Trends

నీట్ పరీక్షపై సంచలన నిర్ణయం!

నీట్ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. సుమారు 70 వేల మంది విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతూ కొందరు పేపర్ లీక్ చేసిన వైనం షాకింగ్ గా మారింది. ఈ క్రమంలోనే ఈ నెల 3న జరిగిన నీట్ యూజీ పరీక్షను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. మళ్లీ జూన్ 21న ఈ పరీక్షను నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ శుక్రవారం వెల్లడించింది.

అయితే ఈ పరీక్షా విధానంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది నుంచి నీట్ పరీక్షను ఆన్ లైన్ లో నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కీలక ప్రకటన చేశారు. నీట్ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారంపై సీబీఐ విచారణ జరుగుతోందని, నిందితులను కఠినంగా శిక్షిస్తామని అన్నారు. విద్యార్థులకు ఎలాంటి నష్టం కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పరీక్ష రద్దు చేశామని అన్నారు. నీట్ పరీక్షను పారదర్శకంగా నిర్వహించడమే తమ ప్రధాన కర్తవ్యమని తెలిపారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ మాల్ ప్రాక్టీస్ జరగకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు. రీ టెస్ట్ కోసం విద్యార్థులు నచ్చిన నగరాన్ని ఎంచుకోవడానికి వారం రోజులు గడువు ఇస్తున్నామని తెలిపారు.

జూన్ 14న అడ్మిట్ కార్డులు విడుదల చేస్తామని, నీట్ కోసం మళ్లీ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పారు. సోషల్ మీడియాలో నీట్ పరీక్షపై రకరకాల ఊహాగానాలు, పుకార్లు ప్రచారంలో ఉన్నాయని, వాటిని విద్యార్థులు నమ్మవద్దని ధర్మేంద్ర ప్రదాన్ కోరారు. కేవలం పరీక్ష రాయడంపైనే దృష్టి సారించాలని విద్యార్థులకు సూచించారు.

This post was last modified on May 15, 2026 5:03 pm

Share

Recent Posts

జైలర్ 2 ప్రపంచం ఎంత కొత్తగా ఉంటుంది

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…

1 hour ago

బండ్ల గణేష్ పేరు వాడుకుంది ఎవరు?

ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…

1 hour ago

వివేకా కేసులో వాస్తవాలు కక్కిస్తాం

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…

3 hours ago

వారణాసి ముందు ఇది పెద్ద దెబ్బే

డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…

5 hours ago

కీర్తి సురేష్ ఉన్నా లాభం లేకపోయింది

మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…

5 hours ago

నాగవంశీ కారణాలు నమ్మశక్యంగా ఉన్నాయా

నిన్న రాత్రంతా ప్రచారం జరిగినట్టే ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా అఫీషియలయ్యింది. నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి…

6 hours ago