Political News

కవిత అరెస్టు తీరును ఖండించిన జనసేన

జనసేన పార్టీ మహిళలకు ఎంత ప్రాధాన్యతనిస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర లేదు. వీర మహిళలు అని సంబోధిస్తూ పార్టీలో మహిళలకు జనసేన అధినేత పవన్ అత్యంత గౌరవమిస్తారన్న సంగతి తెలిసిందే. పార్టీ సిద్ధాంతాన్ని జనసేన నేతలు కూడా తూ.చ తప్పుకుండా పాటిస్తుంటారు. తాజాగా కల్వకుంట్ల కవితను అరెస్టు చేసిన తీరును జనసేన తెలంగాణ జనరల్ సెక్రటరీ, నిర్మాత రామ్ తాళ్లూరి ఖండించిన తీరు అందుకు నిదర్శనం.

ఇడుపు కాగితం సినిమా పేరుపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి కవిత చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కవితపై జనసేన నేతలు, కార్యకర్తలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

అయితే, ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులకు స్థలాలు కేటాయించాలంటూ టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బోడుప్పల్ లో నిరసన చేపట్టారు. ఈ క్రమంలోనే కవితను మహిళా పోలీసులు బలవంతంగా నిరసన నుంచి లాక్కొని వెళ్లారు. పోలీసులను అడ్డుకునేందుకు టీఆర్ఎస్ నేతలు ప్రయత్నించడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఆ క్రమంలో మహిళా పోలీసులతోపాటు కవిత కూడా కిందపడిపోయారు.

ఆ తర్వాత కవితను అరెస్టు చేసి బలవంతంగా పోలీసులు జీపులో ఎక్కించుకొని తీసుకువెళ్లారు. ఈ నేపథ్యంలోనే కవితను అరెస్టు చేసిన విధానాన్ని జనసేన తరఫున రామ్ తాళ్లూరి తీవ్రంగా ఖండించారు. మహిళా నాయకురాలు కవిత పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు మహిళల గౌరవానికి భంగం కలిగించేలా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాజకీయంగా కవితతో విభేదాలు ఉండొచ్చని, విమర్శలు, ప్రతి విమర్శలు సహజం అని చెప్పారు. కానీ, ఇటువంటి సందర్భాల్లో రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలని పవన్ కల్యాణ్ తమకు దిశానిర్దేశం చేశారని తెలిపారు. మహిళా నాయకుల హక్కులు, గౌరవానికి భంగం కలగకుండా గౌరవప్రదంగా వ్యవహరించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు శాఖకు రామ్ విజ్ఞప్తి చేశారు. రామ్ కామెంట్స్ పై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

This post was last modified on July 2, 2026 5:17 pm

Share

Recent Posts

మళ్ళీ మొదటికొచ్చిన మెగా కన్ఫ్యూజన్

బహుశా చిరంజీవి కెరీర్ లో చాలా సంవత్సరాల తర్వాత ఒక మెగా కన్ఫ్యూజన్ ఏర్పడింది. నిన్న విశ్వంభరకు షఫీ డబ్బింగ్…

5 hours ago

మాట నిలబెట్టుకోలేక పోయాను.. క్షమించండి

రాజకీయాల్లో నైతిక విలువలు తగ్గిపోతున్నాయని మేధావులు, ప్రజాస్వామికవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే సుదీర్ఘ రాజకీయ చరిత్ర…

5 hours ago

సుప్రీమ్ హీరో గట్టెక్కే సూచనలు ఎక్కడ

2027 సంక్రాంతి ఎంతో దూరంలో లేదు. త్వరలో పూర్తి కాబోతున్న నవంబర్ నెలని మినహాయిస్తే ఇంకో నలభై రెండు రోజులు…

9 hours ago

రాజమౌళి ముందే ఫిక్సయ్యారు కాబోలు

వారణాసి ఏప్రిల్ 7 విడుదల కావడం గురించి ఇండస్ట్రీలోనే కాదు ట్రేడ్ వర్గాల్లోనూ అనుమానాలు మొదలయ్యాయి. వాయిదా గురించి ఎలాంటి…

10 hours ago

రావిపూడికి రిపేర్ చేయాల్సిన అవసరముందా

ప్రతి సంక్రాంతికి కొత్త సినిమా రిలీజ్ చేయడమే సంకల్పంగా పెట్టుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి ఈసారి జనవరి 12 విడుదలతో…

13 hours ago

ఆ వైద్య కళాశాలలో ఏం జరుగుతోంది?

తెలంగాణ రాజ‌ధాని హైదరాబాద్‌లో నిజాం కాలం నాటి నుంచి పేద రోగుల‌కు సేవ‌లు అందిస్తున్న నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్…

16 hours ago