Political News

అవసరమైతే తమ హక్కును లాక్కుంటాం

కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువని, అందుకే ఆ పార్టీ నాయకులు ఎవరికిష్టం వచ్చినట్లు వాళ్ళు మాట్లాడుతుంటారన్న నానుడి వుంది. తెలంగాణా కాంగ్రెస్ పార్టీ నాయకులు దీన్ని మరోసారి రుజువు చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన ఈ వెయ్యి రోజుల్లో ఆ పార్టీ నాయకులు వంద మాటలు మాట్లాడి వుంటారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ముఖ్యమంత్రి పదవి గురించి తలా ఒక మాట మాట్లాడం గమనార్హం. తాజాగా తెలంగాణా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలంగాణాకు బీసీ ముఖ్యమంత్రి అవుతాడని చేసిన కామెంట్స్ చర్చకు దారితీసింది.

హైదరాబాద్ లోని శంషాబాద్‌ లో టీపీసీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓబీసీ బహిరంగ సభలో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్​ కుమార్ గౌడ్ మాట్లాడుతూ భవిష్యత్తులో రాష్ట్రానికి బీసీ నేత సీఎం కావడం ఖాయమని అన్నారు. జనాభా ప్రాతిపదికన ఎవరి వాటా వారికి దక్కాలనేదే రాహుల్ విధానమని చెప్పిన ఆయన సమాజంలోని అన్ని కులాల, వర్గాల మద్దతుతో తమ వాటా దక్కించుకుంటాం, అవసరమైతే లాక్కుంటామని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క వర్గానికో, ప్రాంతానికో సొంతం కాదని, ఏ ఒక్కరి సొత్తు కాదని చెప్పడంతో కాంగ్రెస్ పార్టీలో గుబులు రేపుతోంది.

ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండో పర్యాయం కూడా నేనే ముఖ్యమంత్రిగా కొనసాగుతానంటూ ప్రకటించుకున్నారు. మరోవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తాను కూడా సీఎం రేసులో వున్నానంటూ తరచుగా చెబుతున్నారు. అవకాశం వస్తే ముఖ్యమంత్రి పదవి చేపట్టేందుకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సిద్ధంగా వున్నారు. ఈ నేపథ్యంలో బీసీ ముఖ్యమంత్రి అవుతాడని, దీనికి రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, రేవంత్ రెడ్డి మద్దతు ఉంటుందని చెప్పడం వెనక ఉద్దేశ్యం ఏమిటని కాంగ్రెస్ నాయకులు ఆరా తీస్తున్నారు.

తెలంగాణాలో మంత్రివర్గ విస్తరణ జరగాల్సి వుంది. కొండా సురేఖను తప్పించిన తర్వాత వెంటనే మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని ప్రచారం జరిగింది కానీ ఎప్పటికప్పుడు వాయిదా పడుతోంది. ఈ క్రమంలో అనేకమంది నాయకులు ఎవరి రూట్ లో వారు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా రేసులో వున్నారు. మంత్రి పదవి కోసమే ఆయన బీసీ ముఖ్యమంత్రి పదవి గురించి మాట్లాడుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

This post was last modified on October 11, 2026 7:32 pm

Share

Recent Posts

చరణ్ కోసం అనిరుధ్ బెస్ట్ ఇవ్వాల్సిందే

పెద్ది తర్వాత మూడు నెలలకు పైగా రెస్ట్ మోడ్ లో ఉన్న రామ్ చరణ్ త్వరలో ఆర్సి 17 కోసం…

1 hour ago

ఇంకో వాయిదా అడగనున్న ఆదర్శం ?

అక్టోబర్ 9 నుంచి తప్పుకున్నాక ఆదర్శ కుటుంబం ఏకె 47 కొత్త విడుదల తేదీ కోసం దగ్గుబాటి అభిమానులు కళ్ళు…

2 hours ago

రణబాలికి కాంతార రంగు

ఒక కొత్త సినిమా ప్రోమో రాగానే దాన్ని గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమాలతో పోల్చడం ఆడియన్స్ కు అలవాటే.…

2 hours ago

పవన్ పాలనకు చిరు కితాబు

తల్లిదండ్రులు పిల్లల్ని పొగిడితే ఆయుక్షీణం అంటారు. పవన్ కళ్యాణ్‌కు చిరంజీవి పేరుకు అన్నయ్యే కానీ.. ఆయనది తండ్రి స్థానమే. అందుకేనేమో…

4 hours ago

రామాయణ చుట్టూ పోటీ ఆంజనేయుళ్లు

నిర్మాతలు అదిగో ఇదిగో అనడమే తప్పించి ఫలానా డేటుకి రామాయణ పార్ట్ 1 రిలీజ్ అవుతుందని ఇప్పటికీ చెప్పకపోవడం మహా…

5 hours ago

పిల్లల స్కూలు విషయాలు సూర్యనే చూసుకుంటాడు

తమిళ నటుడు సూర్య పెద్ద స్టార్ హీరో అయినా.. ఏమాత్రం భేషజం లేని, ఉన్నత వ్యక్తిత్వం తనది. అభిమానులను అక్కున…

5 hours ago