Trends

భర్తను చంపి.. జేసీబీతో గొయ్యి తీసి…

ఆధునిక కాలంలో వివాహేతర బంధాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. తన జీవితంలోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తను కడతేర్చిందో మహిళ. ఆపై తన చేతులతోనే చంపేసిన భర్తను పాతిపెట్టేందుకు ఆమె ఏకంగా జేసీబీతోనే గొయ్యి తీసింది. ఆపై భర్త శవాన్ని ఆ గోతిలో పాతిపెట్టి… భర్త కనిపించడం లేదని నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణలో భాగంగా ఆ అర్థాంగే ఈ ఘాతుకానికి పాల్పడినట్టు పోలీసులు తేల్చారు. ఇదెక్కడో జరిగిన ఘటన కాదు. మన తెలుగు నేలలో జరిగిన దారుణ ఘటనే.

తెలంగాణ రాజధాని హైదరాబాద్ కు కూతవేటు దూరంలోని సంగారెడ్డి జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. సంగారెడ్డి జిల్లా మనూర్ మండలం ఎల్గోయి మండలం గంగాపూర్ లో జరిగిన ఈ ఘటనపై నారాయణ్ ఖేడ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన వివరాల్లోకి వెళితే… గంగాపూర్ కు చెందిన ముత్యం రెడ్డి దంపతుల మధ్యలోకి చింటూ అనే వ్యక్తి చేరిపోయాడు. ముత్యంరెడ్డి సతీమణి అతడితో వివాహేతర బంధాన్ని మొదలుపెట్టింది. అయితే తమ వివాహేతర బంధానికి అడ్డు వస్తున్నాడని భావించి ముత్యంరెడ్డిని హత్య చేసేందుకు ఆమె సిద్ధపడింది.

అనుకున్నదే తడవుగా… ఈ విషయాన్ని ప్రియుడు చింటుతో పంచుకున్న ఆమె తన భర్తను చంపేందుకు చింటూనూ సిద్ధం చేసింది. ఇంకేముంది… తమకు అనుకూలమైన సమయంలో భర్తను ప్రియుడితో కలిసి ఆమె చంపేసింది. మరి చంపేసిన శవాన్ని ఇంటిలో పెట్టుకోలేరు కదా. శవాన్ని పాతిపెట్టేందుకు తీయాల్సిన గొయ్యి కోసం ఆమె ఏకంగా జేసీబీనే ఆశ్రయించిందట. జేసీబీతో తీసిన గోతిలో ప్రియుడితో కలిసి భర్త శవాన్ని పాతిపెట్టేసింది.

ఆ తర్వాత ఏమీ తెలియనట్లు నారాయణ్ ఖేడ్ పోలీస్ స్టేషన్ కు వెళ్లిన ఆ మహిళ… తన భర్త కనిపించడం లేదని ఫిర్యాదు చేసింది. ఆ మహిళ ఫిర్యాదు ఆధారంగా మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు… ముత్యంరెడ్డి కోసం వెతుకులాట ప్రారంభించారు. ఈ క్రమంలోనే ఆ మహిళపై అనుమానం వచ్చిన పోలీసులు… ఆమెను తమదైన శైలిలో విచారించారు. పోలీసు దెబ్బ పడగానే నిజాన్ని వెళ్లగక్కిన నిందితురాలు జరిగినదంతా పూసగుచ్చినట్టు చెప్పేసింది. ప్రియుడితో కలిసి భర్తను చంపేసి… ఆ శవాన్ని పాతిపెట్టేందుకు ఏకంగా జేసీబీతోనే గొయ్యి తీసిన ఆ మహిళను చూసి పోలీసులే షాక్ తిన్నారట.

This post was last modified on May 24, 2026 7:10 pm

Share

Recent Posts

గ్రేట‌ర్‌లో పుంజుకునేదెలా… కారు పార్టీ కుస్తీలు

గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీకి వ‌రుస దెబ్బ‌లు త‌గులుతున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ర్వాత‌.. పార్టీ పుంజుకుంటున్న ప‌రిస్థితి…

10 minutes ago

సూర్య‌తో సినిమా ఎప్పుడు… రాజ‌మౌళి జ‌వాబేంటి?

రాజ‌మౌళితో సినిమా చేయాల‌ని ఇప్పుడు ఇండియాలో ఉన్న‌ ప్ర‌తి పేరున్న హీరో ఆశ‌ప‌డుతుంటాడు అన‌డంలో సందేహం లేదు. ఐతే రాజ‌మౌళి…

2 hours ago

`వ‌ర్గాల‌`కు దూర‌మ‌వుతున్న వైసీపీ.. ?

రాష్ట్ర రాజకీయాల్లో ప్ర‌త్య‌ర్థుల‌తో వైరం ఎలా ఉన్నా.. ప్ర‌జ‌ల‌తో మాత్రం పార్టీల‌కు సాన్నిహిత్యం ఉండాలి. అది కొర‌వ‌డితే.. ఎప్పటికీ చేరువ…

3 hours ago

నాని సినిమాలో ఆ పార్ట్… ద‌ర్శ‌కుడికీ న‌చ్చ‌లేద‌ట‌

నేచుర‌ల్ స్టార్ నాని కెరీర్లో ప్ర‌త్యేకంగా చెప్పుకోద‌గ్గ చిత్రాల్లో శ్యామ్ సింగ‌రాయ్ ఒక‌టి. ట్యాక్సీవాలాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయిన రాహుల్…

3 hours ago

నాని ఎలా హ్యాండిల్ చేస్తున్నాడు

పెద్ద బ‌డ్జెట్ పెట్టి, చాలా కాలం క‌ష్ట‌ప‌డి, ఎన్నో ఆశ‌ల‌తో చేసిన సినిమాకు నెగెటివ్ టాక్ వ‌స్తే త‌ట్టుకోవ‌డం తేలిక…

3 hours ago

అమ‌రావతికి పంచ సూత్రాలు… చంద్ర‌బాబు భారీ ప్లాన్‌

ఏపీ సీఎం చంద్ర‌బాబు రాజ‌ధాని అమ‌రావ‌తి విష‌యంలో అత్యంత శ్ర‌ద్ధ చూపిస్తున్న విష‌యం తెలిసిందే. రైతుల నుంచి భూములు స‌మీక‌రించ‌డం(పూలింగ్‌)…

5 hours ago