Movie News

ప్యారడైజ్ మీటింగులో పదనిసలు

నాని కెరీర్ లో మొదటిసారిగా తన సినిమా గురించి సోషల్ మీడియాలో చాలా విస్తృతంగా డిస్కషన్ జరగడం అందరినీ ఆశ్చర్య పరిచింది. పాజిటివ్ కన్నా నెగటివ్ ఎక్కువగా ఉండటం, దానికి నాని నిన్న సానుకూలంగా స్పందించడం పెద్ద చర్చకు దారి తీశాయి. ఇవాళ ప్రెస్ మీట్ జరిగింది. యూనిట్ సభ్యులు అందరూ హాజరయ్యారు హీరోయిన్ కయదు లోహర్ తప్ప. ముఖ్యంగా మోహన్ బాబు రావడం స్వీట్ సర్ప్రైజ్. ఎందుకంటే ప్యారడైజ్ విషయంలో ఆయన మీడియా ముందుకు రావడం ఇదే మొదటిసారి.

ఎప్పటిలాగే యూనిట్ సభ్యులంతా సినిమాకు పని చేసిన అనుభవాల గురించి, బయట ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన గురించి గొప్పగా చెప్పుకున్నారు. నాని మాట్లాడుతూ కొత్తగా సినిమా తీశామని భావించామని, కానీ రియాక్షన్లు కూడా ఇంత కొత్తగా ఉంటాయని ఊహించలేదని పరోక్షంగా ట్రోల్స్ ని ఉద్దేశించి అన్నాడు. మోహన్ బాబు. ప్రియదర్శి మీద పెద్ద స్థాయిలో ప్రశంసల జల్లులు కురిపించాడు. టాలీవుడ్ ఆడియన్స్ ప్రేమ గురించి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకున్నాడు.

శ్రీకాంత్ ఓదెల మాట్లాడుతూ నానితో గొడవల మీద ఎన్నో టాక్స్ వచ్చాయని మేము కొట్టుకుంటాం తిట్టుకుంటాం, అధరాలు అతుక్కుంటాం, ఇదంతా సినిమా కోసమే అన్న రీతిలో చెప్పడం కొంత వెరైటీగా అనిపించినా అంతర్లీనంగా బయట ప్రచారం పట్ల ఫ్రస్ట్రేషన్ కూడా కనిపించింది. మోహన్ బాబు తన ప్రసంగంలో ఓదెలని నెంబర్ వన్ డైరెక్టర్ అంటూ ఆకాశానికి ఎత్తేసి చిన్న చిన్న చురకలు కూడా వేశారు. ముఖ్యంగా రీటేక్స్ గురించి తనదైన పంచు పడింది.

రేవు ఆదివారం కావడం ప్యారడైజ్ వసూళ్లకు కీలకం కానుంది. బాక్సాఫీస్ దగ్గర వేరే ఆప్షన్ లేకపోవడం ఇలాంటి మాస్ సినిమాకు చాలా ప్లస్ కానుంది. బుక్ మై షో ట్రెండ్స్ బాగున్నాయి. బిసి సెంటర్స్ కౌంటర్ అమ్మకాలు ప్రోత్సాహకంగా ఉన్నాయని ట్రేడ్ టాక్. రేపు ఎంత వస్తుందనే దాన్ని బట్టి రెండు వందల కోట్ల మార్కు సాధ్యమా కాదా అనేది తేలనుంది. పబ్లిసిటీ అంకంలో మరో ఈవెంట్ లేదా మీట్ ప్యారడైజ్ వైపు వెంటనే ఉండకపోవచ్చు. ఏదైనా మైలురాయి అందుకుంటే ప్లాన్ చేస్తారు.

This post was last modified on September 26, 2026 11:33 pm

Share

Recent Posts

నానిని వీళ్లు పట్టుకున్నారు… వాళ్లు వదిలేశారు

నేచురల్ స్టార్ నానికి కొన్నేళ్ల ముందు వరకు బాయ్ నెక్స్ట్ డోర్ ఇమేజే ఉండేది. అతను సాధారణ కుర్రాడి పాత్రలే…

6 minutes ago

ట్రబుల్ బృందానికి టైమ్ కలిసి వస్తోంది

వచ్చే వారం అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా వచ్చే సెలవు రోజుకి, చెప్పుకోదగ్గ సినిమాలే పోటీకి రెడీ అవుతున్నాయి.…

3 hours ago

రామాయణ అలసత్వం వల్ల ఎవరికి లాభం

సెప్టెంబర్ అయిపోతోంది. ఇండియాస్ బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీగా ప్రచారం చేసుకున్న రామాయణ పార్ట్ 1 విడుదలకు కేవలం నలభై రోజులు…

4 hours ago

వివాదాల డోరతి… మనోళ్లు ఇస్తారా హారతి

తమిళంలో తాజాగా విడుదలైన డోరతి అక్కడ వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. సమాజంలో ఈ మధ్య కాలంలో బాగా చర్చల్లోకి…

6 hours ago

వివేకా హ‌త్య: 40 కోట్ల రూపాయ‌లు ఎవ‌రివి?!

వైసీపీ అధినేత జ‌గ‌న్ చిన్నాన్న, మాజీ మంత్రి వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య కేసు వ్య‌వ‌హారంలో 40 కోట్ల రూపాయలు కీల‌కంగా…

7 hours ago