Trends

ఢిల్లీలో కుప్పకూలిన హాస్టల్… శిథిలాల కింద 50 మంది?

ఢిల్లీ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్ సమీపంలోని సత్య నికేతన్ ప్రాంతంలో 4 అంతస్తుల భవనం హఠాత్తుగా కుప్పుకూలిన ఘటన షాకింగ్ గా మారింది. ఈ భవనంలో పీజీ హాస్టల్ నిర్వహిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో 50 మంది విద్యార్థులు హాస్టల్ లో ఉన్నట్లు తెలుస్తోంది. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

అయితే, ఆదివారం కావడంతో చాలామంది విద్యార్థులు హాస్టల్ లో ఉన్నారని, శిథిలాల కింద ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు చిక్కుకొని ఉంటారని అనుమానిస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటల సమయం కావడంతో భోజనం చేసేందుకు విద్యార్థులు హాస్టల్ లోనే ఉండే అవకాశం ఉంది. ఢిల్లీ వర్సిటీకి దగ్గరగా ఉండటంతో ఈ ప్రాంతంలో హాస్టళ్ల సంఖ్య ఎక్కువ. ఈ ప్రాంతంలోని హాస్టళ్లలో ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు ఉంటున్నారు.

ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం భవనం కింద 50 మంది ఉంటారని తెలుస్తోంది. వారిని బయటకు తీసుకువచ్చేందుకు జేసీబీలు,12 ఫైర్ ఇంజన్లు రంగంలోకి దిగాయి. శిథిలాలను తొలగిస్తున్న కొద్దీ హెల్ప్ అంటూ విద్యార్థుల కేకలు వినిపిస్తున్నట్లు సహాయక సిబ్బంది చెబుతున్నారు. భవనం కూలడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

This post was last modified on September 6, 2026 5:20 pm

Share

Recent Posts

కార్తీ రేంజు ఇంత పడిపోయిందా

యుగానికి ఒక్కడు, నా పేరు శివ, ఖైదీ, ఊపిరి లాంటి సూపర్ హిట్స్ తో కార్తీకి తెలుగులోనూ సాలిడ్ మార్కెట్…

45 minutes ago

జడల్ జమానాకు ఇంకో కీలక ఛాన్స్

నైజాంలో డీసెంట్ గా నెట్టుకొస్తున్న ప్యారడైజ్ రెండో వారంలోకి అడుగు పెట్టడానికి ముందే ఆంధ్ర, సీడెడ్ సైడ్ బాగా నెమ్మదించిపోవడం…

58 minutes ago

ఖైరతాబాద్ నుంచి జనసేన పోటీ

ఏ నిముషంలో దానం నాగేందర్ పార్టీ మారి ఎమ్మెల్యే పదవి కోల్పోయాడో కానీ తెలంగాణా రాజకీయాలు మరింత సందడిగా మారిపోయాయి.…

2 hours ago

రాజమౌళి చెప్పిన ఈ ఫార్ములా ఫాలో అయితే?

రాజమౌళి తన సినిమాల మేకింగ్ కోసం ఎక్కువ టైం తీసుకుంటాడన్న మాటే కానీ.. ఔట్ పుట్ మాత్రం వేరే లెవెల్లో…

2 hours ago

ఫోన్ కోసం పుట్టిన పసికందునే అమ్మేశారు

ప్రపంచీకరణ నేపథ్యంలో మానవ సంబంధాలన్ని అంగడిలో సరుకులుగా మారిపోతున్నాయి. బంధాలు, అనుబంధాలు ఖరీదైన వస్తువులుగా మారిపోయాయి. పాపాయి కంటే రూపాయికే…

3 hours ago

జూనియర్ ఇచ్చిన జోష్ సరిపోతుందా

ఎల్లుండి విడుదల కాబోతున్న 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' ప్రమోషన్ల ఘట్టం చివరి అంకాన్ని నిన్న దిగ్విజయంగా పూర్తి చేశారు.…

3 hours ago