Movie News

వైకుంఠపురములో విశ్వనాథ్… పెద్ద పోలికే

నిన్న చెన్నైలో విశ్వనాథ్ అండ్ సన్స్ ఈవెంట్ ఘనంగా జరిగింది. దీన్ని తమిళ సినిమాగానే చెబుతూ వస్తున్నారు కాబట్టి దానికి అనుగుణంగా ప్రమోషన్లు తమిళనాడు నుంచి మొదలుపెట్టారు. సూర్య హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మించిన ఈ ఫ్యామిలీ కం లవ్ ఎంటర్ టైనర్ ఆగస్ట్ 14 థియేటర్లలో అడుగు పెట్టనుంది. డబ్బింగ్ వెర్షన్ అయినప్పటికీ సూర్యకున్న ఇమేజ్ దృష్ట్యా ఇక్కడా మంచి బిజినెస్ జరుపుకోనుంది.

నిర్మాత నాగవంశీ ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుగులో తామే తీసిన అల వైకుంఠపురములో ఏ స్థాయిలో అయితే గొప్ప విజయం సాధించిందో అదే తరహాలో విశ్వనాథ్ అండ్ సన్స్ కూడా కోలీవుడ్ కు అలా నిలిచిపోతుందని పెద్ద స్టేట్ మెంట్ ఇచ్చారు. అంటే వినోదం, సంగీతం, ఎమోషన్ అన్నీ పోటాపోటీగా బన్నీ మూవీని తలపించేలా ఉంటాయని హామీ గుప్పించారు. వినడానికి బాగుంది కానీ నిజంగా అలా అయితే సూర్యకు కరుప్పుని మించిన విజయం దగ్గరలో ఉన్నట్టే.

ఇక్కడ రిస్క్ కూడా లేకపోలేదు. అల వైకుంఠపురములోతో పోల్చడం ఆషామాషీ కాదు. ఎందుకంటే స్వయంగా త్రివిక్రమ్ శ్రీనివాసే ఆ స్థాయి మేజిక్ ని మళ్ళీ రిపీట్ చేయలేకపోయారు. గుంటూరు కారం ఏమయ్యిందో తెలిసిందే. బాహుబలిని టచ్ చేస్తుందనుకుంటే సరిలేరు నీకెవ్వరు రేంజ్ లో కూడా అంతగా ఆడలేదు. ఏదో మహేష్ ఇమేజ్, గురూజీ మాటల వల్ల డీసెంట్ గా గట్టెక్కింది. మరి వెంకీ అట్లూరి లాంటి సెన్సిబుల్ దర్శకుడు అది రిపీట్ చేయడం సవాలే.

టీమ్ మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. ష్యుర్ షాట్ బ్లాక్ బస్టర్ రేంజ్ లో నమ్మకాన్ని వ్యక్తం చేస్తోంది. తెలుగులోనూ ఒక ఈవెంట్ ప్లాన్ చేయబోతున్నారు. దానికి సంబంధించిన వివరాలు ఈ వారంలోనే రాబోతున్నాయి. మమిత బైజు హీరోయిన్ గా నటించిన విశ్వనాథ్ అండ్ సన్స్ ని మధ్యవయసు వ్యక్తి, పాతికేళ్ల యువతికి మధ్య ప్రేమకథగా తెరకెక్కించారు. ఇంత సున్నితమైన పాయింట్ ని అన్ని వర్గాలు ముఖ్యంగా ఫ్యామిలీ జనాలను మెప్పించేలా ఎలా తీశారో చూడాలి. 

This post was last modified on August 3, 2026 10:12 am

Share

Recent Posts

సుకుమార్ మీద దేవి ఫ్యాన్స్ ఎటాక్

కొంద‌రు ద‌ర్శ‌కులు టెక్నీషియ‌న్ల విష‌యంలో చాలా ప‌ర్టికుల‌ర్‌గా ఉంటారు. తమ‌తో బాగా సింక్ అయ్యే, కోరుకున్న ఔట్ పుట్ ఇచ్చే…

3 hours ago

సైలెంటుగా వ‌చ్చి ఇండ‌స్ట్రీ హిట్ కొట్టేసింది

నివిన్ పౌలీ.. 11 ఏళ్ల ముందు ప్రేమ‌మ్ మూవీతో పెద్ద హిట్టు కొట్టి స్టార్ ఇమేజ్ సంపాదించిన న‌టుడు. ఆ…

8 hours ago

ముఖ్యమంత్రి పదవికి దీప్కే రాజీనామా

అదేంటి కాక్రోచ్ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడని బిత్తర పోతున్నారా..? అప్పుడే ఆయన తన పదవికి రాజీనామా…

11 hours ago

కొండా సురేఖకు కేబినెట్ హోదా?

తెలంగాణా అధికార కాంగ్రెస్ పార్టీలో రాజకీయ పరిణామాలు రోజుకో రకంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కొండా సురేఖ…

13 hours ago

ఇరుముడి న‌టుడు… రోజుకు 40 వేలు

హీరో హీరోయిన్ల‌కు.. పెద్ద టెక్నీషియ‌న్ల‌కు అంటే సినిమాకు ఏక మొత్తంగా పారితోష‌కాలు ఇస్తారు. కానీ చిన్న చిన్న క్యారెక్ట‌ర్లు చేసేవాళ్ల‌కు…

14 hours ago

నాలుగు స్థంభాలాటలో విజేత ఎవరంట

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు నలుగురు వంద రోజుల గ్యాప్ లో పరస్పరం తమ సినిమాలతో తలపడుతున్నారు. ఒకరు గాంధీ…

14 hours ago