Trends

పాపం… ట్రైన్ ఎక్కిద్దాం అని వెళ్ళి ఫైన్ కట్టి వచ్చారు

బంధువులను రైలు ఎక్కించడానికి వెళ్లినవాళ్లు అనుకోకుండా అదే రైలులో ప్రయాణించాల్సి వచ్చింది. పైగా టికెట్లు లేకపోవడంతో ఏకంగా రూ.36,140 చెల్లించాల్సి వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ రైల్వే స్టేషన్‌లో ఈ ఘటన జరిగింది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో బంధువుల లగేజీ సర్దేందుకు వెళ్లిన 12 మంది పెద్దలు, ఒక చిన్నారి అందులోనే చిక్కుకుపోయారు. ఆటోమేటిక్ తలుపులు మూసుకుపోవడంతో రైలు దిగేందుకు అవకాశం లేకుండా పోయింది.

నవంబర్ 15న బనారస్ నుంచి న్యూఢిల్లీ వెళ్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఉదయం 9.26 గంటలకు కాన్పూర్ సెంట్రల్ స్టేషన్‌కు చేరుకుంది. అక్కడ కొందరు ప్రయాణికులను ఎక్కించేందుకు వారి బంధువులు రైలు లోపలికి వెళ్లారు. లగేజీ పెట్టి, సీట్లలో కూర్చోబెట్టి తిరిగి దిగాలనుకున్నారు. కానీ ఉదయం 9.30 గంటలకు రైలు బయలుదేరే సమయానికి తలుపులు మూసుకుపోయాయి. వాటిని తెరవడం సాధ్యం కాకపోవడంతో అందరూ రైలులోనే ఉండిపోయారు.

రైలు కదిలిన తర్వాత తమను దించేయాలని సిబ్బందిని కోరారు. అయితే మధ్యలో రైలును నిలపలేమని చెప్పడంతో కొందరు ఆందోళనకు దిగారు. దీంతో సిబ్బంది తుండ్లా కంట్రోల్ రూమ్‌కు సమాచారం ఇచ్చారు. అక్కడి అధికారుల ఆదేశాలతో కాన్పూర్ నుంచి దాదాపు 140 కిలోమీటర్ల దూరంలోని ఇటావా జంక్షన్‌లో రైలును ప్రత్యేకంగా ఆపారు. ఉదయం 10.49 గంటలకు అక్కడికి చేరుకున్న తర్వాత అందరినీ దించారు. అప్పటికే దాదాపు 79 నిమిషాల ప్రయాణం పూర్తయింది.

అయితే ఇటావాలో దిగిన తర్వాత కూడా వారికి ఇబ్బందులు తప్పలేదు. టికెట్లు లేకుండా ప్రయాణించినందుకు రైల్వే అధికారులు టికెట్ ఛార్జీలు, జరిమానా కలిపి మొత్తం రూ.36,140 వసూలు చేశారు. వందే భారత్ రైళ్లలో బయలుదేరే ముందు తలుపులు మూసుకుంటాయని ప్రకటన చేస్తారు. ఆ సమయంలో ప్రయాణికులు కానివారు తప్పనిసరిగా దిగిపోవాలని అధికారులు తెలిపారు. ప్లాట్‌ఫామ్ టికెట్ ఉన్నా రైలులో ప్రయాణించేందుకు అనుమతి ఉండదని స్పష్టం చేశారు. 

This post was last modified on November 17, 2026 9:15 pm

Share

Recent Posts

చిరు లీక్స్ రొటీన్ అవుతున్నాయా

మెగాస్టార్ చిరంజీవి స్క్రీన్ మీదే కాదు స్టేజి పైన ఉన్నప్పుడు కూడా ఆయన ఎనర్జీ వేరే లెవెల్ లో ఉంటుంది.…

14 minutes ago

విజయ్‌తో ఫొటో.. పనిమనిషి కల నిజం చేసిన ప్రియాంక గాంధీ

ప్రియాంక గాంధీ తన ఇంట్లో గత 22 ఏళ్లుగా పనిచేస్తున్న మహిళకు ఒక మధురమైన అనుభూతిని అందించారు. తమిళనాడు సీఎం…

59 minutes ago

ఇకపై బైకులకు కూడా సేఫ్టీ ఎయిర్‌బ్యాగ్స్

కార్లలో ప్రమాదం జరిగినప్పుడు ప్రాణాలను కాపాడటంలో ఎయిర్‌బ్యాగ్స్ కీలక పాత్ర పోషిస్తాయి. అదే టెక్నాలజీని ఇప్పుడు హెల్మెట్‌లోనూ ఉపయోగించే ఆలోచన…

2 hours ago

ధోనీ ఎందుకింత స్పెషల్?

ధోనీ బ్యాటింగ్‌కు వస్తున్నాడంటే చాలు.. చెన్నైతో సంబంధం లేని జట్ల అభిమానులు కూడా అతడి కోసం ఎదురుచూసేవారు. ఒక్కోసారి సొంత…

2 hours ago

ఈసీ vs యోగి… ఇది ఊహించలేదే..!

డామిట్... కథ అడ్డం తిరిగింది అన్నట్టుగా తయారైంది బీజేపీ పరిస్థితి. వివాదాస్పద " ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ…

2 hours ago

ధోనీ లేకుండా CSK… ఇప్పుడు మారాల్సింది ఏంటి?

ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ఐదు టైటిళ్లు అందించిన మహేంద్ర సింగ్ ధోనీ ఆ జట్టు నుంచి తప్పుకున్నాడు. ఇక…

2 hours ago