దర్శకుడు అంటే తెర వెనుక ఉండి మొత్తం వ్యవహారాన్ని నడిపించేవాడు. చాలామంది గొప్ప గొప్ప దర్శకులు కూడా చాలా వరకు తెర వెనుకే ఉండిపోతుంటారు. లైమ్ లైట్లోకి రారు. కానీ కొందరు దర్శకులు మాత్రం బయట తక్కువ కనిపించినా.. ఎక్కువ మాట్లాడకపోయినా.. వాళ్లకుండే క్రేజే వేరుగా ఉంటుంది. కేవలం తాము తీసే సినిమాల ద్వారానే కాక తమ ప్రవర్తన, మాటతీరుతోనూ క్రేజ్ తెచ్చుకుని.. ఎక్కడ తమ ప్రస్తావన వచ్చినా, తాము కనిపించినా యూత్ వెర్రెత్తిపోయేలా చేస్తారు.
ఒకప్పుడు రామ్ గోపాల్ వర్మకు ఇలాంటి క్రేజే ఉండేది. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ యూత్‌లో అలాంటి ఫాలోయింగే సంపాదించాడు. సందీప్ ఏదైనా సినిమా ఈవెంట్‌కు హాజరైనా, ప్రెస్ మీట్లో పాల్గొన్నా.. స్టార్ హీరోలతో సమానంగా జనం నుంచి రెస్పాన్స్ వస్తుంటుంది. సందీప్ తెరపై కనిపించినా సరే.. స్పందన ఇలాగే ఉంటుందని ‘ఈఎన్‌ఈ రిపీట్’ సినిమాతో రుజువైంది.
ఈ మూవీలో ఐదుగురు దర్శకులు క్యామియోలు చేశారు. వారిలో సందీప్ క్యామియోకు వచ్చిన రెస్పాన్స్ వేరే లెవెల్ అని చెప్పాలి. ఈ సినిమాలో మిగతా ఆర్టిస్టులను తక్కువ చేయడం కాదు కానీ, విశ్వక్సేన్ సహా ముఖ్య పాత్రధారులు కనిపించినప్పటి కంటే.. సందీప్‌ను చూపించినపుడు థియేటర్లలో వస్తున్న స్పందన ఎక్కువగా ఉండడం విశేషం. అతను ఫ్రేమ్‌లోకి రాగానే ఆడిటోరియాలు దద్దరిల్లిపోతున్నాయి.
రెస్పాన్స్ ఏ స్థాయిలో ఉందంటే.. తెర మీద క్యారెక్టర్లు ఏం మాట్లాడుకుంటున్నాయో అర్థం కాని పరిస్థితి. ఆ సన్నివేశంలో అభినవ్ గోమఠం కూడా భలేగా యాక్ట్ చేయడం.. సందీప్‌తో తన కాన్వర్జేషన్ ఇంట్రెస్టింగ్‌గా సాగడంతో ఆ సీన్ బాగా పేలింది. సినిమా చివర్లో ప్రేక్షకులు మంచి హైతో, నవ్వు ముఖాలతో బయటికి రావడానికి సందీప్ క్యామియో ఉపయోగపడింది. థియేటర్లలో తన క్రేజ్ చూశాక పెద్ద పెద్ద స్టార్లకు ఏమాత్రం తీసిపోని స్థాయిలో యూత్‌లో తన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని అర్థమవుతుంది.
This post was last modified on November 19, 2026 1:43 pm
టోల్ ప్లాజా దాటితే చాలు.. మీ వాహనానికి ఇన్సూరెన్స్ ఉందో లేదో ప్రభుత్వానికి తెలిసిపోతుంది. ఇప్పటివరకు టోల్ చెల్లింపులకే పరిమితమైన…
ఈ మధ్యకాలంలో భారతీయులపై పాశ్చాత్య సంస్కృతి ప్రభావం బాగా ఎక్కువైంది. విలాసవంతమైన జీవితం, మద్యపానం, ఖరీదైన భోజనం వంటి వాటిని…
తమిళనాడు రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ను ఆయన సొంత నియోజకవర్గం కొళత్తూరులో ఓడించిన…
నిన్న రాత్రి ప్రీమియర్లతో ఈ నగరానికి ఏమైంది రిపీట్ విడుదలయ్యింది. ముఖ్యంగా ఒక్క రాత్రిలో హైదరాబాద్ నుంచి కోటి రూపాయల…
స్థానిక ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం కూటమి హవా కనిపించింది. మున్సిపల్ ఎన్నికలు, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో సైతం అదే ఊపు…
రెండు వారాల క్రితం విడుదలైన సీన్ తెలుగులోనూ మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. రిలీజ్ కు ముందు పెద్దగా…