Movie News

రాకా 37.. ఏమిటబ్బా?

అల్లు అర్జున్ ఒక కొత్త సినిమా మొదలుపెట్టాడు అంటే ప్రమోషన్ల పరంగా మొదట్నుంచి బాగా హడావుడి ఉంటుంది. రెగ్యులర్‌గా అప్‌డేట్స్ ఇవ్వడానికే ప్రయత్నిస్తుంటారు మేకర్స్. బన్నీ కూడా వ్యక్తిగతంగా తన సినిమాను వార్తల్లో నిలబెట్టడానికి తనదైన ప్రమోషనల్ స్ట్రాటజీతో అడుగులు వేస్తుంటాడు. కానీ అట్లీ దర్శకత్వంలో అతను నటిస్తున్న ‘రాకా’ గురించి ఎప్పుడూ హడావుడి పడట్లేదు. ఈ సినిమా మొదలై ఏడాది దాటింది. కానీ ఇప్పటిదాకా ఒక టైటిల్ ఫస్ల్ లుక్ తప్పితే ఏ విశేషమూ పంచుకోలేదు.

టీజర్ గురించి ఎప్పట్నుంచో వార్తలు వస్తున్నాయి కానీ.. టీం మాత్రం ఆ దిశగా ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదు. అక్టోబరులో టీజర్ అంటూ ఈ మధ్య మళ్లీ ఒక ప్రచారం మొదలైంది. అదెంత వరకు నిజం అన్నది తెలియడం లేదు. కానీ ఇంతలో ‘రాకా’ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్.. ఎక్స్‌లో 37 అనే నంబరుతో రాకా కొత్త పోస్టర్ రిలీజ్ చేసి అభిమానులను అయోమయానికి గురి చేసింది.

ఆ పోస్టర్ మీద 37 అనే అంకె తప్ప ఏ వివరం లేదు. ఈ నంబర్‌కు అర్థమేంటో తెలియక బన్నీ ఫ్యాన్స్ తలలు పట్టుకుంటున్నారు. 2027లో 7వ నెల 3వ తారీఖున సినిమా రిలీజ్ కాబోతోందని హింట్ ఇస్తున్నారా.. లేక త్వరలో టీజర్ లాంచ్ చేయబోతున్నట్లు హింట్ ఇస్తూ దాని నిడివి 37 సెకన్లని చెబుతున్నారా.. లేక ఇంకేదైనా హిడెన్ డీటైలింగ్ ఇందులో ఉందా అన్నది అర్థం కావడం లేదు. మొత్తానికి ఈ అప్‌డేట్‌తో సోషల్ మీడియాలో సినిమా మీద డిస్కషన్ అయితే మొదలైంది. త్వరలో ఏదో ఒక అప్‌డేట్ అయితే రాబోతోందని స్పష్టమైంది. అదేంటో చూడాలి.

సన్ పిక్చర్స్ ఏకంగా రూ.800 కోట్లకు పైగా బడ్జెట్లో నిర్మిస్తున్న ఈ చిత్రంలో బన్నీ సరసన దీపికా పదుకొనే, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్నా నటిస్తున్నారు. ఇందులో బన్నీ మృగం అవతారంలో కనిపించనున్నాడని ఫస్ట్ లుక్ చూస్తేనే అర్థమైంది. ఇంకా అతను పలు అవతారాల్లో దర్శనమిస్తాడని సమాచారం. ఈ చిత్రానికి సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నాడు.

This post was last modified on September 17, 2026 8:22 pm

Share

Recent Posts

అగ్గిపెట్టి మ‌చ్చా ఇక లేడు

అగ్గిపెట్టి మ‌చ్చా.. సోష‌ల్ మీడియా వాడే తెలుగు వాళ్ల‌కు ప్ర‌త్యేకంగా ఈ పేరును ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌రం లేదు. అత‌డి…

1 hour ago

ఇకపై మొహమాటలు లేవంటున్న నాని

న్యాచురల్ స్టార్ నానికి ది ప్యారడైజ్ ఫలితం మంచి పాఠమయ్యింది. నైజామ్ వసూళ్ల వల్ల రికవరీ బాగానే జరిగినప్పటికీ అధిక…

2 hours ago

‘బ్రేకింగ్ బ్యాడ్’తో ‘జైలర్‌’కేం పని?

అటు ఇటుగా ఇంకో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ‘జైలర్-2’ సినిమా. 2023లో ఓ మోస్తరు అంచనాలతో వచ్చిన…

2 hours ago

గుంత కనిపిస్తే AI చూసుకుంటుంది

రోడ్డుపై గుంత కనిపిస్తే ఫొటో తీసి సోషల్ మీడియాలో పెట్టడం వరకు చాలామంది చేస్తుంటారు. కానీ ఆ గుంతను బాగు…

3 hours ago

ప్రభాస్ ఫ్యాన్స్ అయోమయం తీర్చాల్సిందే

ఫౌజీ వాయిదా పడింది. సంతోషం. ఇలాంటి పోస్టుపోన్లు చూడటం కొత్తేమి కాదు కాబట్టి అందులో ఫీలవ్వడానికి ఏం లేదు. మరి…

3 hours ago

రోడ్డుపై పడుకొని ప్రియాంకా గాంధీ నిరసన

ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో వివాదాల నేపథ్యంలో ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని కాక్రోచ్…

4 hours ago