Political News

కవిత పార్టీకి కొత్తపేరు వెతుక్కోవలసిందే..?

కవిత స్థాపించిన తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీకి భారత ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. ప్రస్తుతం “టీఆర్ఎస్” పేరును కొనసాగించేందుకు అనుమతి లేదని స్పష్టం చేస్తూ పార్టీ పేరును మార్చాలని ఆదేశించింది. టీఆర్ఎస్ పేరుపై ప్రజల నుంచి పెద్ద సంఖ్యలో అభ్యంతరాలు అందిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది.

తెలంగాణ అస్తిత్వం, భావోద్వేగాలకు ముడిపడిన “టీఆర్ఎస్” పేరును మరో రాజకీయ పార్టీ వినియోగించడంపై తెలంగాణ నలుమూలల నుంచి వేల సంఖ్యలో ఫిర్యాదులు అందాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో 15 రోజుల్లోగా మూడు ప్రత్యామ్నాయ పార్టీ పేర్లను సమర్పించాలని కవితకు ఎన్నికల సంఘం లేఖ రాసింది. గడువులోగా ప్రత్యామ్నాయ పేర్లు సమర్పించకపోతే పార్టీ నమోదు దరఖాస్తును తిరస్కరిస్తామని స్పష్టం చేసింది.

ఇప్పటికే ‘తెలంగాణ రాష్ట్ర సేన’ పేరును ‘తెలంగాణ రక్షణ సేన’గా మార్చుకున్న కవిత పార్టీ.. ఇప్పుడు మరోసారి కొత్త పేరు వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో పార్టీ ఏర్పాటైన కొద్ది కాలంలోనే మరోసారి పేరు మార్పు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే, కవిత పార్టీకి “టీఆర్ఎస్” పేరు పెట్టడంపై మొదటి నుంచే అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.

ఒకప్పటి తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పేరుతో పోలిక ఉండటంతో ప్రజల్లో గందరగోళం ఏర్పడుతుందని, తెలంగాణ ఉద్యమంతో ముడిపడిన పేరును కొత్త పార్టీ ఉపయోగించరాదంటూ పలువురు ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేశారు. ఆ అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం కేంద్ర ఎన్నికల సంఘం పార్టీ పేరు మార్చాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రత్యామ్నాయ పేర్లను సమర్పించిన తర్వాత వాటిని పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటామని ఎన్నికల సంఘం వెల్లడించింది.

This post was last modified on July 4, 2026 11:17 am

Share

Recent Posts

దృశ్యం బ్రాండ్ విలువ మహత్యం

బాహుబలి, కెజిఎఫ్ లాంటి విజువల్ గ్రాండియర్ సీక్వెల్స్ కి క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. వందల కోట్ల బడ్జెట్, విఎఫ్ఎక్స్…

17 seconds ago

టీ 20 చూస్తూ పారిశ్రామికవేత్తలతో చర్చించా

నేను క్రికెట్ మ్యాచ్ చూడ్డానికి ఎక్కడికివెళ్లినా అక్కడ కూడా పెట్టుబడుల మీద ఒప్పందాల గురించి చర్చిస్తుంటాను. ఒక టీ 20…

5 minutes ago

సుడిగుండంలో చిక్కుకున్న జ‌గ‌న్ .. !

గ‌తంలో అంటే.. 2012 నాటి ప‌రిస్థితుల‌ను గ‌మ‌నిస్తే.. జ‌గ‌న్‌కు పెద్ద మైన‌స్ అనే చెప్పాలి. అప్ప‌ట్లో ఆయ‌న‌పై అక్ర‌మాస్తుల కేసులు…

58 minutes ago

ప్రజల మన్ననలు పొందుతున్న లేడీ లీడర్

గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన ఒక‌రిద్ద‌రు టీడీపీ అభ్య‌ర్థులు ప‌ట్టు బిగిస్తున్నారు. త‌మ‌కు మంత్రి నారా లోకేషే ఆద‌ర్శమ‌ని కూడా చెబుతున్నారు.…

4 hours ago

టాలీవుడ్ ఇంటర్వ్యూల తీరు మారిపోయింది

గతంలో పెద్ద హీరోలు తమ సినిమాల విడుదలకు ముందు పెద్దగా ప్రమోషన్లే చేసేవాళ్లు కాదు. మహా అయితే ఆడియో వేడుకలో…

6 hours ago

అసంతృప్తి ఓట్లు కూడా కూట‌మికేనా?

కూట‌మి ప్ర‌భుత్వం ల‌క్ష‌కు పైగా కొత్త పింఛ‌న్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘ‌కాలంగా ఎదురు చూస్తున్న ల‌బ్ధి దారుల‌కు మేలు…

8 hours ago