ఇవాళ జైలర్ 2 భారీ అంచనాల మధ్య విడుదలయ్యింది. మాములుగా బ్లాక్ బస్టర్ సీక్వెల్ కుండే హైప్ దీనికి పూర్తి స్థాయిలో కనిపించకపోయినా రజని మేనియా గురించి తెలియనివాళ్ళు ఉండరు కాబట్టి ఫస్ట్ డే చూసేందుకు ఎదురు చూస్తున్న ఆడియన్స్ సంఖ్య భారీగా ఉంది. తెలుగు హక్కులు నాగవంశీ సొంతం చేసుకోవడంతో రిలీజ్ పరంగా మంచి కౌంట్ దక్కింది. చాలా చోట్ల ఉదయం స్పెషల్ షోల నుంచే డెబ్భై శాతానికి పైగా ఆక్యుపెన్సీలతో తొలిరోజు బోణీ బాగానే జరిగింది.
ట్రైలర్ చూసినప్పుడు ఏవైతే నెగటివ్ వైబ్స్ వచ్చాయో సినిమా చూశాక అవి గణనీయంగా తగ్గాయని చెప్పాలి. ఎందుకంటే చాలా మంది భయపడినట్టు దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ నిరాశ పరచలేదు. టేకింగ్ లో హెచ్చుతగ్గులు, సెకండాఫ్ లో ల్యాగ్, క్యామియోలను సరిగా వాడుకోకపోవడం లాంటి కంప్లయింట్స్ ఉన్నప్పటికీ ఈ మూవీకి ఎందుకు వచ్చామా అని జనం ఫీలవ్వలేదంటే దానికి సక్సెస్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. జైలర్ 2 వరస చూస్తుంటే అదే నిజమయ్యేలా ఉంది.
కూలి ఫ్లాప్ ప్రభావం గట్టిగా ఉన్న నేపథ్యంలో జైలర్ 2తో సూపర్ స్టార్ రజనీకాంత్ కంబ్యాక్ అవ్వాలని అభిమానులు బలంగా కోరుకున్నారు. స్వాగ, స్టైల్ లో ఇప్పటికీ రజనిని బీట్ చేసే వాళ్ళు లేరంటే అవాస్తవం కాదు. అందుకే ఇంత ఆదరణ దక్కుతోంది. అనిరుద్ రవిచందర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పరంగా చాలా ప్లస్ అయ్యాడు. పాటలు ఆశించిన స్థాయిలో లేకపోయినప్ప్పటికీ బిజిఎం విషయంలో సంతృప్తి కలిగించడంతో ఫ్యాన్స్ హ్యాపీగానే ఉన్నారు.
రేపు రణబాలి విడుదల కానుంది. దీని టాక్ ని బట్టి జైలర్ 2 పికప్ కొనసాగుతుందా లేదానేది వేచి చూడాలి. తమిళనాడులో ష్యుర్ షాట్ హిట్టని అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. కర్ణాటక, తెలంగాణ, ఎపిలోనూ మంచి నెంబర్లు నమోదవుతున్నాయి. ఒక చిన్న పిల్లాడికి తాతగా, డెబ్భై వయసు దాటిన కార్ డ్రైవర్ గా డార్క్ కామెడీతో పాటు మాస్ ఎలివేషన్లను రజనీకాంత్ పండించిన తీరుకి పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. మరి ఇది ఎంత మేరకు వీకెండ్ వరకు కొనసాగిస్తుందో వేచి చూడాలి.
This post was last modified on October 15, 2026 2:35 pm
ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమాని పూర్తి చేయడం ఒక యజ్ఞం అనుకుంటే దాన్ని థియేటర్ల దాకా తీసుకురావడం ఇంకో మహా సంకల్పంగా…
దేశంలో ఎల్ నినో ప్రభావం తీవ్రత మొదలైంది. ప్రపంచ వ్యాప్తంగా దీని ప్రభావం ఉన్నప్పటికీ భారతదేశం మీద అందులోనూ దక్షిణ…
టాలీవుడ్లో రాజమౌళి తర్వాత అంత గొప్ప పేరున్న దర్శకుడు సుకుమార్. రాజమౌళిలా భారీ ఈవెంట్ ఫిలిమ్స్ తీయకపోయినా.. తన మార్కు…
జబర్దస్త్ కామెడీ షోలో స్కిట్లు చూసి అందరూ నవ్వుకుంటారు కానీ.. అందులో కనిపించే వారి మీద ఒక రకమైన చిన్న…
సీనియర్ నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడైన బెల్లంకొండ శ్రీనివాస్ ఒకప్పుడు తరచుగా సినిమాలతో పలకరించేవాడు. భారీ బడ్జెట్లలో, పెద్ద కాంబినేషన్లలో…
జనం కోసం జర్నలిజం చేస్తూ, ఏ పార్టీ జెండాను మోయకుండా తెలుగు రాష్ట్రాల్లో వార్తా స్రవంతిని అందిస్తున్న తెలుగుప్రభ పత్రిక…