ఆకస్మిక ప్రచండ వరదలతో అతలాకుతలమైన నేపాల్ తాజాగా ప్రపంచ దేశాలను ఉద్దేశించి కీలక ప్రకటన చేసింది. “భౌతికంగా మీరు మాకు సాయం చేసేందుకు వస్తామని వర్తమానం పంపుతున్నారు. మంచిదే. కానీ, మీ భౌతిక సాయం మాకు వద్దు.“ అని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన మంత్రి బాలేంద్ర షా కార్యాలయం సహా.. విదేశాంగ శాఖ కూడా సంయుక్తంగా ఈ ప్రకటన విడుదల చేశాయి. అయితే.. ఇదేసమయంలో డబ్బులు సాయం చేసేవారిని నేపాల్ స్వాగతించింది. ఇక్కడ కూడా భారీ ట్విస్ట్ పెట్టింది. “మాకు ఆర్థిక సాయం చేసేవారిని స్వాగతిస్తున్నాం.“ అనిపేర్కొంది.
కానీ, ఈ ఆర్థిక సాయం అప్పుగానో..చే బదులుగానో ఇస్తే.. తమకు అవసరం లేదని నేపాల్ స్పష్టం చేయడం గమనార్హం. కేవలం ప్రధాన మంత్రి సహాయ నిధికి మాత్రమే ఇవ్వాలని ప్రపంచ దేశాలకు నేపాల్ విజ్ఞప్తి చేసింది. అంటే.. ఈ నిధికి ఎవరైనా సాయం చేస్తే.. నేపాల్ ఇక.. ఆ సాయం చేసిన వారికి తిరిగి ఇచ్చే ప్రశ్న ఉత్పన్నం కాదు. దీనికి అంగీకరించిన దేశాలు.. తమ ఆర్థిక సాయాన్ని సదరు ఖాతాకు జమ చేయాలని నేపాల్ విదేశాంగ శాఖ అకౌంట్ నెంబరుతో కూడిన ప్రధాన మంత్రి ఆపన్న సాయం ఖాతా వివరాలను ప్రపంచ దేశాలతో పంచుకుంది.
ఏయే దేశాలు..
నేపాల్ లో సంభవించిన వరద ప్రళయానికి ప్రపంచ దేశాలు విస్మయంవ్యక్తం చేశాయి. వీటిలో అగ్రరాజ్యం అమెరికా, బ్రిటన్, గల్ఫ్ కంట్రీస్, కెనడా, భారత్, చైనా కూడా ఉన్నాయి. ఆయా దేశాలు.. తమ విపత్తు సహాయక సిబ్బందిని, ఆర్మీని కూడా పంపుతామని నేపాల్‌కు చెప్పాయి. తద్వారా ఆపదలో చిక్కుకున్నవారిని త్వరగా రక్షించేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నాయి. కానీ, ఫిజికల్ హెల్ప్ వద్దని నేపాల్ స్పష్టం చేసింది. గతంలో 2009లో సంభవించిన భూకంపం సమయంలో ఇలానే ఫిజికల్ సాయానికి వచ్చిన వారు.. చిందరవందర చేశారన్నది నేపాల్ వాదన. ఈ నేపథ్యంలోనే వద్దనిపేర్కొంది.
భారత్.. సాయం ఇలా..
నేపాల్‌ను ఆదుకునేందుకు భారత్ తొలి రోజు నుంచిముందుకు వచ్చింది. ఇప్పటి వరకు 3 ప్రత్యేక సైనిక విమానాల ద్వారా 50 టన్నుల ప్రాణాధార ఔషధాలను పంపించింది. అలానే.. మరికొన్ని టన్నుల ఆహారాన్ని, బిస్కట్లు, తాగునీరు, డ్రింకులు ఇలా.. ఇతర తినుబండారాలను కూడా భారత్ పంపించింది. ఈ సాయం కొనసాగుతుందని భారత విదేశాంగ శాఖ తెలిపింది. ఇదిలావుంటే.. భారత్‌కు చెందిన 238 మంది ఆచూకీ తెలియాల్సి ఉందని తాజాగా ప్రభుత్వం ప్రకటించింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates