పాము పగబట్టడం విన్నాం… మనిషిపై మరో మనిషి పగబట్టడడమూ చూశాం. కానీ ఓ ఏనుగు పగబట్టడం… అది కూడా ఏళ్ల తరబడి తన పగను మరిచిపోకుండా జీవనం సాగించడం… ఎప్పుడూ వినలేదు కదా. నిజమే…ఏనుగులు పగబట్టిన మాట ఇప్పటిదాకా వినలేదు. తమ ఉనికికి ప్రమాదం సంభవిస్తోందని భావించిన సందర్భంలోనే ఏనుగులు ఒకింత టెన్షన్ కు గురై అడ్డమొచ్చిన వారిని తొక్కేసుకుంటూ వెళ్లిపోతాయి. అయితే నేపాల్ లో ఇటీవలే జరిగిన ఓ ఘటన చూస్తే… ఏనుగులకూ పగబట్టడం తెలుసు అని ఒప్పుకోక తప్పదు.
ఒక కుటుంబంలోని ఇద్దరిని పొట్టనబెట్టుకున్న ఓ నేపాలీ ఏనుగు దాదాపుగా 14 ఏళ్ల తర్వాత ఆ కుటుంబాన్ని వెతుక్కుంటూ మరీ సాగి… అదే కుటుంబంలోని మరో ఇద్దరిని చంపేసింది. తొలి ఘటన తర్వాత అక్కడి నుంచి చాలా దూరం పారిపోయిన సదరు కుటుంబం.. ఏనుగు నుంచి తమను తాము కాపాడుకునేందుకు ఏకంగా నదులనే దాటేసి వెళ్లిందట. అయినా కూడా ఆ ఏనుగు 14 ఏళ్ల తర్వాత తిరిగీ ఆ కుటుంబం ఆచూకీని తెలుసుకుని మరీ…నేరుగా ఇంటిలోకి చొరబడి మరో ఇద్దరిని పొట్టనబెట్టుకుంది. వినడానికి వింతగా ఉన్నా… ఇది నిజంగా జరిగిన ఘటన.
నేపాల్ లోని చిట్వాన్ జాతీయ పార్క్ కు సమీపంలోని మడి గ్రామంపై విరుచుకుపడిన దుర్బే అనే ఓ ఏనుగు ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులను చంపేసింది. ఈ ఘటన 2012లో జరగగా… ఆ కుటుంబ యజమాని శనిచర బోటే బెంబేలెత్తిపోయారు. ఏనుగుల గురించి ఒకింత బాగానే తెలిసిన బోటే…తన కుటుంబంపై జరిగిన ఏనుగు దాడిని తలచుకుని మరీ భయకంపితులయ్యాడు. మున్ముందు ఆ ఏనుగు నుంచి తన ఫ్యామిలీని కాపాడుకునే నిమిత్తం ఃఅతడు తాను ఉంటున్న మడి గ్రామాన్ని వదిలేశాడు. అక్కడి నుంచి నదులు దాటేసి 9 మైళ్ల దూరం వెళ్లిన ఆయన జగత్ పూర్ అనే ఓ చిన్న గ్రామంలో నివాసం ఏర్పరచుకున్నారు.
అలా 2012 నాటి ఘటనను మదిలో నుంచి చెరిపేసుకుని మిగిలిన కుటుంబ సభ్యులతో అతడు ప్రశాంతంగానే జీవిస్తున్నాడు. అలా సాగుతున్న వారి జీవితంలోకి దుర్బే మళ్లీ ఎంట్రీ ఇచ్చింది. మడి గ్రామాన్ని వీడి బోటే వచ్చి ఉంటున్న జగత్ పూర్ దాకా వచ్చేసిన దుర్బే… నేరుగా బోటే ఇంటిలోకిని చొరబడింది. ఆ సమయంలో ఆ ఇంటిలో ఉన్న బోటే కోడలు, మనవడిని ఆ ఏనుగు చంపేసింది. దీంతో బోటే కుటుంబంలో ఆ ఏనుగు కారణంగా చనిపోయిన వారి సంఖ్య ఏకంగా నాలుగుకు చేరింది. విషయం తెలుసుకున్న బోటే… నదులు దాటి మరీ వచ్చినా… 14 ఏళ్ల తర్వాత కూడా దుర్బే తన కుటుంబాన్ని వెంటాడుతూ వచ్చిందంటే…దానికి తన కుటుంబంపై పగ ఉన్నట్టేనని బోరుమంటున్నాడు.
ఈ మదపుటేనుగు ఈ నాలుగు ప్రాణాలు మాత్రమే తీయలేదట. ఇప్పటిదాకా ఈ ఏనుగు దాడిలో ఏకంగా 25 మంది దాకా ప్రాణాలు కోల్పోయారట. ఈ ఏనుగు గురించి ఓ మోస్తరు అవగాహన ఉన్న నేపాల్ అటవీ శాఖ అధికారులు… దానికి ట్రాకర్ ను అమర్చినా… ఆ ట్రాకర్లనూ విసరికొట్టేసిన దుర్బే… మనుషులను చంపుతూనే సాగుతోందట. ఇప్పటిదాకా ఈ ఏనుగుకు మూడు సార్లు ట్రాకర్టను ఏర్పాటు చేసినా… దానిని కంట్రోల్ చేయడం సాధ్యం కాదేలని అదికారులు చెబుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates