Movie News

ఆగస్ట్ 7… ఓటిటిలో కంటెంట్ వర్షం

థియేటర్లలో రేపు నాలుగైదు సినిమాలు విడుదలవుతున్న సంగతి తెలిసిందే. అయితే ప్రత్యేకంగా ఓటిటిలో వచ్చే కొత్త కంటెంట్ కోసం ఎదురు చూసే మూవీ లవర్స్ కూడా బోలెడు ఉంటారు. టికెట్లు కొనే పని లేకుండా, ఇంటి నుంచి బయలుదేరే వ్యయప్రయాసలు చూడకుండా, హ్యాపీగా ఉన్న చోటే ఎంటర్ టైన్మెంట్ కావాలని కోరుకునే ఆడియన్స్ కు లోటు లేదు. ఆగస్ట్ మొదటి వారం ఏడో తేదీ వాళ్లకు దక్కుతున్న ఆప్షన్లు చూస్తుంటే వీకెండ్ దాకా రెస్ట్ దొరికేలా లేదు.

అఖిల్ అక్కినేనిని ఎప్పటి నుంచో ఊరిస్తున్న బ్లాక్ బస్టర్ ‘లెనిన్’ రూపంలో దక్కిన సంగతి తెలిసిందే. దీన్ని పెద్ద తెరపై మిస్ అయిన వాళ్ళు చాలా ఉన్నారు. ఇవాళ అర్ధరాత్రి నుంచే జీ5లో ప్రత్యక్షం కాబోతున్నాడు. తిరువీర్, ఐశ్వర్య రాజేష్ జంటగా నటించిన ‘ఓ సుకుమారి’కి బాక్సాఫీస్ దగ్గర తిరస్కారం ఎదురైనా స్మార్ట్ స్క్రీన్ మీద ఆదరణ దక్కుతుందనే నమ్మకం టీమ్ లో ఉంది. కొంచెం పాజిటివ్ టాక్ వచ్చినా కూడా ‘హృదయం మురళి’ మన దగ్గర కనీస స్థాయిలో ఆడలేదు.

అధర్వ, తమన్, ఫహద్ ఫాసిల్ నటించిన ఈ యూత్ ఎంటర్ టైనర్ లో హీరోయిన్ అట్రాక్షన్ కూడా ప్లస్ అయ్యింది. నెట్ ఫ్లిక్స్ కాబట్టి రీచ్ ఎక్కువగా ఉండొచ్చు. బిచ్చగాడు ఫేమ్ విజయ్ ఆంటోనీ కొత్త మూవీ ‘వంద దేవుళ్ళు’ అసలెప్పుడు వచ్చిందో గుర్తు పట్టేలోపే ఏపీ తెలంగాణలో మాయమైపోయింది. ఎమోషనల్ కంటెంట్ కనక వ్యూస్ వచ్చే అవకాశాలు లేకపోలేదు. బాలీవుడ్ లో సైలెంట్ హిట్టు కొట్టిన ‘మై వాపస్ ఆవూన్గా’ రేపే రానుంది. తెలుగు డబ్బింగ్ అందుబాటులో ఉండొచ్చు.

కార్గిల్ యుద్ధం ఆధారంగా తీసిన ‘ఆపరేషన్ సఫేద్ సాగర్’లో బొమ్మరిల్లు సిద్దార్థ్ కీలక పాత్ర పోషించాడు. ట్రైలర్ ఆకట్టుకునేలానే ఉంది. ప్రైమ్ లో సెన్సేషనల్ హిట్ అందుకున్న ‘వదంది సీజన్ 2’ లో శశికుమార్ నటించడం అంచనాలు పెంచింది. ఇవి కాకుండా ఇంకో నాలుగైదు సినిమాలు సిరీస్ లు ఉన్నాయి కానీ ప్రధానంగా చెప్పుకోవాల్సినవి మాత్రం ఇవే. కొరియన్ కనకరాజు, కేజేక్యూ, డిసి కోసం థియేటర్స్ కు వెళ్లలేని వాళ్ళకు టైంపాస్ ఢోకా లేకుండా బోలెడు ఆప్షన్స్ ఉన్నాయి. 

This post was last modified on August 6, 2026 9:24 pm

Share

Recent Posts

కలిసొచ్చే కాలానికి ఛాన్స్ కొట్టేసిన కామ్రేడ్

కొన్నిసార్లు అనుకోని అదృష్టం వల్ల శకునాలు కలిసి వచ్చి జాతకం మారిపోతుంది. ఇది సినిమాలకు కూడా వర్తిస్తుంది. వెంకటేష్ వీరాభిమాని…

8 hours ago

జైలర్ 2 ప్రపంచం ఎంత కొత్తగా ఉంటుంది

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…

10 hours ago

బండ్ల గణేష్ పేరు వాడుకుంది ఎవరు?

ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…

10 hours ago

వివేకా కేసులో వాస్తవాలు కక్కిస్తాం

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…

12 hours ago

వారణాసి ముందు ఇది పెద్ద దెబ్బే

డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…

14 hours ago

కీర్తి సురేష్ ఉన్నా లాభం లేకపోయింది

మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…

14 hours ago