Political News

పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎంపై హత్యాయత్నం… పొత్తే కారణమా?

పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎం, శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ) అధినేత సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై హత్యాయత్న ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. నాందేడ్ లోని గురుద్వారాలో సుఖ్ బీర్ సింగ్ పై కత్తితో దాడి చేసిన వైనం షాకింగ్ గా మారింది. ఈ దాడిలో సుఖ్ బీర్ సింగ్ కుడి చేతికి గాయమైంది. ఆయనతోపాటు భద్రతా సిబ్బందిలో ఒకరికి గాయాలయ్యాయి. సుఖ్ బీర్ ను హుటాహుటీన ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఒక నిహంగ్ సిక్కు ఈ దాడి చేశాడని, అతడిని అదుపులోకి తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది.

తన భార్య, అకాలీదళ్ ఎంపీ హర్‌సిమ్రత్ కౌర్ బాదల్, కుటుంబ సభ్యులతో కలిసి నాందేడ్‌లోని ప్రసిద్ధ ‘తఖ్త్ శ్రీ హజూర్ సాహిబ్’ గురుద్వారాను సుఖ్ బీర్ సందర్శించారు. దర్శనం అనంతరం ఈ దాడి జరిగింది. త్వరలో జరగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్ఏడీ, బీజేపీల మధ్య పొత్తు పొడవబోతోందన్న ప్రచారం నేపథ్యంలో ఈ దాడి జరగడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ప్రధాని మోడీతో సుఖ్ బీర్ కొద్ది రోజుల క్రితం భేటీ, డీలిమిటేషన్ ప్రక్రియకు బాదల్ మద్దతు ప్రకటించిన నేపథ్యంలో ఈ దాడి జరగడంతో ఆ ప్రచారానికి బలం చేకూరుతోంది. గతంలో ఎన్డీయే కూటమిలో భాగస్వామి అయిన ఎస్ఏడీ…సాగు చట్టాల వివాదం వల్ల కూటమి నుంచి బయటకు వచ్చింది.

బాదల్ పై దాడి జరగడం ఇది రెండోసారి. 2024లో అమృత్ సర్ లోని స్వర్ణ దేవాలయం దగ్గర బాదల్ పై ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. గురి తప్పి బుల్లెట్ పక్కకు వెళ్లడంతో ఆ ఘటన నుంచి ఆయన తృటిలో తప్పించుకున్నారు. పంజాబ్ మాజీ సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్ తనయుడైన సుఖ్ బీర్ 2009-17 కాలంలో వరుసగా రెండుసార్లు పంజాబ్ డిప్యూటీ సీఎంగా పనిచేశారు.

This post was last modified on August 13, 2026 6:08 pm

Share

Recent Posts

బీఆర్ఎస్‌కు క‌ష్ట కాల‌మా… న‌ష్ట కాల‌మా?!

దానం నాగేంద‌ర్‌పై వేటు ప‌డ‌డం.. ఖైర‌తాబాద్ ఉప ఎన్నిక ఖాయం కావ‌డం.. ఇటీవ‌ల కాలంలో బీఆర్ ఎస్ పార్టీ చేసిన…

36 minutes ago

నాని న‌న్ను భ‌రించాల్సిందే… వేరే దారి లేదు – ఓదెల‌

శ్రీకాంత్ ఓదెల‌.. ఈ పేరు చెప్ప‌గానే అంద‌రికీ హీరో నాని గుర్తుకొస్తాడు. ఈ సుకుమార్ శిష్యుడి మీద నానికి ఎంత…

3 hours ago

నానిని వీళ్లు పట్టుకున్నారు… వాళ్లు వదిలేశారు

నేచురల్ స్టార్ నానికి కొన్నేళ్ల ముందు వరకు బాయ్ నెక్స్ట్ డోర్ ఇమేజే ఉండేది. అతను సాధారణ కుర్రాడి పాత్రలే…

3 hours ago

ప్యారడైజ్ మీటింగులో పదనిసలు

నాని కెరీర్ లో మొదటిసారిగా తన సినిమా గురించి సోషల్ మీడియాలో చాలా విస్తృతంగా డిస్కషన్ జరగడం అందరినీ ఆశ్చర్య…

5 hours ago

ట్రబుల్ బృందానికి టైమ్ కలిసి వస్తోంది

వచ్చే వారం అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా వచ్చే సెలవు రోజుకి, చెప్పుకోదగ్గ సినిమాలే పోటీకి రెడీ అవుతున్నాయి.…

6 hours ago

రామాయణ అలసత్వం వల్ల ఎవరికి లాభం

సెప్టెంబర్ అయిపోతోంది. ఇండియాస్ బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీగా ప్రచారం చేసుకున్న రామాయణ పార్ట్ 1 విడుదలకు కేవలం నలభై రోజులు…

7 hours ago