Trends

డెంగీ తాట తీసే టీకా వచ్చేస్తోంది

‘డెంగీ’ దెబ్బ ఎంతలా ఇబ్బంది పెడుతుందో.. మనిషిని ఎంతలా అతలాకుతలం చేస్తుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే ఉండదు. డెంగీ బారిన పడితే.. దాని నుంచి కోలుకోవటానికి కనిష్ఠంగా మూడు నెలలు.. గరిష్టంగా ఆర్నెల్ల పాటు నొప్పుల నరకాన్ని చూడటం తెలిసిందే. ఈ మాయదారి డెంగీకి చెక్ పెట్టే టీకా ఒకటి అందుబాటులోకి రానుంది. జపాన్ కు చెందిన ఒక ప్రముఖ బయో ఫార్మా సంస్థ డెవలప్ చేసిన వ్యాక్సిన్ కు.. భారత ప్రభుత్వ సంస్థ ఓకే చెప్పటం ఆసక్తికర అంశంగా చెప్పాలి.

జపాన్ కు చెందిన తకేడా అనే ప్రముఖ బయో ఫార్మా సంస్థ డెంగీని దరిదాపుల్లోకి రానివ్వని వ్యాక్సిన్ ను డెవలప్ చేసింది. దీని పేరు ‘క్యూడెంగా’. ఈ వ్యాక్సిన్ కు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతులు ఇచ్చేసినట్లుగా ఈ సంస్థకు చెందిన భారత విభాగం వెల్లడించింది. నాలుగేళ్ల నుంచి అరవై ఏళ్ల వయసు వారంతా ఈ వ్యాక్సిన్ ను తీసుకునేందుకు వీలున్నట్లుగా తకేడా చెబుతోంది.

ఈ టీకాకు సంబంధించి సదరు సంస్థ పలు ఆసక్తికర అంశాల్ని వెల్లడించింది. అందులో ముఖ్యమైన అంశాల్లోకి వెళితే.. గతంలో డెంగీ బారిన పడినోళ్లు సైతం తీసుకోవచ్చు. దీంతో.. భవిష్యత్తులో మరిక డెంగీ దరిదాపుల్లోకి రాకుండా రక్షణ పొందే వీలుందని చెబుతున్నారు. అంతేకాదు.. ఈ టీకాను తీసుకోవటానికి ముందు.. ముందస్తుగా ఎలాంటి పరీక్షలు తీసుకోవాల్సిన అవసరం లేదని సంస్థ స్పష్టం చేస్తోంది.

మూడు నెలల విరామంతో 0.5 ఎంఎల్ చొప్పున రెండు డోసులు తీసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఈ వ్యాక్సిన్ డెంగీలోని నాలుగు ఉప రకాల నుంచి రక్షణ ఇస్తుందని స్పష్టం చేస్తున్నారు. ఈ వ్యాక్సిన్ ను 2022లో ఆవిష్కరించగా.. ఇప్పటివరకు 42 దేశాలు అనుమతులు ఇవ్వగా.. తాజాగా భారత్ ఆ జాబితాలో చేరింది. ఇంతకూ ఈ టీకా తీసుకున్న వారి పరిస్థితేంటి? ఎంతమంది టీకా తీసుకుంటే.. ఆ తర్వాత డెంగీ బారిన పడిన వారెంత మంది? అన్న ప్రశ్నకు సమాధానం చెబుతున్నారు.

ఇప్పటివరకు 4.3 కోట్ల టీకా డోసులు ఇచ్చినట్లుగా చెబుతున్నారు. సానుకూల ఫలితాలు కనిపించినట్లుగా పేర్కొన్నారు. ఈ టీకాను తీసుకున్న తర్వాత ఏడేళ్ల తర్వాత కూడా 90 శాతం మంది డెంగీ కారణంగా ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం రాలేదని పేర్కొన్నారు. పెద్దలకు ఈ టీకా సేఫ్ అని స్పష్టం చేస్తున్నారు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ కనిపించలేదని చెబుతున్నారు. డెంగీ నివారకు ఇప్పటివరకు స్పష్టమైన చికిత్స లేదు.

వైరల్ జ్వరం బారిన పడి.. పరిస్థితి ఇబ్బందికరంగా మారినప్పటికి సాధారణ చికిత్సలతోనే కోలుకునేలా చేస్తునన వేళ.. దాని బారీన పడకుండా తప్పించకునే ఈ టీకా వినియోగించటం మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదంతా బాగానే ఉంది.. మరి భారత మార్కెట్లోకి ఎప్పుడు వస్తారు? దీని ఖరీదెంత? అన్న ప్రశ్నలు తెర మీదకు వస్తున్నాయి.

దీనికి సమాధానం వెతికితే.. 2027 మొదటి ఆర్నెల్ల కాలంలో భారత మార్కెట్లోకి వస్తుందని చెబుతున్నారు. తొలుత దీన్ని ప్రైవేటు ఆసుపత్రులకు అందుబాటులో ఉంచేలా చేస్తారని చెబుతున్నారు. ఆసక్తికరమైన మరో అంశం ఏమంటే.. ఈ వ్యాక్సిన్ ను హైదరాబాద్ లోనే తయారు చేయనున్నారు. హైదరాబాద్ కు చెందిన బయలాజికల్ ఈ సంస్థ ఉత్పత్తి చేయనుంది. దీనికి సంబంధించి జపాన్ కు చెందిన సంస్థతో ఒప్పందం జరిగినట్లుగా చెబుతున్నారు.

ఈ రెండు సంస్థలు చేసుకున్న ఒప్పందంలో భాగంగా ఏటా 5 కోట్ల డోస్ లను ఉత్పత్తి చేయటం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇదంతా బాగానే ఉంది కానీ వ్యాక్సిన్ ధర ఎంత? అంటే.. మార్కెట్ వర్గాల అంచనాను అనుసరించి చూస్తే.. ఒక డోస్ మూడు వేల రూపాయిల నుంచి ఐదు వేల రూపాయిల వరకు ఉంటుందని చెబుతున్నారు.

మూడు నెలల వ్యవధిలో రెండు డోసులు వేసుకోవాల్సిన నేపథ్యంలో దగ్గర దగ్గర డెంగీ వ్యాక్సిన్ వేసుకోవాలంటే రూ.6 వేల నుంచి రూ.10వేల మధ్యలో ఖర్చు ఉంటుందన్నది అంచనా. ఏమైనా.. డెంగీ బారిన పడి లక్షలాది రూపాయిల ఖర్చు.. నొప్పుల నరకంతో పోలిస్తే.. ఈ ఖర్చు చిన్నదని చెప్పాలి. కాకుంటే.. సామాన్యులకు మాత్రం ప్రభుత్వం దన్నుగా నిలిచి.. ఈ వ్యాక్సిన్ అందరికి అందుబాటు ధరలో ఉండేలా చేస్తే బాగుంటుందని చెప్పక తప్పదు.

This post was last modified on July 22, 2026 10:36 am

Share

Recent Posts

టాక్సిక్ పరిస్థితి ఎలా ఉంది గురూ

భారీ అంచనాల మధ్య కెజిఎఫ్ ని మించి ఉంటుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న టాక్సిక్ రిలీజ్ రోజు ఉదయం నుంచే…

2 minutes ago

ఇరుముడి జోరుకు పగ్గాలు అసాధ్యం

టయర్ 1 హీరోలు, ప్యాన్ ఇండియా సినిమాలకు రోజుల తరబడి హౌస్ ఫుల్స్ పడటం సహజం. కానీ వాటికి కూడా…

42 minutes ago

సీఎం రేవంత్ టీంకు ఢిల్లీ నుంచి పిలుపు

అంతా ఊహించినట్టే ఢిల్లీ కాంగ్రెస్ స్పందించింది. ఇన్నాళ్లు తెలంగాణా కాంగ్రెస్ లో జరుగుతున్న పరిణామాలను మౌనంగా గమనిస్తూ వచ్చిన అధిష్టానం…

2 hours ago

వైసీపీ ప‌రిస్థితి దారుణం… పోటీకి నేతలు ఉన్నారా?

స్థానిక ఎన్నిక‌ల్లో స‌త్తా చాటాల‌ని వైసీపీ అధినేత జ‌గ‌న్ కోరుకుంటున్నారు. త‌ద్వారా.. గ‌త 2024 సాధార‌ణ ఎన్నిక‌ల్లో ఎదురైన ప‌రాభ‌వం…

4 hours ago

వైసీపీ టాప్ లీడ‌ర్‌కు జ‌గ‌న్ చెక్‌…?

ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని కోవూరు నియోజకవర్గ వైసీపీ రాజకీయంలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. ప్రస్తుత వైసీపీ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే…

5 hours ago

మ‌హేష్ బాబుకు క‌థ చెప్పిన సుధ కొంగ‌ర‌

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు మొద‌ట్నుంచి టాలీవుడ్‌కే ప‌రిమితం అయిపోయాడు కానీ.. త‌న‌కు ఇత‌ర భాష‌ల్లోనూ మంచి డిమాండే ఉంది.…

10 hours ago