దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు జేసన్ సంజయ్ దర్శకత్వం వహించిన తొలి మూవీగా తమిళంలో చెప్పుకోదగ్గ బజ్ ఉండగా, సందీప్ కిషన్ హీరో కావడంతో తెలుగులోనూ మంచి రిలీజ్ దక్కుతోంది. మైత్రి పంపిణి బాధ్యతల వల్ల థియేటర్లు బాగానే దక్కించుకున్న నేపథ్యంలో రేపు టాక్ ఎలా ఉంటుందనే ఉత్సుకత అధిక శాతం వర్గాల్లో ఉంది. ముఖ్యంగా కోలీవుడ్ లో.
హీరోగా ఎంట్రీ ఇస్తే కోట్లకు కోట్లు ఆదాయం వచ్చే రెడ్ కార్పెట్ వేసేందుకు నిర్మాతలు సిద్ధంగా ఉన్నా జేసన్ సంజయ్ ఎంచుకున్న రూటు ఖచ్చితంగా ఆశ్చర్యపరిచేదే. ఎందుకంటే డైరెక్షన్ చాలా సవాళ్లతో కూడుకున్నది. స్వయానా తండ్రే ఎప్పుడూ ఆ రిస్క్ తీసుకోలేదు. నటనకు పరిమితమయ్యాడు తప్పించి మెగా ఫోన్ పట్టుకోవాలనే ఆలోచన చేయలేదు. అలాంటిది జేసన్ ఇలా ముందడుగు వేయడం సూర్య, కార్తీ లాంటి స్టార్ హీరోలను సైతం మద్దతు ఇచ్చేలా చేసింది.
సిగ్మాకు సంబంధించి మెచ్చుకోవాల్సిన విషయం మరొకటి ఉంది. జేసన్ సంజయ్ ఏదో ఆషామాషీ ప్రేమకథనో ఈ మధ్య తమిళంలో బాగా వర్కౌట్ అవుతున్న కులాల అణిచివేతనో ఎంచుకోలేదు. స్క్రీన్ ప్లే ఛాలెంజింగ్ గా ఉండే మనీ హీస్ట్ (దొంగతనాలు) బ్యాక్ డ్రాప్ రాసుకున్నాడు. రాజు సుందరం లాంటి సీనియర్లను పట్టుకొచ్చి యాక్టింగ్ చేయించాడు. గ్లామర్ హీరోయిన్స్ కాదని ఫరియా అబ్దుల్లాకు ఓటు వేశాడు. ఇలా చాలా క్యాలికులేషన్లతో బరిలో దిగుతున్నాడు.
ఏపీ తెలంగాణ కలిపి 400 పైగా స్క్రీన్లలో సిగ్మా రిలీజవుతుండటం విశేషం. తమన్ మ్యూజిక్ గురించి యూనిట్ నుంచి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ అందుతోంది. సిగ్మా కనక సక్సెస్ అయితే ఇటు సందీప్ కిషన్, అటు జేసన్ సంజయ్ ఇద్దరికీ జాక్ పాట్ తగిలినట్టే. కాంపిటీషన్ ఎక్కువగా ఉండటం వల్ల ప్రేక్షకులకు రేపు ఆప్షన్లు విపరీతంగా ఉన్నాయి. డోంట్ ట్రబుల్ ది ట్రబుల్, తెల్లకాగితం లాంటి వాటిని దాటేయాలంటే సిగ్మాలో రెగ్యులర్ గా అనిపించని కంటెంట్ ఎంగేజింగ్ గా ఉంటే చాలు. మిగిలింది జనాలు చూసుకుంటారు.
This post was last modified on October 1, 2026 10:26 pm
2027 సంక్రాంతికి ఏ చిరంజీవి సినిమా విడుదలవుతుందనే దాని మీద మళ్ళీ కన్ఫ్యూజన్ మొదలయ్యిందని మెగా కాంపౌండ్ టాక్. జనవరి…
రాష్ట్రంలో ఫేక్ రాయుళ్ళు బరితెగిస్తున్నారు. ప్రభుత్వం మీద తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజల్లో గందరగోళం సృష్టించే కుట్రలకు పాల్పడుతున్నారు. కూటమి…
క్రికెట్లో బ్యాటుకు బంతి తగిలిందో లేదో తెలుసుకోవడానికి థర్డ్ అంపైర్లు టెక్నాలజీ సాయం తీసుకుంటారు. ముఖ్యంగా వికెట్ కీపర్ క్యాచ్…
కూటమిలో కుంపటి పెట్టేందుకు వైసీపీ నేతలు ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోరు. టీడీపీ, జనసేనల మధ్య చిన్న నిప్పు రవ్వ…
టాలీవుడ్ దర్శకులు ఈ మధ్య ఎదురుకుంటున్న సమస్య లేడీ క్యారెక్టర్ ఆర్టిస్టులను వెతికి పట్టుకోవడం. నిన్న జరిగిన దొంగ నా…
సరిగ్గా నాలుగు వారాలకు ప్యారడైజ్ మూవీ ఓటిటిలో వచ్చేసింది. న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్…