Political News

అమ‌రావ‌తి ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్ పోర్టు ఎక్కడ?

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం నిర్మించాల‌ని.. ప్ర‌భుత్వం ప్ర‌తిపాదించిన విష‌యం తెలిసిందే. దీనిని సుమారు 5 వేల ఎక‌రాల్లో నిర్మించ‌నున్న‌ట్టు కూడా తెలిపింది. రెండో ద‌శ భూ స‌మీక‌ర‌ణ‌ను కూడా విమానాశ్ర‌యం కోస‌మే చేప‌ట్టారు. ఇప్పుడు.. దీనిపై ప‌క్కా క్లారిటీ ఇస్తూ.. ప్ర‌భుత్వం మ్యాప్‌ను విడుద‌ల చేసింది. అమరావతి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని.. తాడికొండ మండలం రావెల సమీపంలో ప్రతిపాదించారు.

ఈ విమానాశ్రయం విజయవాడకు దక్షిణ దిశలో సుమారు 35 కిలో మీట‌ర్ల‌ దూరంలో ఉండనుందని మ్యాప్‌ను బట్టి తెలుస్తోంది. మొత్తం 5 వేల ఎక‌రాల్లో 4,618 ఎకరాల‌ను ప్రపంచ స్థాయి సదుపాయాలతో విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసేందుకు వినియోగిస్తారు.

మ‌రో 380 ఎక‌రాల‌ను పార్కింగ్ స‌దుపాయం కోసం కేటాయించ‌నున్నారు. రాజధాని అమరావతి, గుంటూరు, విజయవాడ నగరాలకు అనుసంధానం దృష్ట్యా విమానాశ్ర‌య నిర్మాణం కోసం.. రావెల ప్రాంతాన్ని ఎంపిక చేసిన‌ట్టు అధికారులు తెలిపారు.

ఔట‌ర్ రింగ్‌కు స‌మీపంలో ..

రాజ‌ధాని అమ‌రావ‌తిలో.. ప్ర‌తిపాదిత ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలో ఈ విమానాశ్రయం ఉండ నుంది.
ప్రస్తుత సచివాలయం నుంచి సుమారు 15 కిలో మీట‌ర్ల‌ దూరంలో ఉంటుంది. కాగా.. ఈ విమానాశ్ర‌య నిర్మాణాన్ని పూర్తిగా కేంద్ర‌మే చేప‌ట్ట‌నుంద‌ని అంటున్నారు. రెండు ద‌శల్లో నిర్మించే ఈ విమానాశ్ర‌యాన్ని తొలి ద‌శ‌లో 3400 కోట్ల‌ రూపాయ‌లతో చేప‌ట్ట‌నున్నారు. ప్ర‌స్తుతం భూ సేక‌ర‌ణ జ‌రుగుతోంది. కొంద‌రు రైతులు కోర్టుకు వెళ్ల‌డంతో ఈ ప్ర‌క్రియకు కొంత విరామం ల‌భించిన‌ట్టు అయింది.

భారీ ప్ర‌ణాళిక‌..

అమ‌రావ‌తి అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం నిర్మాణానికి భారీ ప్ర‌ణాళికే వేయ‌నున్నారు. బోయింగ్ 777 విమానాలు దిగేలా డిజైన్ చేస్తున్నారు. రాబోయే 60 సంవత్సరాల అవసరాలకు అనుగుణంగా 5 దశల్లో విస్తరణ ప్రణాళిక రూపొందించిన‌ట్టు అధికారులు తెలిపారు. వ‌చ్చే ప‌దేళ్ల‌లో 60 ల‌క్ష‌ల మంది ప్ర‌యాణికు లు ఈ విమానాశ్ర‌యం ద్వారా సేవ‌లు పొందుతార‌ని అంచ‌నా వేస్తున్నారు.

This post was last modified on May 16, 2026 3:06 pm

Share

Recent Posts

ఏపీలో బీసీ రిజర్వేషన్లపై సంచలన తీర్పు

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అందులోనూ, ఈ సారి…

5 minutes ago

అక్టోబర్ మార్కెట్… ఎవరెవరికి జాక్‌‌పాట్

కొత్త నెల వచ్చేసింది. చూస్తుండగానే నెలలు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి. సంక్రాంతి తర్వాత రెండు మూడు నెలలు టాలీవుడ్ బాక్సాఫీస్…

19 minutes ago

రాజమౌళి టచ్ చేసిన స్క్రిప్ట్… హిట్ కొడతారా?

గ్లోబల్ బాక్సాఫీస్ ఫోకస్ మొత్తం ఇప్పుడు మహేష్ బాబు, రాజమౌళిల ‘వారణాసి’ పైనే ఉంది. అయితే ఆ భారీ చిత్రం…

59 minutes ago

దృశ్యం బ్రాండ్ విలువ మహత్యం

బాహుబలి, కెజిఎఫ్ లాంటి విజువల్ గ్రాండియర్ సీక్వెల్స్ కి క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. వందల కోట్ల బడ్జెట్, విఎఫ్ఎక్స్…

1 hour ago

టీ 20 చూస్తూ పారిశ్రామికవేత్తలతో చర్చించా

నేను క్రికెట్ మ్యాచ్ చూడ్డానికి ఎక్కడికివెళ్లినా అక్కడ కూడా పెట్టుబడుల మీద ఒప్పందాల గురించి చర్చిస్తుంటాను. ఒక టీ 20…

1 hour ago

సుడిగుండంలో చిక్కుకున్న జ‌గ‌న్ .. !

గ‌తంలో అంటే.. 2012 నాటి ప‌రిస్థితుల‌ను గ‌మ‌నిస్తే.. జ‌గ‌న్‌కు పెద్ద మైన‌స్ అనే చెప్పాలి. అప్ప‌ట్లో ఆయ‌న‌పై అక్ర‌మాస్తుల కేసులు…

2 hours ago