కరోనా వ్యాక్సిన్ తీసుకున్న నర్సు మృతి

కరోనా వ్యాక్సిన్ తీసుకున్న రెండు రోజుల తర్వాత ఓ నర్సు చనిపోవటం సంచలనంగా మారింది. పోర్చుగీసులో ఇన్ స్టిట్యూ ఆఫ్ ఆంకాలజీలో అసిస్టెంట్ పీడియాట్రిక్స్ నర్సుగా సోనియా అసెవేడో పనిచేస్తున్నారు. ప్రపంచాన్ని వణికించేస్తున్న కరోనా వైరస్ విషయంలో మిగిలిన వాళ్ళకు లాగే ఈమె కూడా కరోనా వారియర్ గా పనిచేస్తున్నారు. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఫైజర్ ఫార్మా కంపెనీ డెవలప్ చేసిన వ్యాక్సిన్ను సోనియా వేయించుకున్నారు.

వ్యాక్సిన్ వేసుకున్న రెండు రోజులు బాగానే ఉన్న సోనియా మరుసటి రోజు హఠాత్తుగా మరణించారు. దాంతో ఆసుపత్రివర్గాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. సోనియాకు ఎటువంటి అనారోగ్య సమస్యలు లేవు. కొద్ది నెలలుగా కరోనా వారియర్ గా పనిచేస్తున్నా కూడా వైరస్ సోకలేదు. అయితే ఫ్రంట్ లైన్ వారియర్సుకు వ్యాక్సినేషన్లో ప్రయారిటి ఇచ్చిన కారణంగా మిగిలిన వాళ్ళలాగే సోనియా కూడా వ్యాక్సిన్ వేయించుకున్నారు.

వ్యాక్సిన్ వేయించుకున్న రెండు రోజుల వరకు బాగానే ఉన్న సోనియా మూడో రోజు ఎందుకు హఠాత్తుగా మరణించింది ఎవరికీ అంతుబట్టడం లేదు. నర్సు మరణం విషయం తెలియటంతో ఫైజర్ టీకా తీసుకున్న వాళ్ళల్లో టెన్షన్ పెరిగిపోతోంది. ఇప్పటికే ఫైజర్ టీకాను బ్రిటన్ తో పాటు అమెరికాలో కూడా తీసుకుంటున్నారు. అలాగే మరికొన్ని దేశాల్లో కూడా అత్యవసర వినియోగానికి అనుమతొలచ్చాయి. దాంతో అనేక దేశాల్లో వ్యాక్సిన్లను ఫైజర్ కంపెనీ మొదలుపెట్టేసింది. ఇందులో భాగంగానే పోర్చుగీసులో కూడా వేసింది.

సాధారణంగా నూరుశాతం సామర్ధ్యంతో వ్యాక్సిన్ తయారు కావాలంటే కనీసం మూడేళ్ళు పడుతుంది. అలాంటిది ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న ప్రాణాంతక మహమ్మారిని ఎదుర్కొంనేందుకు కొన్ని దేశాలు యుద్ధప్రాతిపదికన వ్యాక్సిన్ ప్రయోగాల్లో కొంత మినహాయింపులు ఇచ్చేస్తున్నాయి. ఇందులో భాగంగానే మనదేశంలో కూడా భారత్ బయోటెక్ రూపొందిస్తున్న కోవాగ్జిన్, సీరమ్ కంపెనీ రూపొందిస్తున్న కోవీషీల్డ్ వ్యాక్సిన్లకు అనుమతులిచ్చింది ప్రభుత్వం.

తొందరలోనే మనదేశంలో కూడా వ్యాక్సినేషన్ మొదలవుతుందని అనుకుంటున్న సమయంలో ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్న నర్సు మృతిచెందటం సంచలనంగా మారింది. సోనియా మృతి విషయంలో ఇటు పోర్చుగీసు పోలీసులు అటు వైద్య, ఆరోగ్య శాఖ విడివిడిగా కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టాయి. మరి ఏ కారణం చేత నర్సు చనిపోయింది తెలియాలంటే కొంత సమయం పడుతుంది తప్పదు.