Political News

జగన్ కు జైల్లో అవమానం?

కర్నూలు జైల్లో ఉన్న వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షిని పరామర్శించేందుకు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ కర్నూలులో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే జగన్ ను జైలు అధికారులు ఉద్దేశ్యపూర్వకంగానే అవమానించారని స్వయంగా జగన్ సంచలన ఆరోపణలు చేయడం చర్చనీయాంశమైంది. కేవలం తనను అవమానించేందుకే జైలులో గ్రిల్ ముందు నిలబెట్టి ఫొటో తీశారని జగన్ తీవ్ర ఆరోపణలు చేశారు.

మామూలుగా ఎవరినైనా కూర్చోబెట్టి ఫొటో తీసి పంపిస్తారని, కానీ, ఒక మాజీ ముఖ్యమంత్రి అయిన తనను అవమానించడం కోసం గ్రిల్ బయట నిలబెట్టించి ఫొటో తీశారని ఆరోపించారు. చంద్రబాబు శాడిస్టిక్ మనస్తత్వానికి నిదర్శనమని జగన్ షాకింగ్ ఆరోపణలు చేశారు. తమ హయాంలో పీపుల్ ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్లు తీసుకొస్తే, వీళ్లు అవమానించే కార్యక్రమాన్ని తెచ్చారని మండిపడ్డారు.

అందరికీ ఇలాగే నిలబెట్టి ఫొటోలు తీస్తారా అని తాను సూపరింటెండెంట్ ని అడిగానని, తనను మాత్రమే ఇలా నిలబెట్టి ఫొటో తీయాలని ఆదేశాలు వచ్చాయని ఆయన చెప్పారని జగన్ షాకింగ్ ఆరోపణలు చేశారు. ఎల్లకాలం చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉండదని, ఈ రోజు ఈ ప్రభుత్వం మొదలుబెట్టిన తప్పుడు సంప్రదాయాలు రేప్పొద్దున రెండింతలు రిపీట్ అవుతాయని చంద్రబాబుకు జగన్ వార్నింగ్ ఇచ్చారు. అయితే, జగన్ ఆరోపణలపై పోలీసు అధికారులు, జైలు అధికారులు స్పందించాల్సి ఉంది.

కాగా, రాష్ట్రంలో అధికార దుర్వినియోగం ఏ స్థాయిలో ఉందో చెప్పేందుకు ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్టు ఘటనే నిదర్శనమని జగన్ అన్నారు. ‘రెడ్ బుక్’ రాజ్యాంగాన్ని చంద్రబాబు అమలు చేస్తూ, ప్రతిపక్ష నేతలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఈ రోజు జైల్లో తనను కూడా అవమానించే ప్రయత్నం చేశారని ఆరోపించారు.

This post was last modified on August 13, 2026 7:48 pm

Share

Recent Posts

బీఆర్ఎస్‌కు క‌ష్ట కాల‌మా… న‌ష్ట కాల‌మా?!

దానం నాగేంద‌ర్‌పై వేటు ప‌డ‌డం.. ఖైర‌తాబాద్ ఉప ఎన్నిక ఖాయం కావ‌డం.. ఇటీవ‌ల కాలంలో బీఆర్ ఎస్ పార్టీ చేసిన…

2 hours ago

నాని న‌న్ను భ‌రించాల్సిందే… వేరే దారి లేదు – ఓదెల‌

శ్రీకాంత్ ఓదెల‌.. ఈ పేరు చెప్ప‌గానే అంద‌రికీ హీరో నాని గుర్తుకొస్తాడు. ఈ సుకుమార్ శిష్యుడి మీద నానికి ఎంత…

4 hours ago

నానిని వీళ్లు పట్టుకున్నారు… వాళ్లు వదిలేశారు

నేచురల్ స్టార్ నానికి కొన్నేళ్ల ముందు వరకు బాయ్ నెక్స్ట్ డోర్ ఇమేజే ఉండేది. అతను సాధారణ కుర్రాడి పాత్రలే…

5 hours ago

ప్యారడైజ్ మీటింగులో పదనిసలు

నాని కెరీర్ లో మొదటిసారిగా తన సినిమా గురించి సోషల్ మీడియాలో చాలా విస్తృతంగా డిస్కషన్ జరగడం అందరినీ ఆశ్చర్య…

7 hours ago

ట్రబుల్ బృందానికి టైమ్ కలిసి వస్తోంది

వచ్చే వారం అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా వచ్చే సెలవు రోజుకి, చెప్పుకోదగ్గ సినిమాలే పోటీకి రెడీ అవుతున్నాయి.…

7 hours ago

రామాయణ అలసత్వం వల్ల ఎవరికి లాభం

సెప్టెంబర్ అయిపోతోంది. ఇండియాస్ బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీగా ప్రచారం చేసుకున్న రామాయణ పార్ట్ 1 విడుదలకు కేవలం నలభై రోజులు…

9 hours ago