Movie News

దర్శకుడికి రిలీఫ్.. సినిమాకు రిలీజ్ డేట్

మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్ చిత్రాలతో తెలుగులో మంచి ఫాలోయింగ్ సంపాదించాడు మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్. ఇప్పుడు అతడికి అత్యధిక మార్కెట్ ఉన్నది తెలుుగలోనే అంటే ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఇటీవల ‘ఐమ్ గేమ్’ పేరుతో సొంత భాష మలయాళంలో సినిమా చేస్తే డిజాస్టర్ అయింది. తెలుగులో నటిస్తున్న ఆకాశంలో ఒక తార, శ్రీశ్రీ చిత్రాల మీదే అతను ఎక్కువ ఆశలు పెట్టుకున్నాడు.

ఇందులో ‘శ్రీశ్రీ’ సినిమా డిసెంబరులో వస్తుందంటున్నారు. కానీ ముందే రిలీజ్ కావాల్సిన ‘ఆకాశంలో ఒక తార’ రిలీజ్ విషయంలో స్పష్టత లేదు. కొంత కాలంగా ఈ సినిమా అస్సలు వార్తల్లో లేదు. అందుక్కారణం దీని దర్శకుడు పవన్ సాధినేని ఒక వ్యక్తిగత వివాదంలో చిక్కుకోవడమే. పవన్ తనను మోసం చేశాడంటూ ఒక వర్ధమాన నటి.. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతను ఆ గొడవలో పడి సినిమాను కొంత కాలం పక్కన పెట్టాల్సి వచ్చింది.

ఐతే పవన్ బయట మాట్లాడుకుని ఆ వివాదానికి తాత్కాలికంగా తెరదించాడు. మళ్లీ గొడవ ముదిరితే చెప్పలేం కానీ.. ప్రస్తుతానికి సద్దుమణిగినట్లే అని తెలుస్తోంది. ఈ మధ్యే పవన్ మళ్లీ తన సినిమా పనుల్లో పడ్డాడు. బ్యాలెన్స్ షూటింగ్‌కు షెడ్యూల్స్ వేసుకుని.. పోస్ట్ ప్రొడక్షన్‌కు అయ్యేు రోజులను కూడా క్యాల్కులేట్ చేసుకుని సినిమా రిలీజ్ డేట్ మీద ఒక నిర్ణయానికి వచ్చింది టీం. నవంబరు 20న ‘ఆకాశంలో ఒక తార’ ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ప్రకటన కూడా వచ్చేసింది.

ఈ సినిమా నవంబర్లో వస్తోందంటే ‘శ్రీశ్రీ’ కొంచెం ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది. ఈ చిత్రంతో సాత్విక వీరవల్లి అనే కొత్త తెలుగమ్మాయి కథానాయికగా పరిచయం అవుతుండడం విశేషం. జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం ప్రొడ్యూస్ చేస్తున్నారు.

This post was last modified on September 17, 2026 8:33 pm

Share

Recent Posts

రాజుగారికి రాములోరి అభయం దక్కుతుందా

యష్ ఇమేజ్ నమ్ముకుని టాక్సిక్ ని డిస్ట్రిబ్యూట్ చేసిన దిల్ రాజు దాని వల్ల ఎలాంటి ప్రయోజనం పొందలేదు. పైపెచ్చు…

38 minutes ago

అగ్గిపెట్టి మ‌చ్చా ఇక లేడు

అగ్గిపెట్టి మ‌చ్చా.. సోష‌ల్ మీడియా వాడే తెలుగు వాళ్ల‌కు ప్ర‌త్యేకంగా ఈ పేరును ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌రం లేదు. అత‌డి…

2 hours ago

ఇకపై మొహమాటలు లేవంటున్న నాని

న్యాచురల్ స్టార్ నానికి ది ప్యారడైజ్ ఫలితం మంచి పాఠమయ్యింది. నైజామ్ వసూళ్ల వల్ల రికవరీ బాగానే జరిగినప్పటికీ అధిక…

2 hours ago

‘బ్రేకింగ్ బ్యాడ్’తో ‘జైలర్‌’కేం పని?

అటు ఇటుగా ఇంకో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ‘జైలర్-2’ సినిమా. 2023లో ఓ మోస్తరు అంచనాలతో వచ్చిన…

3 hours ago

గుంత కనిపిస్తే AI చూసుకుంటుంది

రోడ్డుపై గుంత కనిపిస్తే ఫొటో తీసి సోషల్ మీడియాలో పెట్టడం వరకు చాలామంది చేస్తుంటారు. కానీ ఆ గుంతను బాగు…

3 hours ago

ప్రభాస్ ఫ్యాన్స్ అయోమయం తీర్చాల్సిందే

ఫౌజీ వాయిదా పడింది. సంతోషం. ఇలాంటి పోస్టుపోన్లు చూడటం కొత్తేమి కాదు కాబట్టి అందులో ఫీలవ్వడానికి ఏం లేదు. మరి…

4 hours ago