ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గత మూడు నెలల నుంచి జన్‌జీ(యువత)కి కనెక్ట్ అయ్యేలా పలు ప్రయత్నాలు చేస్తున్నారు. కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమాలు, నిరసనలు చేపట్టినప్పుడు.. ఆయన ఇన్‌స్టా వేదికగా యువతను ఆక ట్టుకునేందుకు ప్రయత్నించారు. నిరంతరం యూత్‌తో మాట్లాడే ప్రయత్నం చేశారు. అలానే సోషల్ మీడియాలో కూడా.. యాక్టివ్ అయ్యారు. తనతోపాటు మంత్రులను కూడా యాక్టివ్ కావాలని సూచించారు. గత నెల రోజులుగా సైలెంట్‌గా ఉన్న మోడీ.. తాజాగా మరో వినూత్న రీతిలో యూత్‌కు కనెక్ట్ అయ్యేలా సామాజిక మాధ్యమంలో పోస్టు చేశారు.
సుమారు పుష్కర కాలం తర్వాత.. `ది గ్రాండ్ థెఫ్ట్ ఆటో 6` అనే గేమర్ విడుదలైంది. ప్రస్తుతం యువత పెద్ద ఎత్తున దీనికి ఎడిక్ట్ అయ్యారనే చెప్పాలి. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని ప్రధాని మోడీ కూడా.. ది గ్రాండ్ థెఫ్ట్ ఆటో 6, ఆటో 5 వెర్షన్లను ప్రస్తావించారు. `ది గ్రాండ్ థెఫ్ట్ ఆటో 5`కి, ది గ్రాండ్ థెఫ్ట్ ఆటో 6కి మధ్య 13 సంవత్సరాల గ్యాప్ ఉన్న విషయం తెలిసిందే. దీంతో ఈ పదమూడేళ్ల కాలంలో దేశం ఎలా అభివృద్ధి చెందిందనే విషయాన్ని ఆయన గ్రాఫిక్ ఆర్ట్ ఫొటోలతో ప్రధాని తన ఎక్స్‌లో పోస్టు చేశారు. ఇవి చాలా ఆకర్షణీయంగా ఉండడం, జెన్‌జీకి వెంటనే కనెక్ట్ కావడం గమనార్హం.
ఏమేం పేర్కొన్నారంటే..
గ్రాఫిక్ ఆర్ట్ ఫొటోలలో దేశంలో ప్రస్తుతం అమలవుతున్న విధానాలను.. 13 ఏళ్ల కిందట(కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం ఉన్న సమయం) ఉన్న విధానాలను పోలుస్తూ.. వివరించారు. పేదరిక నిర్మూలన అప్పట్లో 27 శాతం ఉంటే.. ఇప్పుడు 2.6 శాతానికి తగ్గిందని, వ్యక్తిగత మరుగు దొడ్లు అప్పట్లో 36 శాతం ఉంటే.. ఇప్పుడు 100 శాతం ప్రతి ఒక్కరికీ ఉన్నాయని, సౌరవిద్యుత్ అప్పట్లో 2.8 గిగా వాట్లు ఉంటే.. ప్రస్తుతం 175 గిగా వాట్లు ఉందని వివరించారు.
అలానే, అంతరిక్ష రంగం వృద్ధి అప్పట్లో కేవలం 1 శాతం ఉంటే.. ప్రస్తుతం 440 శాతం ఉందని పేర్కొన్నారు. ఇలా.. అప్పటి సర్కారుకు.. ప్రస్తుత తన 12 ఏళ్ల పాలనకు మధ్య వ్యత్యాసాన్ని యువతకు అర్థమయ్యేలా ముఖ్యంగా జెన్‌జీకి కనెక్ట్ అయ్యేలా మోడీ వివరించారు. మరి ఈ విషయాలను జెన్‌జీ ఎలా తీసుకుంటుందో చూడాలి. ఏదేమైనా జెన్‌జీకి కనెక్ట్ అయ్యేలా మోడీ చేస్తున్న ప్రయత్నాలను మాత్రం విశ్లేషకులు ప్రశంసిస్తున్నారు.
This post was last modified on November 19, 2026 9:54 pm
Page: 1 2
పాత క్లాసిక్స్ రీ రిలీజ్ చేయడం మంచి ఆలోచన. ఇప్పటి తరం వాటిని ఆస్వాదించడమే కాకుండా సదరు వింటేజ్ సినిమాల…
సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించండి. గెలిచిన ఆ ఎమ్మెల్యేకి బ్రహ్మాండమైన మంత్రి పదవి ఇచ్చే పూచి నాది అన్నారు…
ఏపీ రాజకీయాల్లో ఇటీవల 'పరివర్తన రాజనీతి పార్టీ` (పీఆర్పీ) పేరుతో ఒక కొత్త రాజకీయ పార్టీని మాజీ ఎంపీ వి.…
తెలుగు ప్రేక్షకులు ఈ నగరానికి ఏమైంది రిపీట్, ఆకాశంలో ఒక తార, ఓమ్ అంటూ కొత్త సినిమాల హడావిడిలో పడిపోయారు…
నిన్నటి వరకు భయపెట్టిన అక్వాన్ తుఫాన్ ఒడిశా వైపు మెల్లగా జారుకుంది. ఆంధ్ర ప్రదేశ్ కు తుఫాన్ ముప్పు తప్పింది.…
టోల్ ప్లాజా దాటితే చాలు.. మీ వాహనానికి ఇన్సూరెన్స్ ఉందో లేదో ప్రభుత్వానికి తెలిసిపోతుంది. ఇప్పటివరకు టోల్ చెల్లింపులకే పరిమితమైన…