Movie News

చెన్నై లవ్ స్టోరీ డేంజర్ గేమ్

తమ సినిమా పెద్ద హిట్ అవుతుందని, బ్లాక్ బస్టర్ అవుతుందని మేకర్స్ చెప్పుకోవడం మామూలే. ఇలా ఎవరైనా చెప్పుకుంటుంటే అదేమీ ఆశ్చర్యంగా అనిపించదు. కానీ తమ సినిమా క్లాసిక్ అవుతుందని ఎవరైనా అంటే కొంచెం ఆశ్చర్యంగా చూస్తాం. ఐతే ఇప్పుడో చిత్ర బృందం తమ సినిమా ‘కల్ట్ క్లాసిక్’ అని ప్రకటించుకోవడమే కాదు.. పోస్టర్ల మీద, వీడియో ప్రోమోల్లో స్టాంప్ కూడా వేసేస్తోంది. బహుశా ఫిలిం ఇండస్ట్రీలో ఇంతకుముందెన్నడూ చూడని చిత్రమిది.

వచ్చే శుక్రవారం విడుదల కానున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ టీం చేస్తున్న సాహసమిది. ఏ సినిమా అయినా విడుదల తర్వాత, కాల క్రమంలో కల్ట్, క్లాసిక్ స్టేటస్‌ తెచ్చుకుంటుంది. కానీ రిలీజ్‌కు ముందే ‘కల్ట్ క్లాసిక్’ అని చెప్పుకోవడం వింతే. నిర్మాత అల్లు అరవింద్ సైతం ఈ విషయంలో ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేసి, ఈ సినిమాకు ఆ అర్హత ఉందనిపిస్తోందని వ్యాఖ్యానించారు.

‘బేబీ’ సినిమా మేకర్సే ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా తీశారు. ‘బేబీ’కి పెయిడ్ ప్రిమియర్స్ అయిపోయాక దాన్ని కల్ట్ మూవీ అని ప్రచారం చేసుకుని విజయవంతం అయింది టీం. ఆ మాటతో ఏకీభవించిన వాళ్లున్నారు. అలాగే ‘బేబీ’ కమర్షియల్ హిట్ మాత్రమే.. అది కల్ట్ ఏంటి అన్నవాళ్లూ లేకపోలేదు. కానీ ఇప్పుడు రిలీజ్‌కు ముందే ‘చెన్నై లవ్ స్టోరీ’ని కల్ట్ క్లాసిక్ అని బల్లగుద్ది చెబుతూ, ప్రోమోల్లో ఆ మాట వాడుతుండడం మాత్రం కొంచెం అతిగా అనిపిస్తోంది.

ఇది చాలా రిస్క్ అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.
ఇలా ప్రచారం చేసుకున్నాక సినిమాను ప్రేక్షకులు చూసే కోణమే మారిపోతుంది. కథ అంత గొప్పగా ఉండాలని ఆశిస్తారు. ప్రతి సన్నివేశంలోనూ క్లాసిక్ ఫీల్ కోరుకుంటారు. అంచనాలు అమాంతం పెరిగిపోతాయి.

ఈ హైప్ వల్ల ఓపెనింగ్స్ రావచ్చేమో కానీ.. సినిమా ఏమాత్రం తగ్గినా అది నెగెటివ్ అవుతుంది. దీన్నా కల్ట్ అన్నారు, క్లాసిక్ అన్నారు అంటూ వెటకారాలడతారు. టాక్ తేడా కొడుతుంది. మరి ఈ ముప్పు ఉంటుందని తెలిసే ఇలా ప్రచారం చేస్తున్నారు అంటే.. సినిమా మీద మేకర్స్‌ అంత నమ్మకంతో ఉన్నారనుకోవాలి. మరి వారి నమ్మకం ఎంతమేర నిలబడుతుందో చూడాలి.

This post was last modified on July 19, 2026 10:12 pm

Share

Recent Posts

జనాభా పెరుగుతుంటే ఓట్లు ఎలా తగ్గుతాయి?

ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…

30 minutes ago

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

8 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

11 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

11 hours ago

దురంధర్ సృష్టికర్త చుట్టూ తొలగని సస్పెన్స్

గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…

11 hours ago

రణబాలి గెలవాల్సింది రెండు యుద్ధాలు

ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…

11 hours ago