Trends

విద్యార్థుల పాలిట శాపంగా మారిన గోడలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో విద్యార్థి మృతి చెందాడు. నిన్న వైజాగ్ ప్రైవేటు స్కూల్లో టీచర్ కొట్టిన దెబ్బలకు యూకేజీ విద్యార్థి మృతి చెందగా ఇవాళ అనంతపురం జిల్లాలో హాస్టల్ గోడ కూలి 8 వ తరగతి విద్యార్థి మృతి చెందాడు. వరస ఘటనలతో విద్యార్థుల తలిదండ్రులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. చదువుకొని తమను ఉద్దరిస్తారని ఎన్నో ఆశలు పెట్టుకున్న తలిదండ్రులు కడుపుకొతతో కన్నీరుమున్నీరవుతున్నారు.

అనంతపురం జిల్లా కళ్యాణ దుర్గం నియోజకవర్గంలోని శెట్టూరు ప్రభుత్వ ఎస్సీ హాస్టల్ లో ఆదివారం ఉదయం హాస్టల్ గోడ కూలి 8 వ తరగతి చదువుతున్న హర్ష వర్ధన్ అనే 12 ఏళ్ళ విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మృతి గురించి రెండు రకాల కథనాలు ప్రచారంలో వున్నాయి.

ఆదివారం సెలవు రోజు కావడంతో స్నేహితుడు అక్షయ్ తో కలిసి హర్ష వర్ధన్ గ్రౌండ్లో ఆడుకుంటున్నాడు. ఉన్నట్టుండి ఒక్కసారిగా ప్రహరి గోడ కూలిపోయింది. శిధిలాలకింద చిక్కుకొన్న హర్ష వర్ధన్ క్షణాల్లోనే ఊపిరి వదిలాడు. అక్షయ్ కు తీవ్రంగా గాయలయ్యాయి. కల్యాణ దుర్గంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అతడి అత్యవసర వైద్య చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అక్షయ్ పరిస్థితి విషమంగా వున్నట్లు తెలుస్తుంది.

ఇదిలావుండగా మరో ప్రచారం కూడా వినిపిస్తుంది. హర్ష వర్ధన్, అక్షయ్ ఇద్దరూ కలిసి బహిర్భూమికి వెళ్లారు. అప్పటికే శిధిలావస్థకు చేరుకొని వున్న పాత గోడ ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ఘటనలో హర్ష వర్ధన్ చనిపోయాడు. అక్షయ్ గాయాల పాలై ఆసుపత్రికి చేరాడు.

అధికారుల నిర్లక్ష్యం వల్లే ఒక విద్యార్థి ప్రాణాలు గాలిలో కలిసి పోయాయని విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ గోడ చాలా రోజులుగా శిధిలావస్థకు చేరుకొని వుంది. దీన్ని మరమ్మత్తులు చేయించాల్సిందిగా విద్యార్థి సంఘాలు కోరుతున్నా అధికారులు పట్టించుకోలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఈ హాస్టల్ లో 3 నుంచి 10 వ తరగతి చదుకుంటున్న నిరుపేద దళిత విద్యార్థులు వున్నారు. ఆర్ధిక స్థోమత లేకపోవడంతో తల్లీదండ్రులు హాస్టల్లో ఉంచి చదివిస్తున్నారు. చేజేతులా బిడ్డను పోగొట్టుకున్నానంటూ హర్ష వర్ధన్ రోదిస్తున్న తల్లిని ఓదార్చడం ఎవరి తరం కావట్లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనతో భయపడి పోయిన విద్యార్థుల తల్లీదండ్రులు హాస్టల్ కు చేరుకొని పిల్లలను ఇంటికి తీసుకెళ్లడం కనిపించింది.

This post was last modified on August 24, 2026 6:36 am

Share

Recent Posts

యువతుల పిచ్చి… ఫోటోకి లక్ష రూపాయలా?

చైనాలో సోషల్ మీడియా ట్రెండ్‌లు, ఫొటోషూట్‌ల సంస్కృతిలో కొత్త మార్పు కనిపిస్తోంది. ప్రస్తుతం కొందరు యువతులు మేల్ మోడల్స్‌తో ప్రత్యేకంగా…

8 minutes ago

13 కోట్ల ఓట్లు ఎవరి అనుమతితో తొలగించారు?

కాక్రోచ్ పార్టీ మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. నీట్ పేపర్ లికేజి వ్యవహారంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర చేపట్టిన…

2 hours ago

ట్రబుల్ తట్టుకుని నిలబడుతుందా

రాజమౌళి ఫ్యామిలీ మొత్తం ప్రమోషన్లు చేసింది. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా పొడవైన ట్వీట్ రివ్యూలతో సినిమాను మెచ్చుకున్నారు.…

3 hours ago

గరివిడి లక్ష్మి చేస్తోంది పెద్ద సాహసమే

దసరా పండక్కు భారీ పోటీ నెలకొనడం చూస్తున్నాం. సంక్రాంతి రేంజులో మూడు పెద్ద సినిమాలు క్యూ కట్టడం బయ్యర్ వర్గాల్లో…

3 hours ago

అద్భుత ప్రయోగాల నిలయం ‘సింగీతం’

లెజండరీ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూయడం యావత్ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. 94 వయసులో కూడా సినిమా తీయడానికి…

4 hours ago

ఒక్క పిల్ల‌ర్‌పైనే వైసీపీ భారం… !

వైసీపీ... ఇప్పుడు ఏపీ రాజ‌కీయాల్లో ప్ర‌ధానంగా చ‌ర్చ‌కు వ‌స్తున్న పార్టీ. ఈ పార్టీ ప్ర‌భావం నానాటికి త‌గ్గిపోతోంద‌న్న వాద‌న ఒక‌వైపు…

6 hours ago