అరెస్టు చేశారు. అనేక విచార‌ణ‌ల ద‌రిమిలా.. స్థానిక కోర్టు ప్రేయ‌సీ ప్రియుల‌కు మ‌ర‌ణ శిక్ష విధించింది. అయితే.. ఈ కేసు బ్లూడ్ర‌మ్ మ‌ర్డ‌ర్‌గా గుర్తింపు పొంద‌డంతో గూగుల్‌లో తెగ వెతికేయ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on October 16, 2026 12:39 pm

Share

Recent Posts

లేడీ విలన్‌ని వాడుకోవడం ఒక కళ

తాజాగా విడుదలైన జైలర్ 2లో అసలు హీరోయినే లేకపోవడం మనం మొదటి భాగంలోనూ చూశాం. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్…

2 hours ago

రామాయణ లెక్కలు ఇప్పుడు సరిపోయాయా

నిన్న బెంగళూరులో రామాయణ పార్ట్ 1 కొత్త ట్రైలర్ గ్రాండ్ గా లాంచ్ చేశారు. రావణుడిగా నటించిన యష్ మెయిన్…

3 hours ago

దేవరకొండ జంటను ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు

ఇవాళ రణబాలి థియేటర్లలో అడుగు పెట్టింది. ట్రైలర్ వచ్చినప్పుడు కొంచెం మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చినపప్పటికీ కంటెంట్ మీద నమ్మకాన్ని వ్యక్తం…

3 hours ago

దేశంలో గందరగోళం సృష్టించేందుకు లైసెన్స్ ఇవ్వలేదు

ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలన్న డిమాండ్ తో ఆందోళన చేపట్టిన ప్రతిపక్ష కాంగ్రెస్, కాక్రోచ్ జనతా పార్టీల…

4 hours ago

ప్రకాశం జిల్లా పరిషత్‌ వైస్‌ చైర్మన్‌గా పోకూరి?

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారు పార్టీ నాయకత్వాన్ని మండల స్థాయి నుంచి జిల్లా…

6 hours ago

కాంగ్రెస్‌.. చేతులెత్తిన‌ట్టే.. ఆ ఓటు కూట‌మికే.. !

స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభావం చూపించాలని ముఖ్యంగా పోగొట్టుకున్నచోటే ఓటు బ్యాంకును సంపాదించుకోవాలి అని భావిస్తున్న కాంగ్రెస్ నాయకుల పరిస్థితి…

6 hours ago