ఇటీవల ఇద్దరు ఫోక్ డ్యాన్సర్లకు సంబంధించిన వ్యక్తిగత వివాదం సోషల్ మీడియాలో, మీడియాలో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పెళ్లయి బిడ్డ కూడా ఉన్న ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్ సాయికి.. మాధురి రాథోడ్ అనే అమ్మాయికి మధ్య సంబంధం గురించి పెద్ద గొడవే నడిచింది. వీళ్లిద్దరూ కలిసి ఉండగా పట్టుకున్న ఈశ్వర్ సాయి భార్య.. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలోకి వదలడంతో హాట్ టాపిక్‌గా మారింది.
తర్వాత ఇందులో భర్త తప్పేమీ లేదని ఈశ్వర్ సాయి భార్య మాట్లాడితే.. తర్వాత ఈశ్వర్ తన తప్పు ఒప్పుకుని క్షమాపణలు చెప్పాడు. మరోవైపేమో.. ఈశ్వర్ సాయి మీద మాధురి రాథోడ్ కేసు పెట్టడం సంచలనం రేపింది. తర్వాత ఈ వ్యవహారం మీద ఏ అప్‌డేట్స్ లేవు.
ఐతే ఇప్పుడు మాధురి ఆత్మహత్యాయత్నం చేసిందన్న వార్త కలకలం రేపుతోంది. ఈశ్వర్ సాయి మీద తాను ఫిర్యాదు చేసినా అరెస్ట్ చేయకపోవడంతో మనస్తాపానికి గురై మాధురి ఆత్మహత్యాయత్నం చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఒక గదిలోకి వెళ్లి మాధురి ఫ్యాన్‌కు ఉరి వేసుకోగా.. డోర్ పగలగొట్టి ఆమెను కుటుంబ సభ్యులు కాపాడారట. ఈ విషయం కొంత ఆలస్యంగా వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఈశ్వర్ సాయి తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసినట్లుగా మాధురి ఆరోపిస్తోంది.
దీనికి తోడు తన ఫిర్యాదును అనుసరించి పోలీసులు ఈశ్వర్ సాయిని అరెస్టు చేయకపోవడాన్ని నిరసిస్తూ ఆమె ఆత్మహత్యాయత్నం చేసిందట. ఈశ్వర్ సాయిని తప్పించే దిశగా నార్సింగి పోలీసులు పయత్నిస్తున్నట్లు ఆమె ఆరోపిస్తోంది. ఇదిలా ఉండగా.. ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ వ్యవహారం వెలుగులోకి వచ్చాక.. వాళ్లిద్దరూ కలిసి.. విడివిడిగా చేసిన పాటలు యూట్యూబ్‌లో మార్మోగిపోతుండడం విశేషం.
This post was last modified on September 6, 2026 6:17 pm
ఈ ప్రశ్నకు సమాధానం కోసం ఎక్కువ ఆలోచించాల్సింది ఏముంది? రచయితగా తన తొలి సినిమా స్వయంవరం కాబట్టి.. ఆ సినిమాకే…
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు వల్లభనేని వంశీ రాజకీయాల్లో దూకుడు పెంచారు. ప్రస్తుతం పార్టీని బలోపేతం చేసే దిశగా…
నిఖిల్ సిద్దార్థ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన సినిమా స్వయంభు. షూటింగ్ ఎప్పుడో పూర్తయ్యింది. ఫిబ్రవరితో…
కాకా షూటింగ్ పరుగులు పెడుతోంది. నవంబర్ చివరిలోపు దర్శకుడు బాబీ కొల్లి గుమ్మడికాయ కొట్టేలా ఉన్నాడు. తమన్ ఫస్టాఫ్ రీ…
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రజాదరణ రేటింగ్ ఒక్కసారిగా పడిపోయింది. వాస్తవానికి గత ఏడాదే ఆయన ప్రజాదరణ తగ్గుముఖం…
టాలీవుడ్ పుట్టినప్పటి నుంచి ఎందరో లెజెండరీ దర్శకులను ఇచ్చింది. చరిత్రలో ఎప్పటికీ చెప్పుకునే గొప్పవాళ్లను ప్రపంచానికి పరిచయం చేసింది. కెవి…