Political News

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల తొలగింపునకు మోదీ, జ్ఞానేశ్ కుమార్ కుట్ర పన్నారని ఆయన చేసిన ఆరోపణలు షాకింగ్ గా మారాయి. అంతేకాదు, 1928లో సైమన్ గో బ్యాక్ ఉద్యమం తరహాలో…ఎస్ఐఆర్ ప్రక్రియకు వ్యతిరేకంగా సర్ గో బ్యాక్ ఉద్యమం 2028లో రాబోతోందని జోస్యం చెప్పారు. ఈ క్రమంలోనే తాజాగా సర్ పై మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్ వివాదాస్పద కామెంట్స్ చేశారు.

ఓట్ల తొలగింపు విషయంలో ఎన్నికల కమిషన్ తన వైఖరి మార్చుకోవాలని దానం వార్నింగ్ ఇచ్చారు. అలా చేయకుంటే ఎన్నికల కమిషన్ కార్యాలయంతో పాటు హైదరాబాద్ నగరం తగలబడి పోతుందని ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఇక, ఎన్నికల కమిషన్ అధికారులు బీజేపీతో కలిసి పని చేస్తున్నారని కూడా ఆయన సంచలన ఆరోపణలు చేశారు. హిమాయత్ నగర్ డివిజన్‌లోనే 20 వేల ఓట్లు తొలగించారని దానం ఆరోపించారు.

ఢిల్లీ కేంద్రంగా బీజేపీ నాయకులు ఓట్ చోరీకి పాల్పడుతున్నారని అన్నారు. తన నియోజకవర్గంలో ప్రతి ఒక్కరి ఓటును కాపాడుకునే బాధ్యత తనపై ఉందని స్పష్టం చేశారు. ఎన్నికల కమిషన్ తక్షణమే తొలగించిన ఓట్లను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. లేదంటే తమ పోరాటాలు ఉధృతంగా ఉంటాయని హెచ్చరించారు.

మరోవైపు, దానంపై వేటు పడిన నేపథ్యంలో ఖైరతాబాద్ ఉప ఎన్నికకు నేడో రేపో నోటిఫికేషన్ వెలువడుతుందని అంతా భావిస్తున్నారు. ఈ సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక వ్యాఖ్యలు చేసింది. దానం నాగేందర్ అనర్హతపై దాఖలైన పిటిషన్‌ కోర్టులో పెండింగ్ లో ఉందని, దానిపై తుది నిర్ణయం వచ్చే వరకు ఖైరతాబాద్‌ ఉపఎన్నిక నోటిఫికేషన్‌ జారీ చేయబోమని తెలంగాణ హైకోర్టుకు కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.

2024లో దానంపై కాంగ్రెస్ నేత పి. విజయారెడ్డి దాఖలు చేసిన ఎన్నికల పిటిషన్‌ విచారణలో ఉంది. 2024 ఎన్నికల్లో దానం తన అఫిడవిట్‌లో పూర్తి వివరాలు ఇవ్వలేదని విజయారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ పై విచారణ ముగిసే వరకు ఉపఎన్నిక నోటిఫికేషన్ ఇవ్వకుండా ఆదేశాలు ఇవ్వాలని ఆమె కోర్టును కోరారు. ఈ క్రమంలోనే ఈసీ తన వైఖరిని వెల్లడించింది.

This post was last modified on October 1, 2026 10:42 pm

Share

Recent Posts

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

16 minutes ago

సిగ్మా తీర్చాల్సిన బాకీ ఇద్దరిదే

దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…

18 minutes ago

అభయం ఇస్తున్న సాయి అభ్యంక్కర్

దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…

2 hours ago

రాహుల్ ముందే పసిగడుతున్నారా?

కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ వస్తుంటాయి. గతంలో అయితే ఆయనను పప్పు అంటూ…

3 hours ago

మోహన్ బాబును మోసం చేసిన ఓదెల

తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుడైన మోహన్ బాబును గత 20 ఏళ్లలో మన ఇండస్ట్రీ సరిగా ఉపయోగించుకోలేదనే…

4 hours ago

‘హోటళ్ళు నా భార్యా బిడ్డల కోసం’

సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ ల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. కేటీఆర్ కు లగ్జరీ…

5 hours ago