మహావతార నరసింహ.. గత ఏడాది పాన్ ఇండియా స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమా. ఈ యానిమేషన్ మూవీ రిలీజయ్యే ముందు ఎవ్వరూ దీన్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ విడుదల తర్వాత బహు భాషల్లో ఈ సినిమా అద్భుత విజయం సాధించింది. పాన్ ఇండియా స్థాయిలో వసూళ్లు రాబట్టింది. ఏకంగా రూ.400 కోట్ల మేర ఈ చిత్రం వసూళ్లు సాధించి సెన్సేషన్ క్రియేట్ చేసింది.
తెలుగులో కూడా ఈ మూవీకి ఊహించని స్థాయిలో కలెక్షన్లు వచ్చాయి. ఐతే ఇంత పెద్ద విజయం సాధించిన సినిమాకు చక్కగా తెలుగులో మాటలు, పాటలు రాసి ప్రశంసలు అందుకున్న రైటర్ రాకేందుమౌళిని మాత్రం చిత్ర బృందం గుర్తించలేదు. అతడికి సినిమాలో టైటిల్ కార్డ్ ఇవ్వకపోవడమే కాదు.. ప్రమోషన్లలోనూ భాగం చేయలేదు.
ఈ విషయమై రాకేందుమౌళి ఒక ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేశాడు.
మహావతార నరసింహ సినిమాకు పని చేయడం తనకు చాలా ఆనందమని… కానీ తన విషయంలో ఆ చిత్ర బృందం మాత్రం సంతోషంగా లేదనిపించిందని రాకేందుమౌళి వ్యాఖ్యానించాడు. తాను ఎంతో మనసుపెట్టి ఆ సినిమాకు పాటలు, మాటలు రాశానని.. జనం వాటిని ఎంతో మెచ్చారని.. కానీ ఆ చిత్ర బృందం మాత్రం సినిమాలో తన పేరు వేయలేదని అతనన్నాడు. ఈ సినిమా ప్రెస్ మీట్, సక్సెస్ మీట్లకు కూడా తనను పిలవలేదని అతను చెప్పాడు.
సినిమాతో సంబంధం లేని తనికెళ్ల భరణి, జొన్నవిత్తుల లాంటి వాళ్లను ప్రెస్ మీట్లకు, సక్సెస్ మీట్లకు పిలిచారని.. కానీ తనను మాత్రం పట్టించుకోలేదని, ఇందుకు కారణమేంటో తెలియదని రాకేందుమౌళి ఆవేదన చెందాడు.
ఇటీవల రిలీజైన రామాయణానికి కూడా తాను పాటలు రాయడం మంచి అనుభవమని.. ఐతే హిందీలో జై శ్రీరామ్ పాటలో కృష్ణ దామోదరరం అంటూ త్రేతా యుగంలో కృష్ణుడి ప్రస్తావన తెచ్చారని, అది పెద్ద బూతు అని, తాను తెలుగు వరకు దాన్ని మార్చి వాసుదేవం హరిం అని రాశానని రాకేందుమౌళి వెల్లడించాడు. డబ్బింగ్ సినిమాల పాటలు, మాటల విషయంలో స్ట్రెయిట్ సినిమాల ఫీల్ తీసుకువచ్చిన ఘనత తనదని అతనీ సందర్భంగా వ్యాఖ్యానించాడు.
This post was last modified on November 17, 2026 11:41 pm
టాలీవుడ్ టాలెంటెడ్ దర్శకుల్లో వెంకీ కుడుముల పేరు ఖచ్చితంగా ఉంటుంది. రష్మిక మందన్న ఇవాళ ఈ స్థాయికి వచ్చిందంటే ఛలో…
మహిళల భద్రతపై మరోసారి ఆందోళన కలిగించే ఘటన తెలంగాణలో చోటుచేసుకుంది. ఇంటికి వెళ్లేందుకు ఆటోలో లిఫ్ట్ ఇస్తామని నమ్మించిన ఇద్దరు…
ప్రపంచ టెక్ రంగంలో సంచలనం సృష్టించిన ఎన్విడియా మాజీ సీఈవో జెన్సెన్ హువాంగ్ వ్యవహారం మరో మలుపు తిరిగింది. వివాహేతర…
బంధువులను రైలు ఎక్కించడానికి వెళ్లినవాళ్లు అనుకోకుండా అదే రైలులో ప్రయాణించాల్సి వచ్చింది. పైగా టికెట్లు లేకపోవడంతో ఏకంగా రూ.36,140 చెల్లించాల్సి…
మెగాస్టార్ చిరంజీవి స్క్రీన్ మీదే కాదు స్టేజి పైన ఉన్నప్పుడు కూడా ఆయన ఎనర్జీ వేరే లెవెల్ లో ఉంటుంది.…
ప్రియాంక గాంధీ తన ఇంట్లో గత 22 ఏళ్లుగా పనిచేస్తున్న మహిళకు ఒక మధురమైన అనుభూతిని అందించారు. తమిళనాడు సీఎం…