Movie News

అంచ‌నాలు పెంచుకోమంటున్న అక్కినేని హీరో

ఒక సినిమాలో భాగ‌మైన ప్ర‌తి వ్య‌క్తీ.. త‌మ చిత్రం అద్భుతం అనే చెబుతాడు. ఇలాంటి సినిమా ఇంత వ‌ర‌కు రాలేదంటాడు. అంచ‌నాలు పెంచే ప్ర‌య‌త్న‌మే చేస్తాడు. ఐతే అక్కినేని నాగ‌చైత‌న్య త‌న సినిమాల గురించి మ‌రీ ఎక్కువ గొప్పలు పోయే ర‌కం కాదు. సినిమా బావుంటుంది.. త‌ప్ప‌క చూడండి అంటాడే త‌ప్ప‌, అంచ‌నాలు పెంచుకోమ‌ని, త‌న సినిమా అద్భుతం అని చెప్ప‌డం అరుదు. ఐతే త‌న కొత్త‌ వృష‌క‌ర్మ విష‌యంలో మాత్రం ఈ అక్కినేని హీరో చాలా ధీమాగా ఉన్న‌ట్లున్నాడు.

చైతూ కెరీర్లోనే అత్య‌ధికంగా దాదాపు వంద కోట్ల బ‌డ్జెట్లో రూపొందిన సినిమా ఇది. విరూపాక్ష ద‌ర్శ‌కుడు కార్తీక్ వ‌ర్మ దండు తీసిన ఈ సినిమాను సీనియ‌ర్ నిర్మాత బీవీఎస్ఎన్ ప్ర‌సాద్ నిర్మించారు. టీం మొద‌ట్నుంచి ఈ సినిమాపై చాలా కాన్ఫిడెంట్‌గా ఉంది. తాజాగా ఒక కాలేజీలో జ‌రిగిన ప్ర‌మోష‌న‌ల్ ఈవెంట్లో చైతూ.. వృష‌క‌ర్మ మీద ఎక్కువ అంచ‌నాలు పెట్టుకుని ర‌మ్మ‌ని ప్రేక్ష‌కుల‌కు పిలుపునివ్వ‌డం విశేషం.

”వృష‌క‌ర్మ అనే సినిమా ఒక గుహ‌లో మొద‌లై.. ఆ గుహ నుంచి కొన్ని ఊహ‌ల ద్వారా క్యారెక్ట‌ర్ల‌ను ఎక్క‌డెక్క‌డికో తీసుకెళ్తూ ఉంటుంది. ఇది మ‌న తెలుగు ప్రేక్ష‌కుల‌ లార్జ్ స్కేల్ థియేట్రిక‌ల్ అనుభూతిని ఇచ్చే సినిమా. మ‌న ఆడియ‌న్స్‌కు ఇది చాలా కొత్త అనుభవం అవుతుంది. అంచ‌నాలు కొంచెం ఎక్కువ‌గానే పెట్టుకుని రండి. మేం క‌చ్చితంగా వాటిని అందుకుంటాం. డిసెంబ‌రు 4న థియేట‌ర్ల‌లో క‌లుద్దాం” అని చైతూ చెప్పాడు. 

మ‌రోవైపు విద్యార్థుల‌ను ఉద్దేశించి చైతూ మాట్లాడుతూ.. మామూలుగా క‌ష్ట‌ప‌డి చ‌దివి డిగ్రీ పూర్తి అయిపోగానే ఫ్రీ అయిపోతాం అని యూత్ అనుకుంటార‌ని, కానీ అస‌లైన ప‌రుగు త‌ర్వాతే మొద‌ల‌వుతుంద‌ని.. ఆ ప‌రుగు జీవితాంతం ఆగ‌ద‌ని, కాబ‌ట్టి కాలేజీలో ఉండే మూణ్నాలుగేళ్లు ఆ స‌మ‌యాన్ని బాగా ఆస్వాదించాల‌ని చైతూ సూచించాడు. మిస్టిక్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన‌ వృష‌క‌ర్మ చిత్రంలో చైతూ స‌ర‌స‌న మీనాక్షి చౌద‌రి న‌టించ‌గా.. బాలీవుడ్ న‌టుడు, లాప‌తా లేడీస్ ఫేమ్ స్ప‌ర్శ్ శ్రీవాస్త‌వ విల‌న్ పాత్ర పోషించాడు.

This post was last modified on November 20, 2026 7:40 am

Share

Recent Posts

అవకాశాల వర్షంలో అదృష్ట తార

ఇవాళ విడుదలైన ఆకాశంలో ఒక తార హీరోయిన్ సాత్విక వీరవల్లి ఇండస్ట్రీ దృష్టిలో బలంగా పడటం హాట్ టాపిక్ గా…

1 hour ago

ఈ కమెడియన్ని వాడుకోండయ్యా

తెలుగు సినిమాల్లో ఒకప్పుడున్న కామెడీ వైభవం.. ఇండియాలోని ఇతర భాషల్లోనే కాదు, ప్రపంచంలోనే మరే సినీ పరిశ్రమలోనూ లేదు అంటే అతిశయోక్తి…

2 hours ago

ఎట్టకేలకు ఇద్దరు మిత్రుల సినిమా?

టాలీవుడ్లో అడివి శేష్.. రాహుల్ రవీంద్రన్.. వెన్నెల కిషోర్.. సుజీత్.. ఈ నలుగురూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అన్న సంగతి ఇండస్ట్రీలో…

2 hours ago

బొత్స గారూ… ఏమిటండీ ఇది!

వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి, శాస‌న మండ‌లిలో విప‌క్ష నేత బొత్స స‌త్య‌నారాయ‌ణ హ‌వా భారీగా త‌గ్గిపోయిందా? ఆయ‌న…

3 hours ago

‘బీజేపీతో హ‌రీష్ రావు మంత‌నాలు’

బీఆర్ ఎస్ అగ్ర‌నాయ‌కుడు, మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే త‌న్నీరు హ‌రీష్‌రావుపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర‌వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న…

4 hours ago

వయొలెంట్ క్లాష్… భోగి VS మైసా

నవంబర్ ఏదో డ్రై నెల అంటారు కానీ ఈసారి మటుకు ప్రతివారం బాక్సాఫీస్ వద్ద రసవత్తరమైన పోటీ నెలకొంటోంది. ఎన్ని…

5 hours ago