Trends

అక్రమ సంబంధాల వివాదం… మళ్ళీ సీఈవోగా వస్తానంటున్న జెన్సెన్

ప్రపంచ టెక్ రంగంలో సంచలనం సృష్టించిన ఎన్విడియా మాజీ సీఈవో జెన్సెన్ హువాంగ్ వ్యవహారం మరో మలుపు తిరిగింది. వివాహేతర సంబంధాల వివాదం కారణంగా సీఈవో పదవికి రాజీనామా చేసిన ఆయన, ఇప్పుడు మళ్లీ అదే బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమని ప్రకటించారు. కంపెనీ బోర్డు తిరిగి అవకాశం ఇస్తే గర్వంగా స్వీకరిస్తానని స్పష్టం చేశారూ.

జెన్సెన్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివాదం తొలుత ఆయనకు చైనా గూఢచర్య సంస్థలతో సంబంధాలున్నాయనే అనుమానాల నేపథ్యంలో వెలుగులోకి వచ్చింది. చైనా వ్యాపారవేత్త ఆలిస్ హువాంగ్‌తో ఆయనకు సన్నిహిత సంబంధం ఉన్నట్లు అమెరికా నిఘా వర్గాలు అనుమానించాయని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఆమె ద్వారా చైనాకు కీలక సమాచారం చేరే అవకాశం ఉందన్న ఆందోళనలు కూడా వ్యక్తమయ్యాయి.

ఈ వివాదంపై ఎన్విడియా బోర్డు స్వతంత్ర విచారణకు ఆదేశించింది. ఇదే సమయంలో తన భార్యకు నమ్మకద్రోహం చేశానని, తన చర్యల వల్ల భార్యాపిల్లలు బాధపడ్డారని జెన్సెన్ స్వయంగా అంగీకరించారు. తన తప్పుకు ఎలాంటి సాకులు లేవని, కుటుంబానికి క్షమాపణలు చెబుతున్నానని ఉద్యోగులకు పంపిన సందేశంలో పేర్కొన్నారు.

ఆ తర్వాత ఎన్విడియాలో పనిచేసే మరో మహిళా ఉద్యోగితో కూడా జెన్సెన్‌కు వివాహేతర సంబంధం ఉందంటూ వార్తలు వెలువడ్డాయి. ఈ పరిణామాలతో వివాదం మరింత ముదిరింది. కంపెనీ ప్రతిష్ఠతో పాటు జాతీయ భద్రతకు సంబంధించిన అంశాలు కూడా చర్చలోకి రావడంతో ఆయనపై ఒత్తిడి పెరిగింది.

ఈ పరిణామాల మధ్య నవంబర్ 12న ఎన్విడియా జెన్సెన్ రాజీనామాను అధికారికంగా ప్రకటించింది. కంపెనీ సీఎఫ్ఓ కొలెట్ క్రెస్‌ను తాత్కాలిక సీఈవోగా నియమించింది. శాశ్వత వారసుడి కోసం బోర్డు అన్వేషణ ప్రారంభించింది. దీంతో ఎన్విడియా చరిత్రలో కీలక అధ్యాయం ముగిసినట్లయింది.

అయితే, తాజాగా స్పందించిన జెన్సెన్ తన పునరాగమనంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తిరిగి సీఈవోగా రావాలని ఉద్యోగులు, ఇన్వెస్టర్లు, వ్యాపార భాగస్వాములు, కస్టమర్ల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయని తెలిపారు. కంపెనీ బోర్డు తనను తిరిగి ఆ బాధ్యతల్లో చూడాలని నిర్ణయిస్తే దాన్ని గౌరవంగా భావిస్తానని చెప్పారు. తన వ్యక్తిగత జీవితంలో చేసిన తప్పులకు బాధ్యత వహిస్తూనే, బోర్డు విచారణకు పూర్తిగా సహకరిస్తానని కూడా స్పష్టం చేశారు.

ఒకవైపు వ్యక్తిగత వివాదం, మరోవైపు జాతీయ భద్రతకు సంబంధించిన అనుమానాలు.. ఇన్ని పరిణామాల తర్వాత జెన్సెన్ మళ్లీ సీఈవోగా రావడానికి సిద్ధమని ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. అయితే ఆయన తిరిగి రావడంపై ఎన్విడియా బోర్డు ఇంకా నిర్ణయం తీసుకోలేదు. మరి ఈ వివాదం నుంచి బయటపడి జెన్సెన్ మళ్లీ సంస్థ పగ్గాలు చేపడతారా అనేది చూడాలి.

This post was last modified on November 17, 2026 10:51 pm

Share

Recent Posts

లిఫ్ట్ అడిగేటప్పుడు జాగ్రత్త మహిళలు

మహిళల భద్రతపై మరోసారి ఆందోళన కలిగించే ఘటన తెలంగాణలో చోటుచేసుకుంది. ఇంటికి వెళ్లేందుకు ఆటోలో లిఫ్ట్ ఇస్తామని నమ్మించిన ఇద్దరు…

11 minutes ago

పాపం… ట్రైన్ ఎక్కిద్దాం అని వెళ్ళి ఫైన్ కట్టి వచ్చారు

బంధువులను రైలు ఎక్కించడానికి వెళ్లినవాళ్లు అనుకోకుండా అదే రైలులో ప్రయాణించాల్సి వచ్చింది. పైగా టికెట్లు లేకపోవడంతో ఏకంగా రూ.36,140 చెల్లించాల్సి…

37 minutes ago

చిరు లీక్స్ రొటీన్ అవుతున్నాయా

మెగాస్టార్ చిరంజీవి స్క్రీన్ మీదే కాదు స్టేజి పైన ఉన్నప్పుడు కూడా ఆయన ఎనర్జీ వేరే లెవెల్ లో ఉంటుంది.…

41 minutes ago

విజయ్‌తో ఫొటో.. పనిమనిషి కల నిజం చేసిన ప్రియాంక గాంధీ

ప్రియాంక గాంధీ తన ఇంట్లో గత 22 ఏళ్లుగా పనిచేస్తున్న మహిళకు ఒక మధురమైన అనుభూతిని అందించారు. తమిళనాడు సీఎం…

1 hour ago

ఇకపై బైకులకు కూడా సేఫ్టీ ఎయిర్‌బ్యాగ్స్

కార్లలో ప్రమాదం జరిగినప్పుడు ప్రాణాలను కాపాడటంలో ఎయిర్‌బ్యాగ్స్ కీలక పాత్ర పోషిస్తాయి. అదే టెక్నాలజీని ఇప్పుడు హెల్మెట్‌లోనూ ఉపయోగించే ఆలోచన…

2 hours ago

ధోనీ ఎందుకింత స్పెషల్?

ధోనీ బ్యాటింగ్‌కు వస్తున్నాడంటే చాలు.. చెన్నైతో సంబంధం లేని జట్ల అభిమానులు కూడా అతడి కోసం ఎదురుచూసేవారు. ఒక్కోసారి సొంత…

2 hours ago