Movie News

నిర్మాత గాయాలకు ‘టాక్సిక్’ మందు అవుతుందా

నిర్మాత దిల్ రాజు అన్నట్టు వందల సినిమాలు తీయకపోయినా కెవిఎన్ ప్రొడక్షన్స్ అనేది ఇప్పుడు అన్ని బాషల ఇండస్ట్రీలో హాట్ బ్యానర్ గా పేరు తెచ్చేసుకుంది. కారణం సింపుల్. స్టార్ హీరోలతో సెట్ చేసుకుంటున్న ప్రాజెక్టులు, వాటి మీద పెడుతున్న బడ్జెట్లు. కోలీవుడ్ సిఎం చివరి సినిమా కోసం అగ్ర నిర్మాతలు పోటీ పడితే వాళ్లందరికీ దక్కని అవకాశం నిర్మాత వెంకట నారాయణకు చిక్కింది. సెన్సార్ అష్టకష్టాల మధ్య విడుదలై ఫ్లాపయ్యింది కానీ కొన్ని రికార్డులు అందుకుంది.

అయితే కెవిఎన్ కు ఫ్లాపుల ప్రవాహం కేవలం జన నాయకుడుతో జరగలేదు. అంతకు ముందు ధృవ్ సర్జ, సంజయ్ దత్, శిల్పా శెట్టి కాంబోలో తీసిన ‘కెడి ది డెవిల్’ దారుణంగా పోయింది. తెలుగులో డబ్బింగ్ జరిగిన విషయమే ఎవరికీ తెలియలేదు. కెవిఎన్ నిర్మాణ భాగస్వామ్యం తీసుకున్న మలయాళం మూవీ ‘బాలన్ ది బాయ్’ కమర్షియల్ ఫెయిల్యూర్ గా నిలిచింది. కెవిఎన్ తొలి కన్నడ చిత్రం ‘సకత్’ ఒకటే డీసెంట్ గా అడగా తర్వాత వచ్చిన మరో రెండు జస్ట్ ఓకే అనిపించుకున్నాయి.

ఇప్పుడీ ప్రొడక్షన్ హౌస్ కి భారీ బ్రేక్ దక్కాలి. టాక్సిక్ ఇంకో మూడు రోజుల్లో రానుంది. దీనికి సైతం చాలా ఇబ్బందులు పడ్డారు. ఏళ్లకేళ్లు నిర్మాణం జరిగింది. బెంగళూరు దగ్గర అడవుల్లో షూటింగ్ చేసినప్పుడు పర్వావరణ శాఖ నుంచి పోలీస్ కేసులు ఎదురుకోవాల్సి వచ్చింది. విడుదల తేదీలు రెండు మూడు మారాయి. రీ షూట్లు కొన్ని జరిగాయి. ఆర్టిస్టుల రెమ్యునరేషన్లకు కోట్లకు కోట్లు ఖర్చు పెట్టారు. ఇన్ని తట్టుకుని ఫైనల్ గా ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు టాక్సిక్ వస్తోంది.

బజ్ ప్రకారం చూసుకుంటే యునానిమస్ టాక్ వస్తే కెవిఎన్ మీద కనకవర్షం కురవడం ఖాయం. అంటే కెజిఎఫ్ కు ఏ మాత్రం తగ్గకుండా ఇంకా చెప్పాలంటే దురంధర్, పుష్ప స్థాయిలో రిపోర్ట్స్ వస్తే మటుకు వసూళ్ల సునామి రేపడం ఖాయం. అదే జరిగితే కెవిఎన్ హిట్ ట్రాక్ మొదలైపోతుంది. దీని తర్వాత ఈ సంస్థ మొదటి టాలీవుడ్ స్ట్రెయిట్ మూవీ కాకా జనవరిలో రిలీజ్ అవుతుంది. చిరంజీవి హీరోగా ఇది కూడా పెద్ద బడ్జెట్ తోనే తీస్తున్నారు. మరి టాక్సిక్ దానికి పునాది వేస్తుందో లేదో చూడాలి.  

This post was last modified on August 23, 2026 10:20 pm

Share

Recent Posts

మహాకాల్… ఊహించని కాంబినేషన్

ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…

41 minutes ago

సునీల్ యాద‌వ్ ఎవ‌రు…?

వైసీపీ అధినేత జ‌గ‌న్ చిన్నాన్న వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య‌కు సంబంధించి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తున్న సునీల్ యాద‌వ్ వ్య‌వ‌హారం…

53 minutes ago

టీడీపీకి 58 కోట్లు.. వైసీపీకి 24 కోట్లు.. బీఆర్ ఎస్‌కు 16 కోట్లు..

భారత ఎన్నికల సంఘానికి సమర్పించిన విరాళాల నివేదికల ప్రకారం, 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాజకీయ పార్టీలు తమకు అందిన…

2 hours ago

కార్తీ రేంజు ఇంత పడిపోయిందా

యుగానికి ఒక్కడు, నా పేరు శివ, ఖైదీ, ఊపిరి లాంటి సూపర్ హిట్స్ తో కార్తీకి తెలుగులోనూ సాలిడ్ మార్కెట్…

4 hours ago

జడల్ జమానాకు ఇంకో కీలక ఛాన్స్

నైజాంలో డీసెంట్ గా నెట్టుకొస్తున్న ప్యారడైజ్ రెండో వారంలోకి అడుగు పెట్టడానికి ముందే ఆంధ్ర, సీడెడ్ సైడ్ బాగా నెమ్మదించిపోవడం…

4 hours ago

ఖైరతాబాద్ నుంచి జనసేన పోటీ

ఏ నిముషంలో దానం నాగేందర్ పార్టీ మారి ఎమ్మెల్యే పదవి కోల్పోయాడో కానీ తెలంగాణా రాజకీయాలు మరింత సందడిగా మారిపోయాయి.…

5 hours ago