లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్ తో జరిగిన మూడో వన్డేలో టీమిండియా 27 పరుగుల తేడాతో ఓటమి పాలై సిరీస్ ను 2-1 తో చేజార్చుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 50 ఓవర్లలో 3 వికెట్లకు 387 పరుగుల భారీ స్కోరు సాధించగా, భారత్ 7 వికెట్లు కోల్పోయి 360 పరుగులు మాత్రమే చేయగలిగింది. గాయంతో బుమ్రా దూరమవ్వడం జట్టు బౌలింగ్ లైనప్ ను ఎంతగా దెబ్బతీసిందో ఈ మ్యాచ్ స్పష్టంగా నిరూపించింది. యువ బౌలర్లు ఏ దశలోనూ ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బంది పెట్టలేకపోయారు.
భారీ లక్ష్య ఛేదనలో భారత టాప్ ఆర్డర్ అద్భుతంగా ఆడింది. విమర్శలకు తన బ్యాట్ తోనే సమాధానం చెబుతూ రోహిత్ శర్మ 138 పరుగులతో అద్భుత సెంచరీ సాధించాడు. శుభ్‌మన్ గిల్ 77 పరుగులతో రాణించడంతో వీరిద్దరూ తొలి వికెట్ కు 147 పరుగులు జోడించారు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ 74 పరుగులతో క్రీజులో ఉన్నంతసేపు మ్యాచ్ మనదే అన్నట్లు సాగింది. కానీ ఈ ముగ్గురు మినహా మిగతా బ్యాటర్ల నుంచి కనీస సహకారం అందకపోవడం జట్టు కొంపముంచింది.
మ్యాచ్ ఫలితాన్ని రెండు కీలక అంశాలు శాసించాయి. ఇంగ్లాండ్ బ్యాటింగ్ చేస్తుండగా చివరి ఐదు ఓవర్లలో మన బౌలర్లు ఏకంగా 82 పరుగులు సమర్పించుకున్నారు. ఇక భారత్ ఛేదనలో జాకబ్ బెథెల్ వేసిన స్పెల్ మ్యాచ్ ను మలుపు తిప్పింది. ముప్పై ఓవర్ల తర్వాత బౌలింగ్ కు వచ్చిన అతను ఏడు ఓవర్లలో కేవలం 49 పరుగులు మాత్రమే ఇచ్చి అత్యంత కీలకమైన రోహిత్ శర్మ వికెట్ పడగొట్టాడు. అక్కడ సరైన భాగస్వామ్యాలు లేకపోవడంతో లక్ష్యం దూరమైంది.
కోచ్ గౌతమ్ గంభీర్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు తీవ్ర విమర్శల పాలవుతున్నాయి. ఇంగ్లాండ్ జట్టు పరిస్థితులకు తగ్గట్లుగా ముగ్గురు స్పిన్నర్లను వాడితే, భారత్ మాత్రం నలుగురు ఫాస్ట్ బౌలర్లతో బరిలోకి దిగింది. కుల్దీప్ యాదవ్ లాంటి మ్యాచ్ విన్నర్ ను బెంచ్ కే పరిమితం చేయడం పెద్ద తప్పుగా మారింది. జట్టులో ఏకైక స్పిన్నర్ గా ఉన్న అక్షర్ పటేల్ వికెట్ తీయలేకపోగా 61 పరుగులు ఇచ్చాడు. సరైన ప్రణాళికలు లేకపోవడం వల్లే బౌలింగ్ విభాగం తేలిపోయింది.
రాబోయే వరల్డ్ కప్ కోసం భవిష్యత్ తరాన్ని సిద్ధం చేయాలనే ఆలోచనతో చేస్తున్న ప్రయోగాలు వికటిస్తున్నాయని ఈ సిరీస్ తో తేలిపోయింది. గుర్నూర్ బ్రార్ లాంటి యువ బౌలర్లు విదేశీ గడ్డపై తేలిపోతున్నారు. అతనికి వేగం ఉన్నా ఏకంగా 97 పరుగులు సమర్పించుకోవడం గమనార్హం. సీనియర్లు రోహిత్, కోహ్లీ రాణించకపోతే పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేది. ఇకనైనా గంబీర్ ప్రయోగాల విషయంలో కొంత ఆలోచిస్తే బెటర్ అనే కాంత్ వినిపిస్తున్నాయి.
This post was last modified on July 20, 2026 12:22 am
ఢిల్లీ జంతర్ మంతర్ లో కాక్రోచ్ లు చేపట్టిన ఆందోళన ప్రభావం కేంద్ర ప్రభుత్వం మీద ఎంతో తీవ్రమైన ఎఫెక్ట్…
రాం గోపాల్ వర్మ అంటేనే ఒక బ్రాండ్. ఆయన సినిమాలకు హాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ అనే తేడా లేదు.…
రాకింగ్ స్టార్ యష్ కొత్త సినిమా 'టాక్సిక్' ట్రైలర్, ప్రోమోలు చూస్తుంటే ఆడియన్స్ లో ఒక ఇంట్రెస్టింగ్ డిస్కషన్ మొదలైంది.…
టాలీవుడ్లో ప్రస్తుతం నంబర్ వన్ కొరియోగ్రాఫర్ స్థానానికి గట్టి పోటీదారుల్లో ఒకడు శేఖర్ మాస్టర్. గత దశాబ్ద కాలంలో అతను…
రాజకీయాల్లో ప్రత్యర్తులుగా ఉన్న వారు అన్ని విషయాల్లోనూ కయ్యానికి కాలు రువ్వాల్సిన అవసరం లేదని పలు సందర్భాల్లో తమిళనాడు రాష్ట్ర…
అదేంటో విచిత్రంగా డిసి సినిమాకు తమిళనాడు కంటే ఏపీ తెలంగాణలో మంచి కలెక్షన్లు వస్తున్నాయి. సోమవారం గ్రాస్ చూసుకుంటే మన…