Trends

తమిళ హీరో కొడుకుతో మైత్రి సినిమా

తెలుగు అగ్ర నిర్మాతలు ఇప్పుడు పాన్ ఇండియా స్థాయికి తమ నిర్మాణ సంస్థలను విస్తరించే పనిలో బిజీగా ఉన్నారు. ఈ విషయంలో చాలా దూకుడుగా వెళ్తున్న ప్రొడ్యూసర్స్ నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ మీద ఈ ఇద్దరూ బహు భాషల్లో సినిమాలు ప్రొడ్యూస్ చేస్తున్నారు. తెలుగులో నంబర్ వన్ నిర్మాణ సంస్థగా వెలుగొందుతున్న మైత్రి గత రెండేళ్లలో తమిళం, మలయాళం, హిందీ భాషల్లోకి అడుగు పెట్టింది.

తమిళంలో ఆ సంస్థకు బాగా కలిసొస్తోంది కూడా. కోలీవుడ్ టాప్ స్టార్లలో ఒకడైన అజిత్ కుమార్ హీరోగా తీసిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ బ్లాక్ బస్టర్ కాగా.. ప్రదీప్ రంగనాథన్‌తో తెరకెక్కించిన ‘డ్యూడ్’ కూడా సూపర్ హిట్ అయింది. ఇప్పుడు తమిళంలో మైత్రి అధినేతలు ఇంకో సినిమాను మొదలుపెట్టారు. ఆ చిత్రం గురువారమే ప్రారంభోత్సవం జరుపుకుంది.

తమిళ సీనియర్ హీరో విక్రమ్ తనయుడు ధ్రువ్ ప్రధాన పాత్రలో మైత్రి సంస్థ కొత్త సినిమా గురించి కొన్ని నెలల ముందే వార్తలు రాగా.. ఇప్పుడా చిత్రం అధికారికం అయింది. ఈ చిత్రంతో కరణ్ అరవింద్ కుమార్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. కొన్నేళ్ల ముందు ధ్రువ్ విక్రమ్ అరంగేట్రం ఆశించిన స్థాయిలో జరగలేదు. ‘అర్జున్ రెడ్డి’ రీమేక్‌గా లెజెండరీ డైరెక్టర్ బాల మొదట తీసిన ‘వర్మ’ ఔట్ పుట్ సరిగా లేక పక్కన పెట్టేశారు.

ఆపై సందీప్ రెడ్డి వంగ శిష్యుడు గిరీశయ్య అదే చిత్రాన్ని ‘ఆదిత్య వర్మ’ పేరుతో రీమేక్ చేస్తే అది ఒక మాదిరిగా ఆడింది. ఆపై ఓటీటీకే పరిమితమైన విక్రమ్ సినిమా ‘మహాన్’లో కీలక పాత్ర చేశాడు ధ్రువ్. ఇది థియేటర్లలో రిలీజ్ కాకపోవడం అతడికి నిరాశ కలిగించింది. ఐతే గత ఏడాది మారి సెల్వరాజ్ దర్శకత్వంలో ధ్రువ్ నటించిన ‘బైసన్’ కమర్షియల్ సక్సెస్ కావడంతో పాటు నటుడిగానూ అతడికి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇప్పుడు మైత్రీ సంస్థలో చేస్తున్న సినిమాతో అతను తమిళ, తెలుగు భాషల ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేయనున్నాడు.

This post was last modified on July 2, 2026 8:31 pm

Share

Recent Posts

నంది అవార్డులు వచ్చేస్తున్నాయహో…

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌భుత్వం ప్రకటించే నంది అవార్డుల‌కు ఎంత విలువ ఉండేదో తెలిసిందే. వాటిని జాతీయ అవార్డుల‌తో స‌మానంగా చూసేవారు.…

16 minutes ago

వందేమాత‌రంపై కేంద్రానికి సుప్రీంకోర్టు షాక్‌?

జాతీయ గేయం వందేమాత‌రం వ్య‌వ‌హారంపై జ‌రుగుతున్న వివాదాలు అన్నీ ఇన్నీ కావు. దేశానికి స్వాతంత్రం రాక మునుపు నుంచి ఈ…

2 hours ago

కలెక్షన్ కింగ్ అందుకే వెనుక ఉన్నారా

ఒకప్పుడు కలెక్షన్ కింగ్ గా తొంభై దశకంలో స్టార్ హీరోలకు బలమైన పోటీ ఇచ్చిన మోహన్ బాబుకి ఇప్పటికీ ఫాలోయింగ్…

3 hours ago

జడల్ జమానాకు సెన్సార్ ట్విస్టులు

ప్యారడైజ్ సెన్సార్ అయిపోయింది. ఊహించినట్టే ఏ సర్టిఫికెట్ వచ్చింది. 2 గంటల 54 నిమిషాల సవారి జాతి ప్రపంచంలోకి తీసుకెళ్లేందుకు…

3 hours ago

ఇక పిఠాపురంలోనే పవన్ మకాం?

చాలా రోజుల తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కనిపించారు. ప్రకృతి వైద్యం కోసం కేరళం వెళ్లి 20 రోజుల…

4 hours ago

టీమిండియాకు చెమటలు పట్టించిన జపాన్

జపాన్‌తో మ్యాచ్ అంటే టీమిండియా సులభంగా గెలుస్తుందని అనుకున్నారు క్రికెట్ ఫ్యాన్స్. కానీ ఈసారి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తడి…

4 hours ago