Political News

సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే… మంత్రి పదవి ఫిక్స్

సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించండి. గెలిచిన ఆ ఎమ్మెల్యేకి బ్రహ్మాండమైన మంత్రి పదవి ఇచ్చే పూచి నాది అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సిద్దిపేటలో గురువారం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించిన ఆయన స్థానిక ఎమ్మెల్యే హారీష్ రావు మీద విరుచుకొని పడ్డారు. సిద్దిపేటలో మామ పోతే అల్లుడు, అల్లుడు పోతే మామ వస్తున్నారని, ఇదేమన్నా వారి జాగీరా అని ప్రశ్నించారు. 2029 ఎన్నికల్లో సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ గెలవడం ఖాయమని, సిద్దిపేట ప్రజలు కోరుకున్న నాయకుడికే కాంగ్రెస్‌ టికెట్‌ ఇస్తానని.. ఆ అభ్యర్థిని గెలిపించుకునే బాధ్యత సిద్దిపేట ప్రజలదేనని స్పష్టం చేశారు.

2004లో వార్డు మెంబర్‌గా కూడా గెలవడం చేతకాని హరీశ్‌రావుకు అప్పటి సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మంత్రి పదవి ఇచ్చి ప్రోత్సాహించారని  రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. ఆ కృతజ్ఞత లేకుండా సిద్దిపేటలో కాంగ్రెస్‌ పార్టీని నామరూపాల్లేకుండా లేకుండా చేయడానికి హరీశ్‌రావు అనేక ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. హరీశ్‌రావు కుటుంబానికి వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయో చెప్పాలని ప్రశ్నించారు. హరీశ్‌రావుకు రాజకీయ భిక్ష పెట్టిన సోలిపేట రామలింగారెడ్డి ఆస్తులకు, హరీష్ రావు ఆస్తులకు మధ్య తేడాను ప్రజలు గమనించాలని కోరారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగం కొనసాగిస్తూ…కృష్ణా జలాల్లో తెలంగాణకు 299 టీఎంసీలు చాలని సంతకం చేసింది నాటి ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావు కాదా అని నిలదీశారు. నాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌ను ప్రగతిభవన్‌కు ఆహ్వానించి విందు ఇచ్చింది ఎవరో తెలంగాణా ప్రజలకు తెలుసన్నారు. కమీషన్లకు కక్కుర్తి పడి రాయలసీమ ప్రాజెక్టుకు సహకరించారని విమర్శించారు. తెలంగాణాకు అన్యాయం చేసింది కేసీఆర్ కుటుంబమే అని విమర్శలు గుప్పించారు. 

తెలంగాణ ఉద్యమంలో పాల్గొని త్యాగాలు చేసిన అనేక కుటుంబాలు  ప్రస్తుతం ఇబ్బందుల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అదే సమయంలో కేసీఆర్ కుటుంబంలో కుమారుడు, కుమార్తె, అల్లుడు, బంధువులు పదవులు పంచుకొని, ఆస్తులు పెంచుకున్నారని ఆరోపించారు. హరీశ్‌రావు పర్యవేక్షణలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ఎక్కడుందో చూపించాలని నిలదీశారు.

సిద్దిపేట గడ్డపై జరిగిన ఈ సభకు వేలాదిమంది ప్రజలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రేవంత్ రెడ్డి ప్రసంగంలో కేసీఆర్ కుటుంబం మీద చేసిన విమర్శలకు ఈలలు, చెప్పట్లతో స్పందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అడుగడుగునా ఘన స్వాగతం పలికారు. సిద్దిపేట సభ విజయవంతం కావడంతో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలలో ఉత్సాహం కనిపిస్తుంది.

This post was last modified on November 19, 2026 10:10 pm

Share

Recent Posts

వింటేజ్ సినిమాలను వృథా చేయకండి

పాత క్లాసిక్స్ రీ రిలీజ్ చేయడం మంచి ఆలోచన. ఇప్పటి తరం వాటిని ఆస్వాదించడమే కాకుండా సదరు వింటేజ్ సినిమాల…

4 hours ago

జ‌న్‌జీకి మోడీ క‌నెక్ట్‌… ఐడియా అదుర్స్!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ గ‌త మూడు నెల‌ల నుంచి జ‌న్‌జీ(యువ‌త‌)కి క‌నెక్ట్ అయ్యేలా ప‌లు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. కాక్రోచ్…

4 hours ago

సాయిరెడ్డి చెప్పింది నిజ‌మేనా.. ?

ఏపీ రాజకీయాల్లో ఇటీవల 'పరివర్తన రాజనీతి పార్టీ` (పీఆర్‌పీ) పేరుతో ఒక కొత్త రాజకీయ పార్టీని మాజీ ఎంపీ వి.…

4 hours ago

గాడ్జిల్లా గల్లంతు అయ్యేలా ఉంది

తెలుగు ప్రేక్షకులు ఈ నగరానికి ఏమైంది రిపీట్, ఆకాశంలో ఒక తార, ఓమ్ అంటూ కొత్త సినిమాల హడావిడిలో పడిపోయారు…

7 hours ago

హమ్మయ్య… తుఫాన్ ముప్పు తప్పినట్టేనా?

నిన్నటి వరకు భయపెట్టిన అక్వాన్ తుఫాన్ ఒడిశా వైపు మెల్లగా జారుకుంది. ఆంధ్ర ప్రదేశ్ కు తుఫాన్ ముప్పు తప్పింది.…

8 hours ago

ఇన్సూరెన్స్ లేకుండా టోల్ దాటే ముందు జర భద్రం

టోల్ ప్లాజా దాటితే చాలు.. మీ వాహనానికి ఇన్సూరెన్స్ ఉందో లేదో ప్రభుత్వానికి తెలిసిపోతుంది. ఇప్పటివరకు టోల్ చెల్లింపులకే పరిమితమైన…

9 hours ago