Movie News

నానిని వీళ్లు పట్టుకున్నారు… వాళ్లు వదిలేశారు

నేచురల్ స్టార్ నానికి కొన్నేళ్ల ముందు వరకు బాయ్ నెక్స్ట్ డోర్ ఇమేజే ఉండేది. అతను సాధారణ కుర్రాడి పాత్రలే చేసేవాడు. ప్రేమకథలతో పాటు కామెడీ ఎంటర్టైనర్లలో కూడా బాగా ఒదిగిపోయేవాడు. అందుకే యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. తన సినిమాలను థియేటర్లలోనే కాదు.. ఓటీటీలో కూడా పెద్ద ఎత్తున చూస్తారు. ఇతర భాషల్లోనూ తనకు ఫాలోయింగ్ వచ్చింది.

ఐతే ఒక ఇమేజ్ ఛట్రంలో ఇరుక్కుపోవడం ఇష్టం లేని నాని.. కొన్నేళ్ల నుంచి మాస్ మంత్రం పఠిస్తున్నాడు. ఎంసీఏ, దసరా, సరిపోదా శనివారం, హిట్-3 లాంటి చిత్రాల్లో నటించాడు. సినిమా సినిమాకూ మాస్ కంటెంట్ పెరిగిపోయింది. నాని మరీ వయొలెంట్ పాత్రలు చేయడం చూసి జనం షాకైపోయారు. అయినా తన సినిమాలను ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చూస్తూనే వచ్చారు. కానీ ‘ది ప్యారడైజ్’ విషయంలో భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది.

ఈ సినిమాతో అతను యూత్, మాస్‌ను ఎక్కువ ఎట్రాక్ట్ చేస్తున్నారు. పెద్ద హీరోల లెవెల్లో వారిని థియేటర్లకు తీసుకురాగలిగాడు నాని. ముందు రోజు ప్రిమియర్లకు వచ్చిన రెస్పాన్స్ చూస్తే.. నానికి యూత్‌లో క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థమైంది. కానీ ఈ క్రమంలో నాని ఫ్యామిలీ ఆడియన్స్‌కు దూరమైపోతున్నాడా అనే సందేహాలు కలుగుతున్నాయి. ఈ చిత్రాన్ని ఆ వర్గం ప్రేక్షకులు పూర్తిగా పక్కన పెట్టేసినట్లే కనిపిస్తోంది.

అసలే ది ప్యారడైజ్ మూవీకి ఏ రేటింగ్ వచ్చింది. పైగా ప్రోమోలు చూస్తే చాలా వయోలెంట్ గా అనిపించాయి. టాక్ కూడా బ్యాడ్ గా ఉంది. పైగా ఇందులో హింసాత్మక సన్నివేశాల గురించి పెద్ద జరుగుతోంది. మోస్ట్ వయోలెంట్ మూవీగా పేరు తెచ్చుకున్న మార్కో సినిమాకు ఏమాత్రం తీసిపోని విధంగా ఇందులో సీన్లు ఉన్నాయనే చర్చతో ఫ్యామిలీ ఆడియన్స్ ప్యారడైజ్ మూవీకి వెళ్లడానికి భయపడుతున్నారు.

హిట్ 3 విషయంలోనూ ఇలాగే ఆ వర్గం ప్రేక్షకులు వెనుకంజ వేశారు. ఇప్పుడు ప్యారడైజ్ మూవీతో కుటుంబ ప్రేక్షకుల్లో నాని ఒకరకమైన వ్యతిరేకత తెచ్చుకున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. వెంటనే హాయ్ నాన్న లాంటి హృద్యమైన సినిమా ఒకటి చేసి తన కోర్ ఫాన్సుని నాని వెనక్కి తెచ్చుకోవడానికి ప్రయత్నించాల్సిన అవసరం కనిపిస్తోంది.

This post was last modified on September 26, 2026 11:36 am

Share

Recent Posts

ప్యారడైజ్ మీటింగులో పదనిసలు

నాని కెరీర్ లో మొదటిసారిగా తన సినిమా గురించి సోషల్ మీడియాలో చాలా విస్తృతంగా డిస్కషన్ జరగడం అందరినీ ఆశ్చర్య…

2 hours ago

ట్రబుల్ బృందానికి టైమ్ కలిసి వస్తోంది

వచ్చే వారం అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా వచ్చే సెలవు రోజుకి, చెప్పుకోదగ్గ సినిమాలే పోటీకి రెడీ అవుతున్నాయి.…

3 hours ago

రామాయణ అలసత్వం వల్ల ఎవరికి లాభం

సెప్టెంబర్ అయిపోతోంది. ఇండియాస్ బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీగా ప్రచారం చేసుకున్న రామాయణ పార్ట్ 1 విడుదలకు కేవలం నలభై రోజులు…

4 hours ago

వివాదాల డోరతి… మనోళ్లు ఇస్తారా హారతి

తమిళంలో తాజాగా విడుదలైన డోరతి అక్కడ వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. సమాజంలో ఈ మధ్య కాలంలో బాగా చర్చల్లోకి…

6 hours ago

వివేకా హ‌త్య: 40 కోట్ల రూపాయ‌లు ఎవ‌రివి?!

వైసీపీ అధినేత జ‌గ‌న్ చిన్నాన్న, మాజీ మంత్రి వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య కేసు వ్య‌వ‌హారంలో 40 కోట్ల రూపాయలు కీల‌కంగా…

7 hours ago