Political News

ఇలాగైతే కష్టమంటున్న కేసీఆర్

తెలంగాణలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించింది. 2023లో జరిగిన మూడో ఎన్నికలో ఆ పార్టీ బొక్కబోర్లా పడిపోయింది. అయితే మరో రెండేళ్లలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి సత్తా చాటాలని ఆ పార్టీ సమాయత్తం అవుతోంది.

అందులో భాగంగా గురువారం బీఆర్ఎస్ అదినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) పార్టీ ముఖ్య నేతలతో తన ఫామ్ హౌస్ లో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పార్టీ నేతల్లో సీరియస్ నెస్ తగ్గిపోయిందని చెప్పిన కేసీఆర్.. ఇకనైనా మేల్కోవాలని, లేకుంటే నష్టపోతారని వారిని హెచ్చరించారు.

రాష్ట్రంలోని తాజా పరిస్థితులపై చర్చించేందుకు గురువారం ఈ సమావేశాన్ని నిర్వహించిన కేసీఆర్… తన మనసులోని మాటను, తన చెవినపడిన విషయాలను నేతల ముందు పెట్టారు. ఈ సందర్భంగా ఒకింత ఘాటుగానే స్పందించిన కేసీఆర్.. సీరియస్ నెస్ లేని రాజకీయం చేయడం అవసరం లేదని తేల్చి చెప్పారు.

ప్రజల్లోకి వెళ్లని నేతలు విజయం సాధించినట్లుగా చరిత్రలో ఎక్కడా లేదని ఆయన ఒకింత కఠువుగానే స్పందించారు. రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోతే,… ప్రజల పక్షాన నిలిచి పోరాడాల్సిన విపక్ష బాధ్యతను నేతలు అటకెక్కించారని కేసీఆర్ మండిపడ్డారు.

పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఆదేశాలు వస్తే తప్పించి నేతలు కదలడం లేదన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా కేసీఆర్ ప్రస్తావించారు. అన్నీ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచే జరిగితే…ఇక నియోజకవర్గాల్లో ప్రత్యేకించి పార్టీకి ఇంచార్జీలు ఎందుకని కేసీఆర్ ప్రశ్నించారు.

ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో రకమైన పరిస్థితులు ఉంటాయన్న కేసీఆర్… ఆయా పరిస్థితులను బట్టి అక్కడి స్థానిక నేతలు ముందుకు సాగాలని సూచించారు. ఎన్నికలకు ఎంతో సమయం లేదన్న కేసీఆర్.. రెండేళ్లంటే కళ్లు మూసి తెరిచేలోగానే ఇట్టే సమయం గడిచిపోతుందన్నారు.

ఈ విషయాన్ని గ్రహించి పార్టీ నేతలు మసలుకోవాలని ఆయన సూచించారు. ఇప్పటికైనా జాగరూకతతో వ్యవహరించాలని, మీరు నష్టపోవద్దు, పార్టీని నష్టపోనివ్వద్దు అని కేసీఆర్ వారికి సూచించారు.

This post was last modified on May 15, 2026 11:44 am

Share

Recent Posts

మత రాజకీయమే మార్గమా సాయిరెడ్డి?

వైసీపీ మాజీ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయసాయిరెడ్డి సగటు రాజకీయ నాయకుడి నుంచి మతపరమైన రాజకీయాలు చేసి…

25 minutes ago

మెగాస్టార్ లిస్టులో వద్దనుకున్న పేరుందా

కాకా జనవరిలో సంక్రాంతి పండక్కు వచ్చేస్తుంది. తక్కువ గ్యాప్ లో విశ్వంభర దిగుతుంది. తర్వాత ఎవరితో సినిమా ఉంటుందనేది చిరంజీవి…

55 minutes ago

నటనలో కేర్‌టేకర్‌… జనం మెచ్చిన నానా పటేకర్

బాలీవుడ్ సుప్రసిద్ధ నటుడు నానా పటేకర్ కన్ను మూయడం ఇండస్ట్రీ వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. 75 వయసులో చివరి…

4 hours ago

ఇన్నేళ్ళ తర్వాత శ్రీమంతుడు రీమేకా?

కన్నడ ఫిలిం ఇండస్ట్రీలో తెరకెక్కినన్ని రీమేక్‌లు మరే భాషలోనూ వచ్చి ఉండవు అంటే అతిశయోక్తి కాదు. తెలుగు, తమిళంలో హిట్టయిన…

6 hours ago

లెజెండరీ నటుడు నానా పటేకర్ కన్నుమూత!

ప్రముఖ నటుడు నానా పటేకర్ గురువారం కన్నుమూశారు. గోవాలోని తన నివాసంలో తీవ్ర గుండెపోటుకు గురైన ఆయనను వెంటనే సమీపంలోని…

6 hours ago

‘రణబాలి’ నేర్చుకున్న ‘ప్యారడైజ్’ పాఠం

నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల క్రేజీ కాంబినేషన్లో వచ్చిన ‘ది ప్యారడైజ్’ సినిమాకు రిలీజ్ ముందు రోజు రాత్రి…

7 hours ago