ఒక డాక్టర్ ఇంటి మీద ఏసీబీ దాడులు చేయడమే ఒక సెన్సేషన్ అయితే ఆయన ఇంట్లో కోట్ల రూపాయల కట్టలు బయట పడటం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తుంది. ఏసీబీ దాడుల్లో బయట పడిన ఆస్తులు చూసి అధికారులు సైతం విస్తు పోయారంటే ఏ స్థాయిలో ముడుపులు ముట్టాయో, ఎంత దిగజారి బల్లకింద చేతులు పెట్టాడో అర్ధం చేసుకోవచ్చని ఆసుపత్రి సిబ్బంది చెవులు కొరుక్కుంటున్నారు. ధరణిలోన దేవతలుగా సమాజం గౌరవించే డాక్టర్లు సైతం అవినీతికి పాల్పడటం చర్చనీయాంశంగా మారింది.
హైదరాబాద్ లోని ప్రతిష్టాత్మక నిమ్స్ వైద్యశాల అడిషనల్ మెడికల్ సూపరెండెంట్ డాక్టర్ నోరి లక్ష్మి భాస్కర్ ఇరవై
ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్నారు. నిమ్స్ ఆసుపత్రిలో ఆమధ్య 90 మంది స్కిల్డ్, అన్ స్కిల్డ్ కార్మికుల నియామకాలు జరిగాయి. ప్రతి ఒక్క పోస్టుకు ఒక రేటు నిర్ణయించి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు ఆయన మీద ఆరోపణలు వచ్చాయి. డాక్టర్ అవినీతి మీద కథలు కథలుగా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఆదాయానికి మించి ఆస్తులను కూడబెట్టారని ఆయన మీద ఫిర్యాదులు వచ్చాయి.
డాక్టర్ నోరి లక్ష్మి భాస్కర్ అవినీతి పై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసినా స్పందించలేదు. దాంతో తెలంగాణా అవినీతి నిరోధక శాఖకు ఫిర్యాదు చేశారు. ఏసీబీ ఆయన మీద కన్నేసింది. పక్కా సమాచారంతో దాడి చేసింది. ఏక కాలంలో డాక్టర్ లక్ష్మి ప్రసాద్ నివాసంతో పాటుగా ఆయనకు చెందిన 13 ప్రాంతాల్లో దాడులు చేసి ఆకస్మిక సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో సుమారు 80 కోట్ల రూపాయలకు పైగా ఆస్తున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.
ఎర్రగడ్డలోని డాక్టర్ లక్ష్మి భాస్కర్ స్వగృహమైన కల్పతరువు అపార్ట్మెంట్స్ సహా బంధువులు, కుటుంబ సభ్యుల గృహాల్లో ఏసీబీ సోదాలు చేశారు. ఈ సోదాల్లో కూకట్ పల్లి సహా హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో 10 విలాసవంతమైన భారీ భవనాలు, పేట్ బషీరాబాద్, కూకట్ పల్లిలో ఐదు అపార్ట్మెంట్లలో ప్లాట్లు, బ్యాంకు ఖాతాల్లో 41 లక్షల నగదు, పోస్టాఫిసుల్లో 13 లక్షల డిపాజిట్లు , ప్రైవేటు సంస్థల్లో రూ.35 లక్షల పెట్టుబడులకు సంబందించిన ఆధారాలు దొరికాయి. ఇంకా 517 గ్రాముల బంగారు ఆభరణాలు, ఖరీదైనా 3 కార్లు, నాలుగు మోటారు బైకులు వున్నట్లు గుర్తించారు.
ఒక్క స్థిర చరాస్తులే కాకుండా కొంతమంది స్నేహితులు, ఇతరా వ్యక్తులకు చేబదులుగా 1.33 కోట్ల రుపాయలు ఇచ్చినట్లు తెలిసి ఏసీబీ అధికారులు దిమ్మరపోయినట్లు తెలుస్తోంది. తెలంగాణాలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ లో కూడా ఆస్తులు, పెట్టుబడులు వున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఏసీబీ తనిఖీల్లో ఆంధ్రప్రదేశ్ లోని అత్యంత ఖరీదైన విశాఖ పట్నంలో 800 గజాల స్థలం వున్నట్లు పత్రాలు లభ్యం కావడం దీనికి నిదర్శనంగా చెబుతున్నారు. ఇంట్లో ఏ మూల చూసినా నోట్ల కట్టలు, ఆస్తి పత్రాలు, బంగారు నగలు కనిపించినట్లు ఏసీబీ అధికారులు చర్చించుకోవడం కనిపించిందని మీడియాలో కథనాలు వస్తున్నాయి.
This post was last modified on September 23, 2026 6:33 am
నేచురల్ స్టార్ నాని కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో రూపొంది, అత్యధిక అంచనాలతో విడుదల కాబోతోంది ‘ది ప్యారడైజ్’ సినిమా. ఈ…
గత కొన్ని రోజులుగా బయట ప్రచారం జరుగుతున్నట్టు ఆదర్శ కుటుంబం ఏకె 47 ఒక వారం వాయిదా పడింది. ముందు…
ఒక మీడియం బడ్జెట్ సినిమాకు రాజమౌళి ప్రెజెంట్స్ అని పడిందంటే అందులో విషయం చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఎందుకంటే…
జపాన్‌పై రెండు పరుగుల తేడాతో గెలిచారు. కానీ ఈ మ్యాచ్ తర్వాత టీమిండియా బ్యాటింగ్‌పై మళ్ళీ సందేహాలు మొదలయ్యాయి. భారత…
ఒకప్పుడు గిన్నిస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డులో పేరు సంపాదించుకోవడమంటే అదో పెద్ద ఘనతగా భావించే వాళ్ళు. పెద్ద పెద్ద…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ప్రకటించే నంది అవార్డులకు ఎంత విలువ ఉండేదో తెలిసిందే. వాటిని జాతీయ అవార్డులతో సమానంగా చూసేవారు.…