Movie News

విజ‌య్ జననాయకుడు వెనకపడ్డాడు

త‌మిళ సినిమాల మీద తెలుగు ప్రేక్ష‌కుల ఎలాంటిదో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. ద‌శాబ్దాలుగా అక్క‌డి నుంచి వ‌చ్చే అనువాద చిత్రాల‌ను మ‌న వాళ్లు గొప్ప‌గా ఆద‌రిస్తున్నారు. ఒక‌ప్ప‌టితో పోలిస్తే గ‌త ప‌దేళ్ల‌లో మ‌న ద‌గ్గ‌ర‌ త‌మిళ సినిమాల హ‌వా త‌గ్గిన‌ప్ప‌టికీ.. కొన్ని సినిమాలు మంచి క్రేజ్‌తో రిలీజై భారీ ఓపెనింగ్స్ తెచ్చుకుంటూ ఉంటాయి. తెలుగులో కొంచెం లేటుగా క్రేజ్ తెచ్చుకుని ఇక్క‌డ మంచి ఓపెనింగ్స్ రాబ‌ట్టుకుంటున్న హీరోల్లో విజ‌య్ ఒక‌డు. తుపాకి ద‌గ్గ‌ర్నుంచి తెలుగులో త‌న‌కు ఫాలోయింగ్ పెరిగింది. గ‌త గ‌త చిత్రాల‌కు ఇక్క‌డ మంచి ఓపెనింగ్స్ వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో విజ‌య్ చివ‌రి చిత్రం జననాయకుడు కూడా తెలుగులో ఓపెనింగ్స్ గ‌ట్టిగానే ఉంటాయ‌ని అంచ‌నా వేశారు.

కానీ ముందు అనుకున్న ప్ర‌కారం సంక్రాంతికే రిలీజై ఉంటే జననాయకుడు క‌లెక్ష‌న్లు కొల్ల‌గొట్టేదేమో. కానీ సినిమా వాయిదా ప‌డి, బాగా ఆల‌స్యం కావ‌డం.. మ‌ధ్య‌లో పైర‌సీ ప్రింట్ కూడా ఆన్ లైన్లోకి రావ‌డం.. ఇప్పుడు స‌రైన ప్ర‌మోష‌న్ కూడా లేకుండా సినిమాను రిలీజ్ చేస్తుండ‌డంతో జ‌న‌నాయ‌కుడు ప‌ట్ల మ‌న జ‌నాల్లో ఆస‌క్తి క‌నిపించ‌డం లేదు. త‌మిళంలో కూడా కొంత హైప్ త‌గ్గిన‌ప్ప‌టికీ అడ్వాన్స్ బుకింగ్స్ గ‌ట్టిగానే జ‌రుగుతున్నాయి. కానీ తెలుగులో మాత్రం ప‌రిస్థితి ఏమాత్రం ఆశాజ‌నకంగా లేదు. జ‌న‌నాయ‌కుడును తెలుగులో దిల్ రాజు రిలీజ్ చేస్తుండ‌డంతో భారీ సంఖ్య‌లో థియేట‌ర్లు ఇచ్చేశారు.

మ‌ల్టీప్లెక్సులు, సింగిల్ స్క్రీన్ల‌లో ఉద‌యం 7.30 నుంచే షోలు మొద‌లుపెట్టేశారు. ఇక్క‌డ పెద్ద స్టార్ సినిమా రిలీజ‌వుత‌నున్న త‌ర‌హాలో స్క్రీన్లు, షోలు సెట్ చేశారు. ఈ సినిమాకు విప‌రీత‌మైన డిమాండ్ ఉన్న‌ట్లుగా పొద్దు పొద్దునే షోలు మొద‌లుపెడుతుండ‌గా.. అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తే అంతంత‌మాత్రంగా ఉన్నాయి.

హైద‌రాబాద్‌లో రెండు మూడు షోలు త‌ప్పితే ఫాస్ట్ ఫిల్లింగ్ మోడ్‌లో లేవు. బుకింగ్స్ మొద‌లై రెండు రోజులు అవుతున్నా ఇంకా ప‌ట్టుమ‌ని ప‌ది టికెట్లు తెగ‌ని ఉద‌యం షోలు చాలానే ఉన్నాయి. తెలుగులో విజ‌య్ క్రేజ్ గురించి, జ‌న‌నాయకుడు సినిమా గురించి మ‌రీ ఎక్కువ ఊహించేసుకున్నారా అన్న సందేహం క‌లుగుతోంది బుకింగ్స్ తీరు చూస్తుంటే.

అస‌లే ఇది రీమేక్ మూవీ. పైగా విడుద‌ల బాగా ఆల‌స్యం అయింది. అందులోనూ పైర‌సీ ప్రింట్ రిలీజ్‌కు ముందే లీక్ అయిపోయింది. ఇన్ని ప్ర‌తికూల‌త‌లున్న సినిమాను మ‌నోళ్లు వెర్రెత్తిపోయి చూసేస్తార‌నుకుంటే పొర‌పాటే. విజ‌య్ సీఎం అయిపోయాడ‌ని, ఆయ‌న చివ‌రి సినిమా ఇద‌ని ఎగ‌బ‌డి చూసేస్తార‌ని అనుకున్న‌ట్లున్నారు. మ‌న వాళ్ల‌కు సినిమా పిచ్చి ఎక్కువే కానీ.. మ‌రీ ఆన్ లైన్లో లీక్ అయిన రీమేక్ మూవీని ఎగ‌బ‌డి చూసేంత లేద‌ని ప్రేక్ష‌కులు చెప్ప‌క‌నే చెప్పిన‌ట్ల‌యింది.

This post was last modified on July 22, 2026 10:17 am

Share

Recent Posts

పెద్ద గండం దాటేసిన రణబాలి

ఇంకో మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రణబాలి బుకింగ్స్ మెల్లగా ఊపందుకుంటున్నాయి. సాధారణంగా ఓవర్సీస్ లో విజయ్ దేవరకొండ చూపించే…

26 minutes ago

జ‌గ‌న్ విదేశీ ప‌ర్య‌ట‌నకు బ్రేక్ ప‌డుతుందా?

వైసిపి అధినేత జగన్ వచ్చే నెలలో యూరప్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సర్వం సిద్ధం…

3 hours ago

డెకాయిట్ తర్వాత దర్శనం లేదేంటి

కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…

5 hours ago

సత్తా చాటుతుందంటే మొహం చాటేసింది

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…

5 hours ago

జనాభా పెరుగుతుంటే ఓట్లు ఎలా తగ్గుతాయి?

ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…

6 hours ago

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

14 hours ago