Trends

యూట్యూబర్ వైష్ణ‌వి భ‌ర్త‌ను న‌డిరోడ్డుపై న‌రికి చంపారు

యూట్యూబ్ వీడియోల ద్వారా చాలా చిన్న వ‌య‌సులోనే మంచి పాపులారిటీ సంపాదించిన వైష్ణ‌వి అనే తెలంగాణ అమ్మాయి ఈ ఏడాది మార్చిలో హ‌త్య‌కు గురికావ‌డం సంచ‌ల‌నం రేపిన సంగ‌తి తెలిసిందే. త‌న భ‌ర్త హ‌రిబాబు చేతుల్లోనే వైష్ణ‌వి హ‌త్య‌కు గురైన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. అప్ప‌టికి ఆమె వ‌య‌సు 20 ఏళ్లు మాత్ర‌మే. పైగా ప్రెగ్నెంట్ కూడా.

వైష్ణ‌వి అత్తింటి నుంచి వేధింపులు ఎదుర్కొంటున్న‌ట్లు, భ‌ర్త అద‌న‌పు క‌ట్నం కోసం వేధించిన‌ట్లు అప్పుడు వార్త‌లు వ‌చ్చాయి. ఈ కేసులో జైలు పాలై, కొన్ని నెల‌ల త‌ర్వాత బెయిల్ మీద బ‌య‌టికి వ‌చ్చిన వైష్ణ‌వి భ‌ర్త‌ హ‌రిబాబు ఇప్పుడు ప‌ట్ట‌ప‌గ‌లు న‌డిరోడ్డుపై దారుణంగా హ‌త్య‌కు గురి కావ‌డం సంచ‌ల‌నం రేపుతోంది. దీనికి సంబంధించిన వీడియో కూడా సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

నిజామాబాద్ ఆర్ఆర్ కూడ‌లిలో హరిబాబుపై ఒక కుర్రాడుకత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి చంపేశాడు. హ‌రిబాబు రోడ్డు మీద న‌డుస్తుండ‌గా.. అత‌డికి స‌మీపంలో ఒక వైట్ క‌ల‌ర్ కారు ఆగింది. అందులోంచి ఒక కుర్రాడు క‌త్తితో బ‌య‌టికి వ‌చ్చి హ‌రిబాబు మీద క‌త్తితో దాడి చేశాడు. క్ష‌ణాల్లో కొన్ని క‌త్తి పోట్లు దించి తిరిగి కారు ఎక్కి ప‌రారైపోయాడు. తీవ్ర గాయాల పాలైన‌ హరిబాబు అక్కడికక్కడే మృతి.చెందాడు. ముందు హ‌తుడు ఎవ‌రో అనుకున్నారు. కానీ త‌ర్వాత అత‌ను దివంగ‌త‌ యూట్యూబర్ వైష్ణవి భర్తగా పోలీసులు గుర్తించారు. హ‌రిబాబు ఇటీవ‌లే బెయిల్ మీద బ‌య‌టికి రాగా.. అందుకోస‌మే వేచి చూసి అత‌డి మీద దాడికి పాల్ప‌డ్డ‌ట్లు అర్థ‌మ‌వుతోంది.

ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించే ప్ర‌య‌త్నంలో ఉన్నారు. వైష్ణ‌వికి సంబంధించిన వాళ్లే ఈ హ‌త్య‌కు పాల్ప‌డి ఉంటార‌నే అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. వైష్ణ‌వి మ‌ర‌ణించిన‌పుడు సోష‌ల్ మీడియాలో ఆమె ప‌ట్ల ఎంతో సానుభూతి వ్య‌క్త‌మైంది. ఆమెను హ‌త్య చేసిన‌ట్లు అభియోగాలు ఎదుర్కొన్న హరిబాబు హ‌త్య‌కు గురి కావ‌డంతో అత‌డికి త‌గిన శాస్తి జ‌రిగిందంటూ సామాజిక మాధ్య‌మాల్లో కామెంట్లు ప‌డుతుండ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on September 17, 2026 9:11 pm

Share

Recent Posts

విశ్వక్ సేన్ నిర్ణయం ఎటువైపు ఉంటుందో

ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా పడటం కేవలం వెంకటేష్ అభిమానులకే కాదు ఇతర హీరోలు, నిర్మాతలకు కూడా సంకటంగా…

43 minutes ago

శ్రీవిష్ణు సినిమాకు అదొక్కటే సవాల్

ఆదర్శ కుటుంబం లాంటి పెద్ద సినిమా రావాల్సిన డేటుకి శ్రీ విష్ణు సినిమా ‘కామ్రేడ్ కళ్యాణ్’ రాబోతోంది. ఇది ఈ…

49 minutes ago

రాజుగారికి రాములోరి అభయం దక్కుతుందా

యష్ ఇమేజ్ నమ్ముకుని టాక్సిక్ ని డిస్ట్రిబ్యూట్ చేసిన దిల్ రాజు దాని వల్ల ఎలాంటి ప్రయోజనం పొందలేదు. పైపెచ్చు…

2 hours ago

అగ్గిపెట్టి మ‌చ్చా ఇక లేడు

అగ్గిపెట్టి మ‌చ్చా.. సోష‌ల్ మీడియా వాడే తెలుగు వాళ్ల‌కు ప్ర‌త్యేకంగా ఈ పేరును ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌రం లేదు. అత‌డి…

3 hours ago

ఇకపై మొహమాటలు లేవంటున్న నాని

న్యాచురల్ స్టార్ నానికి ది ప్యారడైజ్ ఫలితం మంచి పాఠమయ్యింది. నైజామ్ వసూళ్ల వల్ల రికవరీ బాగానే జరిగినప్పటికీ అధిక…

3 hours ago

‘బ్రేకింగ్ బ్యాడ్’తో ‘జైలర్‌’కేం పని?

అటు ఇటుగా ఇంకో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ‘జైలర్-2’ సినిమా. 2023లో ఓ మోస్తరు అంచనాలతో వచ్చిన…

4 hours ago