Political News

‘బీజేపీతో హ‌రీష్ రావు మంత‌నాలు’

బీఆర్ ఎస్ అగ్ర‌నాయ‌కుడు, మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే త‌న్నీరు హ‌రీష్‌రావుపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర‌వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న బీజేపీతో ట‌చ్‌లో ఉన్నార‌ని.. ఇది తాను చెబుతున్న మాట‌కాద‌ని అన్నారు. ఈ విష‌యంపై బీఆర్ ఎస్ పార్టీలోనే పెద్ద ఎత్తున చ‌ర్చ సాగుతోంద‌న్నారు. అస‌లు వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి సిద్దిపేట నుంచి హ‌రీష్‌రావు బీఆర్ఎస్ త‌ర‌ఫున పోటీ చేయ‌ర‌ని.. ఆయ‌న వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీజేపీ త‌ర‌ఫున‌, ఆ పార్టీ గుర్తుపై పోటీ చేయ‌నున్నార‌ని వ్యాఖ్యానించారు. ఇది ముమ్మాటికీ నిజ‌మ‌ని చెప్పారు. అలా కాద‌ని హ‌రీష్‌రావు అన‌గ‌ల‌రా? అని నిల‌దీశారు.

“సిద్దిపేట గ్రామ దేవ‌త ఎల్ల‌మ్మ‌త‌ల్లిపై ప్ర‌మాణం చేసి.. ఇది త‌ప్పు.. బీఆర్ఎస్‌ను వ‌దిలేస్తే.. స‌ర్వ‌నాశ‌నం అయిపోతా.. అని హ‌రీష్‌రావు ప్ర‌మాణం చేయ‌గ‌ల‌రా?“ అని సీఎం రేవంత్ స‌వాల్ రువ్వారు. ఇప్ప‌టికే బీజేపీతో అన్ని మంత‌నాలు పూర్త‌య్యాయ‌న్నారు. కేసీఆర్ రాజ‌కీయ భిక్ష పెడితే.. ఇప్పుడు ఆయ‌న‌కు వెన్నుపోటు పొడుస్తున్నార‌ని అన్నారు. అయితే.. కేసీఆర్ చేసిన‌ ప‌నుల‌కు, ఆయ‌నకు ఈ మాత్రం శాస్తి జ‌ర‌గాల్సిందేన‌ని రేవంత్ వ్యాఖ్యానించారు. గ‌తంలో ఎన్టీఆర్‌కు వెన్నుపోటుపొడిచిన కేసీఆర్‌.. తెలంగాణ కోసం సోనియాగాంధీ కాళ్లు మొక్కార‌ని అన్నారు. తెలంగాణ ఇచ్చిన త‌ర్వాత సోనియాగాంధీ ఇంటికి కుటుంబ స‌మేతంగా వెళ్లి ప్ర‌శంసించార‌ని అన్నారు.

కానీ, ఇప్పుడు అదే సోనియాగాంధీపై విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని రేవంత్ రెడ్డి ఆక్షేపించారు. బావ‌, బావ‌మ‌రుదులు(కేటీఆర్‌-హ‌రిష్‌) త‌న‌పై అన‌వ‌స‌ర వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని రేవంత్ రెడ్డి మండిప‌డ్డారు. ల‌క్ష కోట్ల‌కుపైగా తెలంగాణ ప్ర‌జ‌ల సొమ్మును దోచుకున్న‌ది మీరుక‌దా? అని ప్ర‌శ్నించారు. ఇప్పుడు నాపైనింద‌లు వేస్తున్నార‌నివ్యాఖ్యానించారు.

“అసెంబ్లీకి రండి మీ అంతు చూస్తా“ అని హెచ్చ‌రించారు. 2014లో హ‌రీష్‌కు మంత్రి ప‌ద‌వి ఇచ్చిన కేసీఆర్‌.. 2018లో తిరిగి అధికారంలోకి వ‌చ్చాక‌.. ఆ ప‌ద‌విని పీకేశార‌ని ఎద్దేవా చేశారు. ప్ర‌జ‌ల సొమ్మును దోచుకోవ‌డం వ‌ల్లే.. కేసీఆర్ ఆ ప‌ద‌వి నుంచి త‌ప్పించార‌ని విమ‌ర్శించారు. వేల కోట్ల రూపాయ‌ల ఆస్తులు హ‌రీష్‌రావుకు ఎక్క‌డ నుంచి వ‌చ్చాయో చెప్పాల‌ని నిల‌దీశారు. కాళేశ్వ‌రం ప్రాజెక్టును అడ్డు పెట్టుకుని మామా అల్లుళ్లు దోచుకున్నార‌ని ఆరోపించారు. 

This post was last modified on November 20, 2026 7:45 am

Share

Recent Posts

తెలుగు సినిమా టైమొచ్చింది

ఓవైపు డబ్బింగ్ సినిమాలేమో ఒక్కొక్కటిగా దున్నేస్తున్నాయి. తెలుగు సినిమాల కంటెంట్ ఏమో వీక్‌గా ఉంటోంది. అవిప్రేక్షకుల ఆదరణకు నోచుకోవడం లేదు.…

18 minutes ago

9 కోట్ల మందు 2.5 లక్షలకే.. ఈవిడే అసలైన డాక్టరమ్మ!

అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు మందులు అందుబాటులో ఉన్నా.. వాటి ధర కోట్ల రూపాయల్లో ఉండటంతో తల్లిదండ్రులు చికిత్స చేయించలేని…

1 hour ago

వైసీపీ ఒక డెడ్ బాడీ – నాగబాబు

వైసీపీ మీద మరోసారి విరుచుకొని పడ్డారు ఎమ్మెల్సీ నాగబాబు. వైసీపీ ఒక డెడ్ బాడీ అని, దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని…

2 hours ago

హైందవ తప్పుకోవడం నాయుడుకి మంచిదే

వచ్చే వారం నవంబర్ 27 విడుదల కావాల్సిన హైందవ వాయిదా వేసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. కొత్త రిలీజ్ డేట్…

2 hours ago

ఆకాశం నుంచి ప్రశంసల వర్షం

ఒక తెలుగు సినిమాకు యునానిమస్ రివ్యూలు, పబ్లిక్ టాక్ రావడం అరుదు. అది జరిగితే కలెక్షన్లకు అడ్డుకట్ట వేయడం ఎలాంటి…

3 hours ago

లెజెండ్ రీఎంట్రీ… అదిరిపోలా

గుణ్ణం గంగరాజు.. ఈ పేరు ఈ తరం సినీ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేకపోవచ్చు. కానీ 90వ దశకం నుంచి…

6 hours ago