వయస్సు కేవలం నెంబర్ మాత్రమే అనే పదం ఇప్పుడు చాలా మంది అలా ఈజీగా వాడేస్తున్నారు. పూర్వకాలంలో మనిషి దీర్ఘాయుష్సుతో బతికినా… ప్రస్తుత కాలంలో చిన్న వయసుతోనే జీవితాలను చాలిస్తున్న పరిస్థితి. ఈ తరహా పరిస్థితికి చాలానే కారణాలు ఉన్నా.. అనాది కాలం నాటి జీవన స్థితిగతులను ఇప్పటికీ అనుసరిస్తున్న కొందరు వందేళ్లకు పైబడి బతుకుతున్న వైనం చూస్తున్నదే. ఈ కోవలోనే కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల కొండపై ఓ ఆసక్తికర దృశ్యం కనిపించింది. 116 ఏళ్ల వయసు కలిగిన ఓ వృద్ధురాలు… వెంకన్న దర్శనానికి కాలి బాటన సాగుతూ కనిపించారు.
వయసు ఉడిగిన దశలో కనిపిస్తున్న సదరు వృద్ధురాలికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియరాలేదు గానీ… ఆమె ఓ కన్నడిగురాలని మాత్రం తేలింది. తన మనవలు, మనవరాళ్లతో కలిసి వెంకన్న దర్శనానికి బయలుదేరిన ఆ వృద్ధురాలు… వారితో పాటే కాలి నడకననే తిరుమల కొందకు చేరుకునేందుకు సిద్ధపడింది.
ఆ వృద్ధురాలి కోరికను కాదనలేకపోయిన ఆమె కుటుంబం ఆమెను చేదోడుగా నిలుస్తూ తిరుమల కాలి బాటన ఆమెతో పాటు సాగిపోయింది. నడవడానికే కాస్తంత ఇబ్బంది పడుతున్నట్లు కనిపిస్తున్న సదరు వృద్ధురాలు… తిరుమల కాలి బాటలోని మెట్లను మాత్రం అవలీలగా ఎక్కేస్తున్న వైనం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
తిరుమల కాలి బాటలో మెట్లు ఏ ఎత్తున ఉంటాయన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మిగిలిన ప్రదేశంలో ఓ మోస్తరు ఎత్తు ఉన్నా..మోకాళ్ల పర్వతంలో మాత్రం మెట్లు అంతెత్తున ఉంటాయి. వాటిని అదిగమించాలంటే కుర్రకారుకు కూడా ఒకింత కష్టమేనని చెప్పాలి. మరి ఈ మెట్లను ఈ వృద్ధురాలు అలవోకగా అధిగమించిన తీరు నిజంగానే ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
కుటుంబ సభ్యులు చేయందించినప్పుడు ఒకింత వణుకుతూ కనిపించిన సదరు వృద్ధురాలు… సొంతంగా మెట్లు ఎక్కే సమయంలో మాత్రం తడబడకుండా సాగుతున్న తీరు అబ్బురపరుస్తోంది. 116 ఏళ్ల వయసులోని తమ అమ్మమ్మ కోరిక మేరకే ఇలా కాలి బాటన సాగుతున్నామని ఆమె మనవడు ఒకరు చెప్పారు. అంత వయసులో అవలీలగా తిరుమల కాలి బాట ఎక్కుతున్న సదరు వృద్ధురాలి వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
This post was last modified on July 4, 2026 12:02 pm
బాహుబలి, కెజిఎఫ్ లాంటి విజువల్ గ్రాండియర్ సీక్వెల్స్ కి క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. వందల కోట్ల బడ్జెట్, విఎఫ్ఎక్స్…
నేను క్రికెట్ మ్యాచ్ చూడ్డానికి ఎక్కడికివెళ్లినా అక్కడ కూడా పెట్టుబడుల మీద ఒప్పందాల గురించి చర్చిస్తుంటాను. ఒక టీ 20…
గతంలో అంటే.. 2012 నాటి పరిస్థితులను గమనిస్తే.. జగన్‌కు పెద్ద మైనస్ అనే చెప్పాలి. అప్పట్లో ఆయనపై అక్రమాస్తుల కేసులు…
గత ఎన్నికల్లో ఓడిపోయిన ఒకరిద్దరు టీడీపీ అభ్యర్థులు పట్టు బిగిస్తున్నారు. తమకు మంత్రి నారా లోకేషే ఆదర్శమని కూడా చెబుతున్నారు.…
గతంలో పెద్ద హీరోలు తమ సినిమాల విడుదలకు ముందు పెద్దగా ప్రమోషన్లే చేసేవాళ్లు కాదు. మహా అయితే ఆడియో వేడుకలో…
కూటమి ప్రభుత్వం లక్షకు పైగా కొత్త పింఛన్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న లబ్ధి దారులకు మేలు…