Trends

పాకిస్థాన్ టీమ్‌లో ఫిక్సింగ్ కలకలం.. స్టార్ ప్లేయర్ల ఫోన్లు సీజ్!

ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న పాకిస్థాన్ క్రికెట్ జట్టులో ఫిక్సింగ్ ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. మూడో టెస్టుకు ముందు పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ (పీసీబీ) ఏకంగా ఏడుగురు ఆటగాళ్లను స్వదేశానికి పంపించేయడం, ఇద్దరు కోచ్‌లను తప్పించడం వెనుక అసలు కారణం ఆటతీరు కాదని, ఫిక్సింగ్ వ్యవహారమేనని పాక్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

ఈ వివాదంలో ప్రధానంగా వెటరన్ ప్లేయర్లు మహ్మద్ రిజ్వాన్, ఇమామ్ ఉల్ హక్ పేర్లు వినిపిస్తున్నాయి. లార్డ్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ 194 పరుగుల తేడాతో ఘోరంగా ఓడిపోయిన తర్వాత, జట్టు భద్రతా అధికారి ఈ ఇద్దరి మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఆ ఫోన్ల నుంచి డేటాను వేరే డివైజ్‌లోకి బదిలీ చేసుకున్న తర్వాతే తిరిగి వారికి ఇచ్చారని సమాచారం.

పాక్ మీడియా కథనాల నేపథ్యంలో పీసీబీ డైరెక్టర్ అఫ్ మీడియా అమీర్ మీర్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఆటగాళ్ల క్రమశిక్షణ, ప్రవర్తనపై వస్తున్న వార్తల ఆధారంగా అంతర్గత విచారణ ప్రారంభించామని ఆయన క్లారిటీ చేశారు. ఈ ఇద్దరే కాకుండా మరికొంత మంది ఆటగాళ్ల డివైజ్‌లను కూడా బోర్డు సీజ్ చేసిందని, చివరి టెస్టు పూర్తయ్యే వరకు వాటిని తిరిగి ఇవ్వకూడదని నిర్ణయించినట్లు స్థానిక మీడియా పేర్కొంది.

జట్టు ప్రక్షాళనలో భాగంగా హెడ్ కోచ్ సర్ఫరాజ్ అహ్మద్, బౌలింగ్ కోచ్ ఉమర్ గుల్ ఇద్దరినీ పీసీబీ బాధ్యతల నుంచి తప్పించింది. స్వదేశానికి పంపిన ఏడుగురు ఆటగాళ్ల స్థానంలో కొత్తగా మరో ఏడుగురిని ఎంపిక చేసింది. వీరిలో ఐదుగురు అంతర్జాతీయ అరంగేట్రం చేయని వారు కాగా, సయీమ్ అయూబ్, అబ్దుల్లా ఫజల్ మాత్రమే సీనియర్లు.

లార్డ్స్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో గాయం కారణంగా ఇమామ్ ఉల్ హక్ బ్యాటింగ్‌కు రాకపోవడంపై పీసీబీ హై పెర్ఫార్మెన్స్ డైరెక్టర్ ఆకిబ్ జావేద్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో ఆటగాళ్లు ప్లాస్టర్లు వేసుకుని మరీ ఆడేవారని, కేవలం కండరాలు పట్టేయడం వల్ల రెండు ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్ చేయకపోవడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఇమామ్ కావాలనే గాయం నాటకం ఆడాడని చెప్పలేను కానీ, దీనిపై కచ్చితంగా విచారణ ఎదుర్కోవాల్సిందేనని ఆకిబ్ తేల్చి చెప్పారు.

This post was last modified on September 8, 2026 10:51 am

Share

Recent Posts

రాజమౌళి రాజసానికి 25 సంవత్సరాలు

టాలీవుడ్ పుట్టినప్పటి నుంచి ఎందరో లెజెండరీ దర్శకులను ఇచ్చింది. చరిత్రలో ఎప్పటికీ చెప్పుకునే గొప్పవాళ్లను ప్రపంచానికి పరిచయం చేసింది. కెవి…

3 minutes ago

రాజమౌళిని ఫాలో అవుతున్న రణబాలి

సినిమా లవర్స్‌కు సినిమా తెర వెనుక సంగతుల మీద కూడా అమితాసక్తి ఉంటుంది. ఘనవిజయం సాధించిన సినిమాలకు సంబంధించి మేకింగ్…

5 minutes ago

దాదాకున్న సమయం తక్కువే కానీ

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కలయికలో తెరకెక్కుతున్న దాదా షూటింగ్ ఇంకా రీ స్టార్ట్ కాలేదు. బాలయ్య ఇప్పుడిప్పుడే…

43 minutes ago

రణబాలి… దర్శకుడి క్లారిటీ సూపర్

ఈ రోజుల్లో చెప్పిన రిలీజ్ డేట్‌కు సినిమాను రిలీజ్ చేసే ఫిలిం మేకర్స్ బాగా తగ్గిపోయారు. కాస్త పేరున్న సినిమా…

2 hours ago

విశాఖ‌, విజ‌య‌వాడ‌, తిరుప‌తి… ఈ మూడే కూట‌మికి కీల‌కం!

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో కూట‌మికి కీల‌కంగా మారిన మూడు మునిసిప‌ల్‌ కార్పొరేష‌న్ల వ్య‌వ‌హారం.. ఆస‌క్తిగా మారింది. రాజ‌కీయ వ‌ర్గాల్లోనే కాదు..…

3 hours ago

ఏఐతో 100 కోట్ల ప్రాణాలకు ముప్పు?

సాంకేతిక రంగంలో పెను విప్లవానికి దారి తీస్తున్న ఏఐ ఇంకా పూర్తిగా అందుబాటులోకి రాకముందే ప్రపంచాన్ని హడలెత్తిస్తుంది. అణ్వాయుధాల కంటే…

3 hours ago