Trends

విద్యార్థినులతో కలిసి జలకాలాట… ప్రిన్సిపాల్ సస్పెండ్

బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన ఒక ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ అభ్యంతరకరంగా వ్యవహరించడం విమర్శలకు తావిచ్చింది. రాజస్థాన్ లోని ఒక ప్రిన్సిపాల్ విద్యార్థినులతో కలిసి దుస్తులు లేకుండా ఈతకు దిగడమే కాకుండా ప్రమాదకరమైన ప్రాంతంలో విద్యార్థినులను డ్యామ్ లోకి దించడం చర్చనీయాంశంగా మారింది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో రావడంతో నేటిజన్లు మండి పడుతున్నారు. దీంతో అయ్యగారి చేతికి సస్పెండ్ ఆర్డర్ ఇచ్చి ఇంటికి పంపించారు.

ఈ ఘటన రాజస్థాన్ లోని ఆల్వార్ జిల్లాలో జరిగింది. ఆగస్టు 15 స్వాతంత్ర్య వేడుకలు ముగిసిన తర్వాత థానాగాజీ ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ లాల్ చంద్ మీనా విద్యార్థులను పిక్నీక్కు తీసుకొని వెళ్లారు. 9 నుంచి ఇంటర్మీడియట్ చదువుతున్న బాలికలతో సహా సుమారు 200 మందితో వెళ్లిన ఆయన దట్టమైన అడవిమార్గం గుండా 2కిలోమీటర్ల దూరంలో వున్న భరాజ్ డ్యామ్ వద్దకు పిలుచుకొని వెళ్లారు.

11అడుగుల లోతు వున్న ఈ డ్యామ్ లో గతంలో అనేక ప్రమాదాలు జరిగి వున్నాయి. దాంతో ప్రభుత్వం ఇక్కడ ఈతకు నిషేధం విధించింది. ఇవేవి పట్టించుకోకుండా ఈత నేర్పించే నెపంతో కొంతమంది అమ్మాయిలను డ్యామ్ లోకి దించారు. ఆయన కూడా దుస్తులు తీసేసి ఈతకు దిగారు. విద్యార్థినులతో జలకాలాడుతూ వారితో అసభ్యంగా ప్రవర్తించారు. ఒక విద్యార్థినిని చనువుగా ఎత్తుకున్నారు.

ఈ దృశ్యాలను అక్కడకు వచ్చిన విద్యార్థులు కొందరు సెల్ ఫోన్ లో వీడియో తీశారు. అదికాస్త సోషల్ మీడియాకు ఎక్కింది. విద్యార్థినులతో జలకాడిన ప్రిన్సిపాల్ వీడియో రాజస్థాన్ లో తెగ వైరల్ అయ్యింది. ఈ విషయం తల్లిదండ్రుల వద్దకు చేరడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. విద్యా శాఖ అధికారులకు ఫిర్యాదులు వచ్చాయి.

ఈ మొత్తం వ్యవహారంలో ఆలస్యంగా మేల్కొన్న విద్యా శాఖ అధికారులు ప్రిన్సిపాల్ లాల్ చంద్ మీనా ను వెంటనే సస్పెండ్ చేశారు. రాజస్థాన్ సివిల్ సర్వీస్ రూల్స్ 1958 కింద ప్రిన్సిపాల్ పై విచారణకు ఆదేశించారు. ఇందుకు ముగ్గురు సభ్యులతో కమిటీ వేశారు. దొంగలు పడిన ఆరునెలలకు అన్నట్లు 15 వ తేదిన పిక్నీక్ జరిగితే 22వ తేదీన సస్పెండ్ చేశారని ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు విమర్శిస్తున్నాయి. ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగి వుంటే పరిస్థితి ఏమిటని విద్యార్థి సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. సంచలనం సృష్టించిన ఈ ఘటనలో విద్యా శాఖ స్పందించిన తీరు బాగాలేదని విమర్శలు వినిపిస్తున్నాయి.

This post was last modified on August 24, 2026 3:16 pm

Share

Recent Posts

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

36 minutes ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

44 minutes ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

59 minutes ago

సిగ్మా తీర్చాల్సిన బాకీ ఇద్దరిదే

దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…

1 hour ago

అభయం ఇస్తున్న సాయి అభ్యంక్కర్

దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…

3 hours ago

రాహుల్ ముందే పసిగడుతున్నారా?

కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ వస్తుంటాయి. గతంలో అయితే ఆయనను పప్పు అంటూ…

3 hours ago