వచ్చే వారం అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా వచ్చే సెలవు రోజుకి, చెప్పుకోదగ్గ సినిమాలే పోటీకి రెడీ అవుతున్నాయి. వాటిలో మొదటిది డోంట్ ట్రబుల్ ది ట్రబుల్. ఫాహద్ ఫాసిల్ ప్రధాన పాత్రలో చిన్న పిల్లలను టార్గెట్ చేసుకున్న ఈ ఫన్ ఎంటర్ టైనర్ కి రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. బాహుబలి తీసిన ఆర్కా మీడియా ప్రొడక్షన్ కావడంతో ప్రమోషన్లు స్పెషల్ గా ఉన్నాయి. మొన్న సెట్ లో ఉన్న గణపతి లడ్డును జక్కన్నతో ఏకంగా కోటి రూపాయలకు కొనిపించారు.
ప్రీ రిలీజ్ ఈవెంట్ కి జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా రానుండటం చాలా పెద్ద ఆకర్షణ కానుంది. ఎందుకంటే డ్రాగన్ షూటింగ్ లో గాయపడి సర్జరీ జరిగి విశ్రాంతి తీసుకున్న తర్వాత తను అటెండ్ అవుతున్న పబ్లిక్ ఫంక్షన్ ఇదే. రాజమౌళితో ఉన్న అనుబంధం, కార్తికేయ స్నేహం వెరసి తనను నో అనిపించకుండా వచ్చేలా చేస్తున్నాయి. ఫహద్ ఫాసిల్ కి మన దగ్గర సోలో హీరోగా థియేటర్ మార్కెట్ లేదు. దాన్ని డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ సృష్టించాలి. ఆ నమ్మకంతోనే ఉన్నాడు.
ఇక పోటీ విషయానికి వస్తే డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ కు సమానమైన కాంపిటీషన్ అని చెప్పలేం కానీ ఉన్నంతలో పోటీ అయితే బలంగానే ఉంది. వివాదాల మధ్య హాట్ టాపిక్ గా మారిన కీర్తి సురేష్ ‘డోరతీ’ని అదే రోజు తెస్తున్నారు. సందీప్ కిషన్ హీరోగా తమిళనాడు సిఎం విజయ్ కొడుకు జేసన్ సంజయ్ దర్శకత్వంలో రూపొందిన ‘సిగ్మా’ మీద చిరంజీవి వల్ల అటెన్షన్ పెరిగింది. కోర్ట్ ఫేమ్ హార్ష్ రోషన్ మరో టీనేజ్ లవ్ స్టోరీ ‘తెల్ల కాగితం’కు బాగానే ప్రచారాలు చేస్తున్నారు.
ఇవి కాకుండా ‘అనకాపల్లి’తో పాటు మరో రెండు చిన్న సినిమాలున్నాయి. బాలీవుడ్ నుంచి అజయ్ దేవగన్ ‘దృశ్యం 3 ది కంక్లూజన్’ వస్తుంది. మల్టీప్లెక్సుల్లో కొంత ప్రభావం ఉండొచ్చేమో కానీ మిగిలిన చోట్ల టెన్షన్ అక్కర్లేదు. ఒక దొంగ, మాజిక్ తెలిసిన ఒక చిన్న పాప మధ్య స్నేహం ఆధారంగా దర్శకుడు శశాంక్ యేలేటి డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ని రూపొందించారు. చైల్డ్ ఆర్టిస్ట్ సారా పాలేకర్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ఇన్ని సానుకూలంశాలను టీమ్ ఎలా వాడుకుంటుందో చూడాలి.
This post was last modified on September 26, 2026 7:23 pm
సెప్టెంబర్ అయిపోతోంది. ఇండియాస్ బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీగా ప్రచారం చేసుకున్న రామాయణ పార్ట్ 1 విడుదలకు కేవలం నలభై రోజులు…
https://twitter.com/GulteOfficial/status/2103820050603864546
తమిళంలో తాజాగా విడుదలైన డోరతి అక్కడ వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. సమాజంలో ఈ మధ్య కాలంలో బాగా చర్చల్లోకి…
వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వివేకానందరెడ్డి దారుణ హత్య కేసు వ్యవహారంలో 40 కోట్ల రూపాయలు కీలకంగా…
వినాయక చవితిని అత్యంత ఘనంగా జరిపే రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముందు వరుసలో ఉంటాయి. చవితి వచ్చిందంటే పది రోజుల…
రాజకీయ నాయకుల్లో చాలా మందికి సినిమాల మీద పెద్దగా ఆసక్తి ఉండదు. ఆ ఆసక్తి ఉన్న వాళ్లకు కూడా సినిమాలు…